Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇప్పటి టెక్నాలజీ లేకపోయినా… అప్పట్లోనే వెండితెరపై వెలిగిన అడవి…

December 27, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ….. 1974 లో మంచి మనుషులు సినిమాలో బాల నటుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించిన జగపతి బాబు హీరోగా రెండో సినిమా 1989 డిసెంబరులో వచ్చిన ఈ అడవిలో అభిమన్యుడు సినిమా .

మలయాళంలో హిట్టయిన దౌత్యం అనే సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . మలయాళంలో మోహన్ లాల్ , పార్వతి , లిజీ , సురేష్ గోపి , ఏంటొనీ  ప్రభృతులు నటించారు .‌

Ads

ఈ అడవిలో అభిమన్యుడు సినిమా ఓ ఎడ్వెంచర్ సినిమా . మలయాళం సినిమాను డైరెక్ట్ చేసిన అనిల్ కుమారే మన తెలుగు సినిమాను కూడా చాలా బాగా డైరెక్ట్ చేసారు . ‌బాహుబలి రాజమౌళికి ఉన్న టెక్నాలజీ ఎడ్వాంటేజ్ 1988/89 లో వాళ్ళకు లేకపోయినా అడవుల్లో , జలపాతాలలో , నదుల్లో  వగైరా చాలా బాగా డైరెక్ట్ చేసారు .‌

స్టోరీ ఏందంటే …: కల్నల్ రంగనాధ్ దేశరక్షణకు సంబంధించిన ఒక రహస్య ఫైలుని మరో చోట అందించేందుకు కెప్టెన్ సురేష్ అనే తన స్వంత అల్లుడిని ఎంచుకుంటాడు . ఈ పాత్రలో వినోద్ కుమార్ నటించారు .‌ఫ్లైట్ కెప్టెనుగా జగపతిబాబు స్నేహితుడిని పంపుతారు . దురదృష్టవశాత్తు ఆ విమానం అడవిలో కూలిపోతుంది .‌

వాళ్ళను రక్షించడానికి కెప్టెన్ అభిమన్యుని పంపుతారు . మొదట ఇష్టం లేకపోయినా ఆ విమానం పైలట్ అభిమన్యుకు ఆప్తమిత్రుడు . వెళ్ళటానికి ఇష్టం లేకపోవటానికి ఓ కధ ఉంది . గతంలో వినోద్ కుమార్ భార్య , రంగనాధ్ కూతురు ఐశ్వర్య , జగపతిబాబు ప్రేమికులు . వారి పెళ్ళికి అడ్డం పడి ఐశ్వర్యను బావ వినోద్ కుమార్ తో పెళ్లి చేస్తాడు . ఆ ట్రయాంగ్యులర్ ప్రేమలో వినోద్ కుమార్ , జగపతిబాబు బధ్ధ విరోధులు అవుతారు .

రెస్క్యూ ఆపరేషనుకు వెళ్ళిన జగపతిబాబు అడవిలో ఆదిమ జాతి వారిని తప్పించుకుని వెళ్లి డ్రగ్స్ వ్యాపారం చేసే ఏంటొనీ సైన్యానికి దొరుకుతాడు . అక్కడే బంధించబడిన వినోద్ కుమార్ని రక్షించుకుని జగపతిబాబు పై అధికారులకు అప్పచెప్పటంతో సినిమా ముగుస్తుంది .

సినిమా అంతా బిర్రుగా సాగుతుంది . జగపతిబాబు రెండో సినిమా కదా . కష్టపడాల్సి వచ్చింది. పైగా స్వంత గొంతు కాదు . మరెవరో డబ్బింగ్ చెప్పారు . ఇతర ప్రధాన పాత్రల్లో ఐశ్వర్య , రంగనాధ్ , గుమ్మడి , ప్రియాంక , కుయిలీ , ఏంటొనీ , ప్రియాంక  తదితరులు నటించారు .

కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగానే ఉంటాయి . పచ్చని పచ్చిక వెచ్చని కోరికను రెచ్చగొడుతూ ఉన్నది , పుట్ట మీద పాలపిట్ట పట్టబోతే అంటూ రెండు డ్యూయెట్లు జగపతిబాబు , ఐశ్వర్య మీద ఉంటాయి . అడవిలో కుయిలీ గ్రూప్ పాట ఒకటి . ఆత్రేయ గారు పాటల్ని వ్రాయగా , బాలసుబ్రమణ్యం , చిత్ర పాడారు . సత్యానంద్ డైలాగులను వ్రాసారు .

సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకముందు చూడనివారు తప్పక చూడవచ్చు . It’s a movie of action and adventure . నేను పరిచయం చేస్తున్న 1205 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్



అవునూ... భారతంలో అభిమన్యుడు కీలక ఆపరేషన్‌లోకి వెళ్లి మళ్లీ రాడు... ఈ హీరో సక్సెస్ కదా, మరి అభిమన్యుడు ఆప్ట్ పదమేనా..? కానీ ఇప్పుడు ఆ సినిమాను చూస్తుంటే అప్పటి జగపతిబాబు అప్పియరెన్స్ నవ్వొస్తుంది...



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తేడా వస్తే… ఆదుకునేవాడు ఉండదు… ఆడుకునేవాళ్లు తప్ప…
  • రాముడి అయోధ్యలో ఓ కొరియన్ రాణి విగ్రహావిష్కరణ..! ఏమిటీ ఆమె కథ..!!
  • మేడారంపైనా బీఆర్ఎస్ క్యాంప్ ‘చేతబడి’..!! రాజకీయ క్షుద్ర విద్య…!!
  • ఇప్పటి టెక్నాలజీ లేకపోయినా… అప్పట్లోనే వెండితెరపై వెలిగిన అడవి…
  • అండగా హైదరాబాదుండగా… లెక్కలు రావన్న బెంగెందుకూ దండగ..!
  • బాబ్బాబు వదిలేయండి… మగ శివాజీ వేడికోలు… సినిమాపై వివాద ప్రభావం…
  • నో నో… మగ శివాజీకి ఈ పోస్టుకూ లింక్ లేదు… చదవాల్సిన పని లేదు…
  • జై గురుదత్త… ‘ముచ్చట’ చెప్పిందని కురువాపురం వెళ్లాను… నా అనుభవం…
  • భేష్ అలిస్సా..! కలలే కాదు, జీవనత్యాగం… ఖగోళ విజయం వైపు..!!
  • పాకిస్థాన్ అంటే..? ఉగ్రవాదులు ప్లస్ భిక్షగాళ్ల భారీ ఎగుమతిదారు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions