.
నేడు సోషల్ మీడియాలో రీల్స్ ఓపెన్ చేసినా లేదా యూట్యూబ్ చూసినా భక్తి భావంతో నిండిన వీరి గళం వినిపించకుండా ఉండదు… అనేక నగరాల్లో వీళ్ల భజనలు, కీర్తనలు, పాటల పరిమళాలు వ్యాపిస్తున్నాయి… వీరిద్దరి మధ్య ఉన్న పోలికలు, వారి నేపథ్యం, ప్రస్తుత రాజకీయ ప్రాధాన్యతను పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి…
శివశ్రీ స్కంధప్రసాద్…: ఈమె దక్షిణ భారత శాస్త్రీయ సంగీత (కర్ణాటక సంగీతం) వారసత్వం నుంచి వచ్చింది… మృదంగ విద్వాంసుడు జె. స్కంధప్రసాద్ కుమార్తెగా చిన్నతనం నుంచే కళల్లో ఓనమాలు నేర్చుకున్నది… ఈమె కేవలం గాయని మాత్రమే కాదు, అద్భుతమైన భరతనాట్యం కళాకారిణి కూడా… ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి సినిమాల్లో ఆమె పాడిన పాటలు మంచి గుర్తింపు తెచ్చాయి…
Ads
మైథిలి ఠాకూర్…: బీహార్‌కు చెందిన మైథిలి… హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం, జానపదం (మైథిలి, భోజ్‌పురి) భజనలకు పెట్టింది పేరు… రియాలిటీ షోలు, యూట్యూబ్ ద్వారా వెలుగులోకి వచ్చి, తక్కువ సమయంలోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నది…
ఇద్దరూ కూడా బీజేపీ భావజాలంతో, దేశాభివృద్ధి, సాంస్కృతిక పునరుజ్జీవనంతో ముడిపడి ఉండటం విశేషం…
శివశ్రీ బెంగళూరు సౌత్ ఎంపీ, యువనేత తేజస్వి సూర్య భార్యగా ఈమె బీజేపీ శ్రేణుల్లో సుపరిచితురాలు… చెన్నై వెడ్స్ బెంగళూరు… వీరి వివాహం మార్చి 2025లో ఘనంగా జరిగింది… ఒక ఎంపీ భార్యగా ఉంటూనే తన సంగీత ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు…
మైథిలి రాజకీయాల్లో నేరుగా రంగంలోకి దిగింది… 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలీనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించింది… దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేలలో ఒకరిగా ఆమె రికార్డు సృష్టించింది…
డిజిటల్ విప్లవం…: ఇద్దరూ కూడా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా సంప్రదాయ సంగీతాన్ని నేటి ‘జెన్-జడ్’ (Gen-Z) తరానికి దగ్గర చేశారు…
ప్రభావం…: శివశ్రీ తన ‘ఆహుతి’ (Ahuti) ప్లాట్‌ఫారమ్ ద్వారా శాస్త్రీయ కళలను ప్రోత్సహిస్తుంటే, మైథిలి తన తమ్ముళ్లతో కలిసి చేసే భజన వీడియోలతో ఇంటింటికి చేరువైంది…
పోలికలు ఒకే చోట…
| ఫీచర్ | శివశ్రీ స్కంధప్రసాద్ | మైథిలి ఠాకూర్ |
| సంగీత శైలి | కర్ణాటక శాస్త్రీయ సంగీతం | హిందుస్థానీ & జానపద సంగీతం |
| రాజకీయ హోదా | ఎంపీ తేజస్వి సూర్య భార్య | బీజేపీ ఎమ్మెల్యే (బీహార్) |
| విద్యా నేపథ్యం | బయో ఇంజనీర్ | సంగీతంలో గ్రాడ్యుయేషన్ |
| ప్రత్యేకత | భరతనాట్యం & ఆధ్యాత్మిక ప్రసంగాలు | బహు భాషా భజనలు & మైథిలి గీతాలు |
| అవార్డులు | కళా పురస్కారాలు | నేషనల్ క్రియేటర్స్ అవార్డు (PM మోదీ చేతుల మీదుగా) |
శివశ్రీ వయస్సు 30, మైథిలి వయస్సు 25… ఇద్దరి వయస్సుల నడుమ తేడా అయిదేళ్లే అయినా మైథిలి ఇంకా చిన్న పిల్లగా కనిపిస్తుంది… శివశ్రీలో కాస్త ప్రౌఢతనం కనిపిస్తుంది… ఇద్దరి గొంతూ దాదాపు సేమ్…
శివశ్రీ స్కంధప్రసాద్ తన మధుర గానంతో దక్షిణాది సంప్రదాయాన్ని కాపాడుతుంటే, మైథిలి ఠాకూర్ ఉత్తరాది జానపద, ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లుతున్నది… ఇద్దరూ కూడా సంప్రదాయ దుస్తుల్లో, భారతీయ సంస్కృతికి అద్దం పడుతూ యువతకు రోల్ మోడల్స్‌గా నిలుస్తున్నారు…
శైలీ భేదం…: శివశ్రీ ప్రధానంగా కర్ణాటక సంగీతం (South Indian Classical) తమిళ/తెలుగు భక్తి కీర్తనలపై దృష్టి పెడుతుంది… మైథిలి ఠాకూర్ హిందుస్థానీ (North Indian Classical) హిందీ/మైథిలి జానపద శైలిలో పాడుతుంది…
భౌగోళిక ప్రాంతాలు…: శివశ్రీ కార్యకలాపాలు ఎక్కువగా బెంగళూరు,, చెన్నై కేంద్రంగా సాగుతుంటాయి… మైథిలి ఠాకూర్ బీహార్, ఢిల్లీ కేంద్రంగా తన సంగీత, రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది… ఈమధ్య మహారాష్ట్రలో ఎక్కువ ప్రోగ్రామ్స్ చేస్తోంది…
ఒకవేళ వీరిద్దరూ కలిస్తే…? దక్షిణాది కర్ణాటక బాణీ, ఉత్తరాది హిందుస్థానీ బాణీ కలిస్తే అది ఒక అద్భుతమైన ‘జుగల్బందీ’ అవుతుంది… ముఖ్యంగా ‘సనాతన ధర్మం’ అనే ఉమ్మడి ఎజెండాతో ముందుకు వెళ్తున్న వీరిద్దరూ భవిష్యత్తులో ఏదైనా పెద్ద ఆధ్యాత్మిక వేదికపై కలిసే అవకాశం లేకపోలేదు…!!
Share this Article