.
Pardha Saradhi Upadrasta ….. నీరు = శక్తి | దక్షిణ ఆసియాలో భారత్ కొత్త వ్యూహాత్మక ఆట
ఇప్పుడు దక్షిణ ఆసియాలో రెండు కీలక నీటి ఒప్పందాలు ఒకే దిశలో కలుస్తున్నాయి.
పాకిస్తాన్‌తో సింధు నదీ ఒప్పందం
బంగ్లాదేశ్‌తో ఫరక్కా నీటి ఒప్పందం (2026లో ముగింపు)
ఇవి రెండూ కలిపి చూస్తే — నీరు వనరు మాత్రమే కాదు… రాజకీయ ఆయుధం.
Ads
🔴 1️⃣ పాకిస్తాన్ – సింధు నదీ ఒప్పందం: “భారత్ ఆపేయటం” అంటే ఏంటి?
1960లో కుదిరిన Indus Waters Treaty ప్రకారం:
నదుల విభజన
పాకిస్తాన్‌కు
• Indus River
• Jhelum River
• Chenab River
భారత్‌కు
• Ravi River
• Beas River
• Sutlej River
⚠️ ముఖ్యమైన నిజం: భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేయలేదు.
కానీ —
#ఫహల్గం దాడి తరువాత డేటా షేరింగ్ తగ్గించడం,, సంయుక్త కమిషన్ సమావేశాలు ఆలస్యం చేయడం,, టెక్నికల్ సహకారాన్ని ఫ్రీజ్ చేయడం ద్వారా వ్యూహాత్మక ఒత్తిడి పెంచింది.అంటే తాత్కాలికముగా ఒప్పందాన్ని ఆపేసింది. సహకరించటం మానేసింది.
ఇది Legal Exit కాదు…, ఇది Strategic Freeze.
🔥 2️⃣ దీనివల్ల పాకిస్తాన్‌పై పడిన ప్రభావాలు
🌾 వ్యవసాయం
• పాకిస్తాన్ వ్యవసాయం లో 80% వరకు సింధు నది వ్యవస్థపై ఆధారితం
• నీటి ప్రవాహంపై అనిశ్చితి = పంటల ప్లానింగ్ .
⚡ విద్యుత్ ఉత్పత్తి
• హైడ్రో పవర్ ప్రాజెక్టులు నదీ ప్రవాహ డేటాపైనే ఆధారపడతాయి
• డేటా లేకపోవడం వల్ల దీర్ఘకాలిక విద్యుత్ ప్రణాళికలు గందరగోళం
దెబ్బ
• భారత్ నీరు ఎప్పుడూ వదులుతుంది తెలియదు, ఎప్పుడు ఆపేస్తుంది తెలియదు, దానింవల విద్యుత్ ఉత్పత్తి లో ఆటంకాలు
🗳️ రాజకీయ స్థిరత్వం
• నీటి కొరత = ప్రజా అసంతృప్తి
• ప్రభుత్వంపై, సైన్యంపై ఒత్తిడి పెరుగుదల. ఆ ప్రాంతాల్లో రోజూ నిరసబలు జరుగుతున్నాయి
🌍 అంతర్జాతీయంగా
“వాటర్ సెక్యూరిటీ” అంశం గ్లోబల్ ఫోరమ్‌లకు వెళ్లింది. కానీ ఒప్పందం రద్దు కాలేదని భారత్‌పై చట్టపరమైన దాడి కష్టం. ప్రపంచ బ్యాంక్ కూడా అది రెండు దేశాల మధ్య ఒప్పందం, మేము కేవలం ఆర్థిక సహాయం చేశాం, ప్రాజెక్ట్ ఎలా నడుపుకుంటారో వాళ్ళిస్తాం అని చేతులు ఎత్తేసింది….
🟠 3️⃣ ఇదే వ్యూహం ఇప్పుడు బంగ్లాదేశ్ దిశగా?
బంగ్లాదేశ్ తో పశ్చిమ బెంగాల్‌లోని ఫరక్కా బ్యారేజి ద్వారా గంగా నది నీటి పంపిణీపై ఉన్న ఫరక్కా ఒప్పందం 2026లో ముగుస్తోంది.
🔑 ఇక్కడ కీలక తేడా:
• పాకిస్తాన్ విషయంలో — ఒప్పందం ఉంది, కానీ ఒత్తిడి,
• బంగ్లాదేశ్ విషయంలో — ఒప్పందమే ఉండదు (కొత్తది కుదిరే వరకూ). భారత్ ఒప్పందానికి కూడా వెళ్లకపోవచ్చు. వెళ్ళినా షరతులతో వత్తిడి పెట్టచ్చు.
అంటే నీటి పంపిణీ ఇక ఆటోమేటిక్ కాదు, అది పూర్తిగా రాజకీయ చర్చలపై ఆధారితం
🧠 4️⃣ భారత్‌కు వచ్చే వ్యూహాత్మక లాభం
✔️ నదులు = డిప్లమసీ సాధనం
✔️ నీరు = ప్రెజర్ పాయింట్
✔️ ఒప్పందాలు = పవర్ స్ట్రక్చర్
భారత్ ఇస్తున్న స్పష్టమైన సంకేతం:
> “శత్రుత్వం ఉంటే — నీరు కూడా నెగోషియేషన్ అంశమే.”
🔚 తుది మాట
భవిష్యత్ దక్షిణ ఆసియా ఘర్షణలు
బాంబులతో కాదు… బారేజీలు, డ్యామ్‌లు, నీటి ఒప్పందాలతో, వాణిజ్య ఒప్పందాలతో జరుగుతాయి. సరిహద్దులు మ్యాప్‌లో ఉంటాయి… నదులు వాణిజ్యం పాలసీలో ఉంటాయి.
పాకిస్తాన్ తో పూర్తి వాణిజ్యమును రద్దు చేసుకున్నాం. అటు నుండి అఫ్గాన్ కూడా వాణిజ్యం రద్దు చేసుకుంది పాక్ తో.
ఇప్పుడు బంగ్లా వంతు. ఇప్పుడు కొంత సంయమనం పాటిస్తున్న చర్చల సందర్భములో గట్టిగా వత్తిడి పెడతారు. విదేశీ శక్తులు ప్రభుత్వాలను మార్చగలవు కానీ ఇలాంటి వాటిల్లో ఏమి చేయలేవు. వాళ్ళేమో ఎక్కడ నుండి నీళ్ళు తెచ్చినివ్వలేరుగా? అది సంగతి. –– ఉపద్రష్ట పార్ధసారధి
#IndusWatersTreaty #FarakkaTreaty #WaterPolitics #IndiaPakistan #IndiaBangladesh #RiverDiplomacy #SouthAsia #Geopolitics #PardhaTalks
Share this Article