.
నటుడు షారూక్ ఖాన్ మీద హిందూ సమాజం మండిపడుతోంది… ఒకవైపు బంగ్లాదేశీయులు ఆదుకున్న మన చేయిని నరికేస్తూ, హిందువులను తగలబెడుతూ ఉంటే, ఈ షారూక్ తన కేకేఆర్ టీమ్ కోసం ఓ బంగ్లా క్రికెటర్‌ను తీసుకున్నాడని..!
నెట్‌లో షారూక్ మీద, బీసీసీఐ మీద, ఐపీఎల్ ఆర్గనైజర్ల మీద నిప్పులు కురుస్తున్నాయి… తను మాత్రం స్పందించలేదు… ఆగ్రహావేశాలు ఎక్కువయ్యేసరికి బీసీసీఐ తాజాగా సదరు బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమన్‌ను జట్టు నుంచి రిలీజ్ చేయాలని ఆదేశించింది… అతని స్థానంలో వేరే ఇతర ఆటగాడిని తీసుకోవచ్చునని చెప్పింది… అంటే నాన్ బంగ్లా ఆటగాడిని…
Ads
ఇది గాసిప్ కాదు, బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా ధ్రువీకరించాడు… బంగ్లాదేశ్ పక్కా భారత వ్యతిరేకతను కనబరుస్తోంది… అదిప్పుడు చైనాకు, పాకిస్థాన్‌కు తోకగా మారింది… మతం కారణంగా విద్వేషాన్ని ప్రదర్శిస్తోంది… బంగ్లాదేశ్ అంటే భస్మాసురుడు…
ఇప్పుడు మరో ప్రశ్న తలెత్తుతోంది… బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఇండియా- బంగ్లాదేశ్ నడుమ 3 వన్డేలు, 3 టీ20లు సెప్టెంబరులో జరగాలి… ఇప్పుడున్న ఉద్రిక్తతల్లో అది జరగకపోవచ్చు బహుశా… లేదా ఓ తటస్థ వేదిక వెతుకుతారేమో… (గత ఏడాదిలో జరగాల్సిన ఈ సీరీస్ ఉద్రిక్తతల కారణంగానే నిరవధికంగా వాయిదా పడింది…)
అసలు మహిళా క్రికెట్, మేల్ క్రికెట్ మ్యాచుల్ని ఇండియా, పాకిస్థాన్ నడుమ బీసీసీఐ ఎందుకు ఆడిస్తున్నదనే ప్రశ్నే ప్రధానంగా వినిపిస్తోంది… మన ప్లేయర్లు ఆ ప్లేయర్లకు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు… బీసీసీఐకి పెహల్‌గామ్ సోయి ఏమీ లేకపోవడం పట్ల, అమిత్ షా కొడుకు జై షా మీద కూడా విమర్శలు జోరుగా సాగుతున్నాయి…
డబ్బు తప్ప, దేశభక్తి లేదు… ఆ ధూర్తదేశంతో ఆటలేమిటనే నిరసనలు కూడా వినిపిస్తున్నాయి… మరి డబ్బు కోసం బీసీసీఐ స్వయంగా మ్యాచులు ఆడిస్తున్నప్పుడు బంగ్లాదేశ్ క్రికెటర్ ఐపీఎల్‌లో ఆడితే తప్పేమిటనే మరో వాదన వినిపిస్తోంది… ఒకటి మాత్రం క్లియర్… బీసీసీఐకి డబ్బు తప్ప, దేశం అనే సోయి లేదు..!!
వర్ణవివక్ష కారణంతో దక్షిణాఫ్రికాను ఎన్నేళ్లు అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచం దూరంగా ఉంచిందో తెలుసు కదా… మరి ఈ ఉగ్రవాద దేశాల్ని క్రికెట్‌కు దూరం చేసి, ఏకాకులను చేయాలనే పాట్రియాటిక్ కసి బీసీసీఐ పెద్దల్లో ఎందుకు లేదు..? నెటిజనం వేస్తున్న ఈ ప్రశ్నకు జవాబు చెప్పేవాళ్లు ప్రస్తుతానికి లేరు..!!
సినిమాను సినిమాగా చూడాలి, ఆటను ఆటగానే చూడాలి అనేవి వ్యర్థవాదనలు... బోలెడు హిందీ సినిమాల్ని గల్ఫ్ దేశాలు నిషేధించాయి... చివరకు ప్రస్తుతం 1200 కోట్ల వసూళ్లు సాధించిన ధురంధర్‌ను కూడా గల్ఫ్, పాకిస్తాన్ నిషేధించాయి... చివరకు గల్వాన్ సినిమాపై చైనా కూడా విషం కక్కుతోంది... ఇండియాలోని చైనా, పాకిస్థాన్ మద్దతుదారులతో సహా..!!
Share this Article