మొన్న మోనాల్ అవినాష్‌ను విసురుగా ప్రశ్నించింది… ఏమనీ అంటే..? ఎందుకు నామినేషన్లను యాక్సెప్ట్ చేయవు అని…! నిజం… ఎవరైనా నామినేషన్ చేస్తే చాలు, విరుచుకుపడతాడు, అసలు నేనేంటి..? నా స్టేటస్ ఏమిటి..? ఈ బిగ్బాసోడికి వేరే దిక్కులేక, నా కాళ్లు పట్టుకుని రమ్మంటే, ఏదో పోనీలే అనుకుని వచ్చాను ఇక్కడికి… నేను తోపును, మీరా నన్ను నామినేట్ చేసేది అన్నట్టుగా కలరింగు, కవరింగు… ఇక ఏ గేమ్‌లోనో, టాస్కులోనో కాస్త ఇబ్బంది ఎదురైతే చాలు బేర్మంటాడు… ఎలిమినేషన్ ముంగిట్లో కాళ్లు గడగడా వణుకు… అవును, అదే అవినాష్‌కూ మిగతా వాళ్లకూ తేడా… తనలో బిగ్‌బాస్ షోకు అవసరమైన మెచ్యూరిటీ లెవల్స్, మైండ్ గేమ్ స్ట్రాటజీలు అంతగా కనిపించడం లేదు…
నామినేషన్స్ అనేవి గేమ్‌లో భాగం… యాక్సెప్ట్ చేయాలి… తను నామినేట్ చేస్తున్నప్పుడు ఇతర కంటెస్టెంట్లు స్వీకరించడం లేదా ఏం..? ఆలెక్కన అభిజిత్ ఒకటీరెండుసార్లు మినహా ప్రతిసారీ నామినేట్ అవుతూనే ఉంటాడు కదా… మరి తనేం అనాలి..? మోనాల్, హారిక కూడా బోలెడన్నిసార్లు నామినేట్ అయ్యారు కదా… ఎస్., ఉంటయ్, వాదోపవాదాలు, సమర్థనలు, అభియోగం అన్నీ ఉంటయ్… అవన్నీ ఉంటేనే అది బిగ్‌బాస్ గేమ్… ఈ చిన్న లాజిక్ మిస్సయితే ఎలా అవినాషూ…?
Ads
అఖిల్, సొహెల్… అప్పుడే కింద పడతారు, అప్పుడే మళ్లీ లేస్తారు, దిద్దుకుంటారు, కలిసి ఆడతారు, విడివిడిగా ఆడతారు… అదీ ఆట… ఓ స్ట్రాటజీ… మోనాల్ ఇప్పుడు ఆడుతున్న తీరు కూడా డిఫరెంటు… స్టడీగా, ఫరమ్గా, సివంగిలా ఆడుతోంది… అసలు ఆ అభిజిత్ చూడు… ఒకవైపు బిగ్‌బాస్ ఆదేశాల్ని తిరస్కరిస్తూనే… ఇంకోవైపు పదే పదే నామినేట్ అవుతూనే… మరోవైపు తనదైన తెలివితో గేమ్ ఆడుతుంటాడు.., కొంతలో కొంత అరియానాలో ఆ టెంపర్ కనిపిస్తుంది…
నిజానికి అఖిల్ తీరులో కూడా చాలా అబ్సర్డిటీ ఉంటుంది… కానీ అది మోనాల్ విషయంలోనే ప్రధానంగా… మోనాల్ తన కోసం తప్ప సెల్ఫ్ గేమ్ ఆడొద్దట… తను నామినేట్ చేయొద్దట… ఏదో ప్రామిస్ చేసిందట… అదే హారిక నిన్న తనని నామినేట్ చేస్తే అభిజిత్ ఒక చిన్న మాట అనేసి, లైట్ తీసుకుని వదిలేశాడు… అంతే… మరీ పట్టుకుని ఏదీ అతిగా సాగదీయొద్దు…
అసలు నామినేట్ చేయడం కూడా ఒక తెలివైన టాస్క్… జస్టిఫికేషన్ మాత్రమే కాదు, కాస్త బుర్ర కూడా వాడాలి… ఉదాహరణకి నిన్నటి ప్రక్రియ చూద్దాం…
ఇద్దరు, అంతకు మించి సభ్యులని నామినేట్ చేయొచ్చు… కానీ అంతిమంగా ఎవరి జార్ లో ఎక్కువ నీళ్లు ఉంటే వాళ్లు నామినేట్ అయినట్టు… హారికకు ఇది మొదట్లో అస్సలు అర్థం కాలేదు… ఇద్దరి జార్లలో సరిగ్గా సగం సగం పోసింది… కానీ అభిజిత్ ఆటలోని అసలు తిరకాసు పట్టుకుని, ఒకరికి 90 శాతం పోసి, హారికకు చటాక్, అంటే 50 ml పోశాడు… అంతే నామినేట్ చేసినట్టే కానీ ప్రమాదకరం కాకుండా… తర్వాత అందరూ తెలివిగా అదే ఫాలో అయ్యారు… అది బుర్ర వాడటం అంటే…
ఈరోజు ఫినాలే కార్డ్ కోసం సాగిన ఆవు పాల పోటీ కూడా అంతే… ఇదుగో ఇక్కడే అవినాష్ పలు తప్పుటడుగులు… చివరికి నేను ఆడను అంటూ ఫ్రస్ట్రెట్ అయిపోయి పెడ బొబ్బలకి దిగాడు… నేను ఇంటికి పోతా, నాకొద్దు ఈ ఆట, నన్ను టార్గెట్ చేశారు, నన్ను ఎలిమినేట్ చేయండి అని అరవసాగాడు… శోకాలు పెట్టాడు… అసలే మొన్న జనం ఎలిమినేట్ చేశారు… ఎవిక్షన్ పాస్ పుణ్యమా అని బతికిపోయాడు…
ఇక ఇప్పుడు ఆ ఫ్రస్టేషన్ కూడా చూపించేసరికి జనం భీకరమైన trolling స్టార్ట్ చేశారు… ఈసారి ఇంటికి పంపిస్తాంలే అని వెక్కిరింపులు… ఇంతా చేసి, మళ్లీ తనే తెలివిగా పాల కల్తీకి దిగాడు… మోనాల్ క్యాన్ నుంచి చోరీ చేశాడు బిగ్ బాస్ చెప్పాడు కదా, ఎలా ఆడినా సరే అని సమర్థన… కానీ బిగ్‌బాస్ ఒప్పుకోలేదు… ఆ కల్తీ తప్పుకి అవినాష్ డిబార్ అయ్యాడు… అంతేకాదు, మోనాల్ తనను తన్నింది… అదేమంటే, తనను ప్రెస్ చేశాడన్నది… కావాలని కాకపోవచ్చు, కానీ ఇదీ బ్యాడ్ రిమార్కే…
మరోవైపు కూల్ గా ఆవు కాళ్ళ వెనుక కూర్చుని అభిజిత్ తాపీగా సీసాలు నింపుకున్నాడు… అక్కడే క్యాన్ పెట్టుకుని, అందులో దాచేశాడు… అటూ ఇటూ పరుగులు లేవు… ఫెయిర్ గేమ్… కానీ సోహెల్, అఖిల్ మాత్రం కలిసి ఆడుతూ, షేర్ చేసుకుంటూ, సీసాలు దాస్తూ, కిందామీదా పడ్డారు… మరోవైపు ఫెయిర్ గా ఆడటానికి ట్రై చేసి, ఫెయిలై అరియానా, మోనాల్ కూడా ఔట్ అయ్యారు… చివరికి అభిజిత్, అఖిల్, సొహెల్, హారిక సెకండ్ రౌండ్ కి వెళ్ళారు… అందుకే మరి, రూల్ ఎరిగి తెలివిగా ఆడాలి… ప్చ్, అవినాష్, నువ్వు పూర్తిగా ట్రాక్ తప్పినవ్… నీది కల్తీ ఆట…! ఫౌల్ ప్లే..!!
Share this Article