.
పాకిస్థానీ భిక్షగాళ్ల గురించి ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ నిజంగా విస్తుగొలిపేలా ఉంది… ముఖ్యంగా సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలు పాకిస్థాన్ ప్రభుత్వానికి ఈ విషయంలో తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశాయి…
సౌదీ అరేబియా, యూఏఈ (UAE) వంటి దేశాలు తమ దేశాల్లో పట్టుబడుతున్న భిక్షగాళ్లలో మెజారిటీ పాకిస్థానీయులేనని వెల్లడించాయి… అక్కడి జైళ్లలో ఉన్న విదేశీ భిక్షగాళ్లలో దాదాపు 90% మంది పాకిస్థానీయులే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి…
Ads
వీరు సాధారణంగా పవిత్ర యాత్రల పేరుతో సౌదీకి వెళ్లి, అక్కడ యాత్రికుల దగ్గర భిక్షాటన చేయడం మొదలుపెడతారు… సందర్శక వీసాలపై గల్ఫ్ దేశాలకు వెళ్లి, అక్కడ గుంపులు గుంపులుగా చేరి భిక్షాటనను ఒక వృత్తిగా మలుచుకుంటున్నారు…
ఇది ఒక పెద్ద ‘మాఫియా’
పాకిస్థాన్‌లో దీని వెనుక పెద్ద ముఠాలు (Agents) పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది… ఈ ఏజెంట్లు పేద ప్రజలను ఎంపిక చేసి, వారికి వీసాలు, టికెట్లు ఏర్పాటు చేస్తారు… విదేశాల్లో భిక్షాటన ద్వారా వచ్చే సంపాదనలో సింహభాగం ఈ ఏజెంట్లకే చేరుతుంది… ఇదొక వ్యవస్థీకృత నేరం (Organized Crime) గా మారిపోయింది…
పాకిస్థాన్ ప్రభుత్వంపై ఒత్తిడి
సౌదీ అరేబియా ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించింది… భిక్షగాళ్ల ప్రవాహాన్ని అరికట్టకపోతే పాకిస్థానీయులకు ఇచ్చే వీసాల విషయంలో కఠిన నిబంధనలు విధిస్తామని హెచ్చరించింది…పాకిస్థాన్‌లో ప్రస్తుతం ఉన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం (Economic Crisis), విపరీతమైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగమే ప్రజలను ఇలాంటి మార్గాలను ఎంచుకునేలా చేస్తున్నాయి…
సౌదీ అరేబియా దేశం భిక్షాటనకు పాల్పడుతున్న దాదాపు 25 వేల మందిని గుర్తించి పంపించేసింది (Deport చేసింది)…. మరికొన్ని విస్తుపోయే నిజాలు ఇక్కడ ఉన్నాయి…
-
సౌదీ అరేబియా..: సుమారు 24,000 మందిని ఈ ఏడాది వెనక్కి పంపింది.
-
యూఏఈ (దుబాయ్)..: సుమారు 6,000 మందిని భిక్షాటన చేస్తున్నారన్న కారణంతో బహిష్కరించింది…
-
అజర్‌బైజాన్…: సుమారు 2,500 మంది పాకిస్థానీ భిక్షగాళ్లను పంపించివేసింది…
అంతర్జాతీయంగా పరువు పోతుండటంతో, పాకిస్థాన్ ప్రభుత్వం తన ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలను ముమ్మరం చేసింది… FIA (Federal Investigation Agency) ఈ ఏడాది సుమారు 66,000 మందిని విమానం ఎక్కకుండా ఎయిర్‌పోర్టుల్లోనే అడ్డుకుంది… వీరంతా టూరిస్ట్ వీసాలపై వెళ్లి అక్కడ అడుక్కునే అవకాశం ఉందని అనుమానించిన అధికారులు వారిని ఆపేయడమే కాకుండా, వేల సంఖ్యలో పాస్‌పోర్టులను రద్దు చేశారు…
పాకిస్థాన్‌కు చెందిన ఒక పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రకారం, విదేశాల్లో భిక్షాటన ద్వారా ఏటా 4,200 కోట్ల రూపాయల (PKR) వరకు ఆదాయం వస్తోందని అంచనా… కేవలం సౌదీ అరేబియా, దుబాయ్ (UAE) మాత్రమే కాకుండా, అనేక ఇతర దేశాలు కూడా పాకిస్థాన్ భిక్షగాళ్ల బెడదను ఎదుర్కొంటున్నాయి… ఇటీవల వెలుగులోకి వచ్చిన గణాంకాల ప్రకారం, సుమారు 41 దేశాల నుండి పాకిస్థానీయులు బహిష్కరణకు (Deportation) గురయ్యారు…
అజర్‌బైజాన్, ఇరాన్, ఇరాక్, ఖతార్, ఒమన్, మలేషియా, ఐరోపా దేశాలు ముఖ్యమైనవి… ఒక్క 2025లోనే ఇప్పటివరకు వివిధ దేశాల నుండి సుమారు 52,000 మంది పాకిస్థానీయులు బహిష్కరించబడ్డారు…
భారత దేశంలోని పాకిస్థానీ ప్రేమికులకు తెలియాల్సిన గణాంకాలు ఇవి... ఆపరేషన్ సిందూర్ మొదటిరోజే ఇండియా ఓడిపోయి, చేతులెత్తేసిందని కూసిన మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్విరాజ్ చౌహాన్ వంటి మూర్ఖ నాయకులకు కూడా..!!
Share this Article