.
‘పాలమూరు- రంగారెడ్డి’ ప్రాజెక్టును కేసీయార్ ఎందుకు పఢావు పెట్టాడు..? తనను ఓసారి గెలిపించిన పాలమూరు ప్రజలకు ఎందుకు, ఎలా ద్రోహం చేశాడు..? తెలంగాణ పోరాట ఎజెండాలో ప్రధానమైందే నీళ్లు అనే అంశం కదా… మరి కీలకమైన కృష్ణాజలాల్లో తెలంగాణ వాటాను తనే చేజేతులా ఎందుకు ఉరితీశాడు..? మళ్లీ ఇప్పుడు అదే పాలమూరు, మళ్లీ అదే జలయుద్ధం పేరిట… ఒక్కొక్కడి తోలు తీస్తానంటూ తెరమీదకు ఎందుకు వచ్చాడు..?
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, పొత్తు, అవగాహన, దోస్తీ అనే అంశాలు ఈమధ్య పదే పదే ప్రజల్లో చర్చకు వస్తున్నందున… కేంద్ర ప్రభుత్వం మీద, మోడీ మీద, బీజేపీ మీద కొన్ని చురకలు తగిలించాడు కేసీయార్ మొన్నటి ప్రెస్‌మీట్‌లో… పర్లేదు… ఇక తప్పనిసరై తెలంగాణ బీజేపీ నోరువిప్పింది… కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది…
Ads
ఎందుకో, మర్మమేమిటో గానీ కేంద్ర మంత్రులు సైలెంటు… కానీ రాంచందర్‌రావు, రఘునందన్, వెదిరె శ్రీరాం తదితరులు స్పందించారు… టీబీజేపీ అధ్యక్షుడి కౌంటర్ సూటిగా, పదునుగా లేదు, అనేక అంశాల్ని కలిపేసి కలగాపులగం చేశాడు గానీ ఒకటీరెండు ఇంట్రస్టింగ్ పాయింట్లున్నాయి… (వెదిరె శ్రీరాం స్పందన ఇరిగేషన్- పాలమూరు- కృష్ణాజలాల సబ్జెక్టుకు పరిమితమై, పదునుగా ఉంది…)
‘‘పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో నేను ఎంఎల్సీగా ఉన్నప్పుడు స్వయంగా ఒక సమావేశానికి హాజరయ్యాను… అప్పుడు టీఆర్ఎస్ నాయకులు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి… ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక తెలంగాణ సెంటిమెంట్ ముగిసిపోతుంది… అందుకే పాలమూరు–రంగారెడ్డిని సెంటిమెంట్ ట్రంప్ కార్డ్‌లా పెండింగ్‌లో ఉంచుతామని వారు స్వయంగా చెప్పారు…’’ ఇదీ ఆయన విమర్శ…
వెదిరె శ్రీరామ్ కౌంటర్ బెటర్… ‘‘పోతిరెడ్డిపాడు 4 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు పెరిగింది… రాయలసీమ లిఫ్టు వచ్చింది… ట్రిబ్యునల్ ముందు సరైన వాదనల్లేవు… 299 టీఎంసీలకు కేసీయార్ అంగీకార సంతకమే తెలంగాణకు మరణశాసనం…’’ ఇదీ ఆయన వివరణ…
కేసీయార్ ఈ జలయుద్ధంలో భాగం కరివెన రిజర్వాయర్ సందర్శన, దేవరకద్రలో బహిరంగసభ ప్లాన్ చేసినట్టున్నాడు… కానీ ఇదే ప్రాజెక్టుకు సంబంధించిన అనేక నిజాలు, కేసీయార్ చేసిన ద్రోహాల్ని ప్రభుత్వం ఏకంగా అసెంబ్లీలోనే చాటిచెప్పే ఆలోచనతో ఉంది… సో, తనే ఇరకాటంలో పడిపోయి, జనానికి ఏం చెప్పాలో తెలియని అయోమయావస్థలోకి వెళ్లే సిట్యుయేషన్…
డీపీఆర్ ఆయన హయాంలోనే కేంద్రానికి పంపబడింది… వాపస్ కూడా తను సీఎంగా ఉన్నప్పుడే… ఏమీ మాట్లాడలేదు… హరీష్ రావు అబద్ధాలు మరోవైపు… 80 శాతం పూర్తి చేశాం అంటాడు… ట్రయల్ రన్‌గా కొన్ని గంటలు నడిపింది ఒక్క పంపు… కాలువల్లేవు, ఒక్క ఎకరం పారిందీ లేదు… ప్రభుత్వం కేవలం ఈ ప్రాజెక్టుపైనే ఓ శ్వేతపత్రం రిలీజ్ చేస్తే బెటర్…
కేవలం లిఫ్టుల కమీషన్ల కోసమే జూరాల బదులు శ్రీశైలానికి ప్రాజెక్టు నుంచి వాటర్ ఇన్‌టేక్ ప్లాన్ మార్చబడిందనే కీలక విమర్శకు కేసీయార్, హరీష్ రావుల దగ్గర జవాబు లేదు… (కేటీయార్ ఇరిగేషన్ సబ్జెక్టు మీద మాట్లాడలేడు)… 27 వేల కోట్ల ఖర్చుతో 36 శాతం పనులు పూర్తయితే… 90 శాతం పూర్తయినట్టు చెప్పుకోవడం మరో వింత… రండి, పనులు చూపిస్తా అంటాడు హరీష్ రావు, నిజంగానే ప్రభుత్వం ఎమ్మెల్యేలతోనే ఓ టీమ్‌ను తీసుకుపోయి పెండింగ్ పనులు చూపిస్తే బెటర్…
1500 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే… బీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు పూర్తయ్యేవి కదా, ఎందుకు పట్టించుకోలేదు అని మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి ప్రశ్నకూ కేసీయార్ దగ్గర సమాధానం లేదు… 90 టీఎంసీల వాటాను 45 టీఎంసీలకు కుదించారనే హరీష్ రావు ఆరోపణ కూడా అబద్ధమే… సో, జలయుద్ధం అంటున్న కేసీయార్ తనే అసలు జలద్రోహి అనీ, ఉమ్మడి పాలనకన్నా కేసీయార్ పాలనలోనే ‘నీళ్ల’కు ద్రోహం జరిగిందనీ ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పక్కా లెక్కలు, వాదనలు చెబుతున్నాయి… జలయుద్ధం ఎవరిది..? జలద్రోహం ఎవరిది..? ఇదీ తేలాల్సింది…!!
Share this Article