సుప్రీంకోర్టు కేంద్ర వేక్సిన్ పాలసీని మళ్లీ తీవ్రంగా తప్పుపట్టింది… సగటు మనిషికి కూడా అర్థమైపోతోంది మోడీ వేక్సిన్ పాలసీ ఓ హిస్టారిక్ బ్లండర్ అని… అది జాతికే తీవ్ర నష్టదాయకంగా మారిపోయిందని…! సరే, ఒక సీపీఎం సీఎం పినరై విజయన్ బీజేపీయేతర ముఖ్యమంత్రులందరికీ లేఖ రాశాడు… ఇలాంటి విషయాల్లో మోడీ మీద స్వారీ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాడు కాబట్టి కాసేపు పక్కన పెడదాం… జార్ఖండ్ హేమంత్ సోరెన్ కాంగ్రెస్ క్యాంపు మనిషి కాబట్టి విమర్శ చేస్తున్నాడూ అనుకుందాం… తననూ కాసేపు పక్కన పడేద్దాం… కేజ్రీవాల్ సరేసరి… ఆ ఢిల్లీలోనే తోక పటాకులా ఎప్పుడూ చిటపట అంటూనే ఉంటాడు కాబట్టి తననూ కాసేపు విస్మరిద్దాం… మోడీ పేరు వినిపిస్తే చాలు కాళిగా చర్రున లేస్తుంది కాబట్టి మమతనూ ప్రస్తుతానికి విడిచిపెడదాం… కానీ..?
ఎప్పుడూ పెద్దగా ఈ విమర్శల రొంపిలోకి రాని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సైతం… పదకొండు మంది బీజేపీయేతర ముఖ్యమంత్రులకు ఓ లేఖ రాశాడు… కొందరితో మాట్లాడాడు… అనేక సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థిత్వాన్ని పక్కన పెట్టేసి మరీ మోడీకి సపోర్ట్ చేసిన ఆ సీఎం… ఈసారి వేక్సిన్ పాలసీపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు… (వేక్సిన్ పాలసీ ఎలా ఉండాలో ఏప్రిల్లోనే మోడీకి ఆయన ఓ లేఖ కూడా రాశాడు…) ‘‘దేశం ఇప్పుడు అతి పెద్ద సమస్యతో పోరాడుతోంది… రాబోయే కరోనా వేవ్స్ నుంచి మన ప్రజల్ని కాపాడుకోవాలి… ఈ వేక్సిన్ సమీకరణ, పంపిణీపై అందరమూ ఓ ఏకాభిప్రాయానికి వద్దాం… ఇప్పుడు అందరి ప్రయారిటీ వేక్సినేషనే కావాలి… కానీ మనలో మనం వేక్సిన్ కోసం పోరాడేలా ఉండకూడదు… 18-45 వయస్సు వాళ్లకు వేక్సిన్ల బాధ్యత రాష్ట్రాలదే అంటున్నది కేంద్రం… గ్లోబల్ టెండర్లు పిలిచినా సరే ఎవరూ రాష్ట్రాలకు అమ్మడానికి సిద్దపడటం లేదు, కేంద్రం వైపే చూస్తున్నారు… కేంద్రమే వేక్సిన్ సేకరించి, రాష్ట్రాలకు పంపించాలి…’’ ఇలా సాగింది ఆయన లేఖ…
Ads
తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీయార్, జగన్లను కూడా ఇక్కడ మనం కాసేపు విస్మరించాలి… ఏది ఏం జరిగినా సరే, ఈ ఇద్దరూ మోడీ మీదకు దూకుడుగా విమర్శకు వెళ్లే చాన్సే లేదు… ఎవరి భయం వాళ్లది… అయితే మిగతా బీజేపీయేతర ముఖ్యమంత్రులందరూ మోడీ పాలసీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు… తప్పుపడుతున్నారు… బీజేపీ ముఖ్యమంత్రుల్లోనూ అసంతృప్తి ఉన్నా బయటపడటం లేదు… వెరసి మోడీ వేక్సిన్ పాలసీ… అంటే వేక్సినేషన్కు సంబంధించిన ప్రతి అడుగూ ఓ బ్లండరే అనే అభిప్రాయం దేశమంతటా వినిపిస్తున్నదే… మరి మోడీ ప్రభుత్వం ఎందుకు ఇంత అడమెంటుగా ఉంది..? కనీసం మంత్రుల నుంచో, ప్రభుత్వం నుంచో వేక్సినేషన్, వేక్సిన్ పాలసీ మీద సమర్థన కూడా సరిగ్గా లేదు… ఏం జరుగుతోంది..?! భలేవారే… కోవాగ్జిన్ వేక్సిన్ ధర 1250 ఎందుకైందో, ఈ బాగోతాం ఏందో ఎవరికి తెలుసు..? జనానికి ఏదీ తెలియదు… తెలియొద్దు… అంతే…!!
Share this Article