Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భేష్ అలిస్సా..! కలలే కాదు, జీవనత్యాగం… ఖగోళ విజయం వైపు..!!

December 26, 2025 by M S R

.

అరుణగ్రహంపై మనిషి అడుగు పెట్టాలి… ఆ అడుగు నాదే కావాలి…. వావ్, ఇదీ లక్ష్యం, ఇదీ సంకల్పం, ఇదీ మనిషి తనను తాను అభినందించుకునే అసలైన తెగువ, సాహసం… మళ్లీ రాలేనేమోనని తెలిసీ, ప్రాణాలను పణంగా పెట్టి… విశ్వాంతరాల్లో తన అడుగు ముద్ర వేయడానికి తపన పడుతున్న ఓ మహిళ కథ ఇది…

అసలు చదువుతుంటే, రాస్తుంటే ఎంత బాగుందో… మనుషులు రెండు రకాలు… కొందరు తాము పుట్టిన నేల మీద మాత్రమే బతకాలనుకుంటారు… మరికొందరు తాము పుట్టిన జాతి గర్వించేలా కొత్త ప్రపంచాలను వెతకాలనుకుంటారు… అలిస్సా కార్సన్ రెండో రకానికి చెందిన అరుదైన ధీరవనిత…

Ads

ఆమె చూపు భూమి మీద లేదు, భూమికి అవతల ఉన్న ఆ ఎర్ర గ్రహం మీద ఉంది… ఆమె ప్రయాణం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు; అది మానవ నాగరికతను ‘అంతర్ గ్రహ జాతి’గా (Interplanetary Species) మార్చే ఒక మహా యజ్ఞం!

జంక్ విలాసాలు, ఫేక్ కలలు, ప్రలోభాల్లో పడి బతికే గొంగళిపురుగు లేదా పుట్టగొడుగులాంటి జీవితం కాదు ఆమె కోరుకుంది… అంగారక గ్రహ యాత్ర అనేది మృత్యువుతో జూదం అని అందరికీ తెలుసు… 9 నెలల సుదీర్ఘ ప్రయాణం, ప్రాణాంతక రేడియేషన్, దిగిన తర్వాత మళ్ళీ భూమికి తిరిగి వస్తామో లేదో తెలియని అనిశ్చితి…

సాధారణంగా ఎవరైనా ఇలాంటి ప్రయాణానికి వెనకాడుతారు… కానీ అలిస్సా అంటుంది.. “నా ప్రాణం ముఖ్యం కాదు, అక్కడ మనిషి అడుగు పడటం ముఖ్యం…” ఒక 23 ఏళ్ల యువతి తన యవ్వనాన్ని, సుఖాలను వదులుకుని, కేవలం విజ్ఞాన శాస్త్రం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టడం అనేది ఈ యుగంలో సూపర్ ఆదర్శం…

తుచ్ఛమైన మతబోధనలతో వెనుకటి రాతి యుగం వైపు ప్రయాణించే ఉగ్రవాదులు, ఛాందసులు చదవాల్సిన స్టోరీ ఆమె…

శిక్షణ: చెమటను రక్తంగా మార్చుకున్న సాధన

ఆశయం కేవలం కల అయితే సరిపోదు, దానికి కఠోర శ్రమ తోడవాలి… అలిస్సా గడిచిన 15 ఏళ్లుగా ఒక తపస్సు చేస్తోంది… శూన్యంలో ఎలా ఉండాలో (Zero-G), నీటి అడుగున శ్వాస ఆడని స్థితిలో ఎలా పని చేయాలో ఆమె నేర్చుకుంది…

బహుముఖ ప్రజ్ఞ…: వ్యోమగామిగా వెళ్లడానికి కేవలం ధైర్యం ఉంటే సరిపోదు… అందుకే ఆమె ఆస్ట్రోబయాలజీ చదివింది.., నాలుగు భాషలు నేర్చుకుంది.., పైలట్ లైసెన్స్ పొందింది., ఆమె జీవితం మనకు ఒక పాఠం…: “నీ గమ్యం ఎంత పెద్దదైతే, నీ సాధన అంత కఠినంగా ఉండాలి…”

తండ్రి త్యాగం: ఒక మహా వృక్షంలాంటి అండ

ఈ కథలో మనం నిజమైన ఆదర్శంగా తీసుకోవాల్సింది అలిస్సా తండ్రి బెర్ట్ కార్సన్ను… తన కళ్లముందే కూతురు తిరిగి రాని లోకాలకు వెళ్తుంటే ఏ తండ్రి అయినా అడ్డుపడతాడు… కానీ బెర్ట్, ఆమె రెక్కలకు బలాన్నిచ్చాడు…

  • తన ప్రేమను స్వార్థంగా మార్చుకోకుండా, తన కూతురిని ‘విశ్వ పుత్రిక’గా చూడగలిగిన గొప్ప మనసు ఆయనది…

  • ఒక తండ్రిగా ఆయన సాహసం, అలిస్సా సాహసం కంటే తక్కువేమీ కాదు… పిల్లల కలల కోసం తమను తాము త్యాగం చేసుకునే తల్లిదండ్రులకు ఆయనొక గొప్ప ఉదాహరణ…

యుగకర్త: రేపటి తరం దేవత

చిన్నప్పుడు మనం చదువుకున్న కథల్లో దేవతలు ఆకాశంలో ఉండేవారు… అలిస్సా నిజంగానే ఆకాశంలోకి వెళ్లి, మరో గ్రహం మీద అడుగుపెట్టిన మొదటి మనిషిగా ‘దేవత’లాగే మిగిలిపోతుంది… 2035లో ఆమె అంగారకుడిపై జెండా పాతినప్పుడు, అది భూమిపై ఉన్న ప్రతి యువతలో కొత్త ఆశను నింపుతుంది… “అసాధ్యం ఏదీ లేదు” అని చాటి చెబుతుంది… (మనం ఇప్పుడు కాసేపు చంద్రుడిపై అడుగు పెట్టిన మనిషి బాపతు ఫేక్ కథల్ని కాస్త పక్కన పెడదాం)

space star




వ్యోమగామి అలిస్సా కార్సన్ (23 ఏళ్లు)… తండ్రి/మార్గదర్శి బెర్ట్ కార్సన్… లక్ష్యం ‘మిషన్ మార్స్’ – 2035… శిక్షణ స్థాయి నాసా పాస్‌పోర్ట్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన ఏకైక వ్యక్తి… భాషలు ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్, చైనీస్ (కమ్యూనికేషన్ కోసం)




ముగింపు: మనకేమిటి సందేశం?

అలిస్సా కార్సన్ కథ విన్నాక మనకు కలిగే ఆలోచన ఒక్కటే… మనం దేని కోసం బతుకుతున్నాం? కేవలం రోజువారీ పనుల కోసమా? లేక మన వెనుక ఒక చరిత్రను వదిలి వెళ్లడం కోసమా? అలిస్సా చూపిస్తున్న ధైర్యం, ఆమె తండ్రి చూపిస్తున్న ఉదారత మనందరికీ ఒక ప్రేరణ… మరణాన్ని, అంటే తిరిగి రాలేని ఓ ఖగోళ ప్రయాణాన్ని కూడా చిరునవ్వుతో ఆహ్వానిస్తూ, మానవజాతి భవిష్యత్తు కోసం అడుగులు వేస్తున్న ఆమె ప్రయాణం సఫలం కావాలని కోరుకుందాం…

ఆమె అంగారక గ్రహం మీద అడుగుపెడితే, అది కేవలం నాసా విజయం కాదు... అది మనిషి సంకల్ప విజయం! ఒక సాధారణ యువతి నుంచి 'మార్టిన్ గర్ల్' గా ఎదిగే ఆమె ప్రయాణం నిజంగా అద్భుతం... ఒక ఆడ మనిషి డ్రెస్సింగు మీద రచ్చ చేసే మగ క్షుద్రుల కోసం ఈ కథనం...

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జై గురుదత్త… ‘ముచ్చట’ చెప్పిందని కురువాపురం వెళ్లాను… నా అనుభవం…
  • భేష్ అలిస్సా..! కలలే కాదు, జీవనత్యాగం… ఖగోళ విజయం వైపు..!!
  • పాకిస్థాన్ అంటే..? ఉగ్రవాదులు ప్లస్ భిక్షగాళ్ల భారీ ఎగుమతిదారు..!!
  • వృషభ..! పునర్జన్మల్లోనూ వెంటాడే శాపాలు… జనం మెచ్చని ఓ సోది స్టోరీ..!!
  • ఎవరు ఈ తారిక్ రెహమాన్..! బంగ్లాదేశ్ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్..!!
  • వైష్ణవీ శర్మ..? ఎందుకంత జనం ఆసక్తి…?! తెగ వెతికేస్తున్నారు..!
  • పరుచూరి బ్రదర్స్ చెప్పి ఉండాల్సింది… సినీరంగ నైజం చెప్పనివ్వదు…
  • రాముడు కృష్ణుడు అనగానే ఎన్టీయార్ గుర్తొచ్చినట్టు… క్రీస్తు అనగానే…!!
  • బుక్ ఫెయిర్ సందర్భం చూసి మరీ వదిలినట్టుంది యండమూరి ఈ పోస్టు..!!
  • మెప్పించావు దర్శకా..! చాలా క్లిష్టమైన ప్రయోగాన్ని ఛేదించావుపో…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions