.
కేసీయార్‌ను ఉరితీసినా తప్పులేదు… కానీ కసబ్‌నే ప్రజాస్వామికంగా విచారించి శిక్షించాం… ఈ మాటన్నది రేవంత్ రెడ్డి… అది తను తెలంగాణకు చేసిన ద్రోహాల తీవ్రతను చెప్పడానికి ఉద్దేశించిన చేసిన వ్యాఖ్య…
ఆయ్ఁ తెలంగాణను తీసుకొచ్చిన కేసీయార్‌నే ఉరి తీయాలంటావా..? కసబ్‌తో పోలుస్తావా..? అని బీఆర్ఎస్ క్యాంపు విరుచుకుపడింది, సహజం…
Ads
తరువాత ఇంకెక్కడో రేవంత్ రెడ్డి కేటీయార్‌ను ఉద్దేశించి ‘లాగూలో తొండలు విడిచిపెట్టి కొడతా’ అన్నాడు… పదే పదే కేటీయార్ బ్యాచ్ నుంచి వస్తున్న వ్యక్తిగత దూషణలు, తిట్లకు ప్రతిస్పందన అది…
అటు రేవంత్ ఘాటు విమర్శలు, ఇటు సొంత చెల్లెలు కవిత దాడి… కేటీయార్‌ను దాటేసి హైలైట్ అవుతున్న హరీష్ రావు… దాంతో సహజంగానే కేటీయార్‌లో కోపం పెరిగిపోయి… అదుపు తప్పి, రాహుల్ గాంధీని తిట్టడానికి పూనుకున్నాడు…
ఆ హౌలే గాడు, ఈ హౌలే గాడిని తీసుకొచ్చి రుద్దాడు… నడి బజార్ల ఉరి తీయాలి… అని సీరియస్ కామెంట్లు చేశాడు… రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి తిట్ల పర్వం విస్తరించి… చివరకు జాతీయ నాయకుల్ని కూడా ఇందులోకి లాగడం కరెక్టు కాదు… (తన ప్రసంగంలో రాహుల్ గాంధీని ఏడెనిమిదిసార్లు హౌలేగాడు అని ప్రస్తావించాడు)… (గతంలో కేసీయార్ ప్రధాని మోడీపై కూడా పరుష వ్యాఖ్యలు చేశాడు…)
వెంటనే కాంగ్రెస్ నేతలు అందుకున్నారు… ‘‘మరి అదే రాహుల్ కుటుంబం దగ్గరకు నీ కుటుంబం మొత్తం పోయి కాళ్లు మొక్కినప్పుడు ఏడబోయింది ఈ తెలివి..?’’ అని మొదలుపెట్టారు… ఎవరో వరంగల్ నాయకుడైతే ‘కేటీయార్, వరంగల్ వస్తే చెప్పులతో కొడతాం’ అంటూ మరికొన్ని బూతులు కలిపి తిట్టిపోశాడు… ఇద్దరు ముగ్గురు మంత్రులూ స్పందించినట్టుంది…

అంతా పెంట పెంట… అసలు అప్పట్లో రండ మంత్రి దగ్గర నుంచి మొన్నటి తోలు తీస్తం దాకా తెలంగాణ రాజకీయాల్లో బూతులు, దూషణల్ని స్టార్ట్ చేసిందే కేసీయార్… అదిప్పుడు పెరిగీ పెరిగీ దుర్గంధం ఇంకా ఇంకా వ్యాపిస్తోంది…
చివరకు కేసీయార్ కన్నబిడ్డ కవిత మీద కూడా బీఆర్ఎస్ బ్యాచ్ పరుషంగా దాడి చేస్తోంది… కేసీయార్ చావు కోరతారా అని కాంగ్రెస్ మీద విరుచుకుపడింది కదా బీఆర్ఎస్ క్యాంపు… తనే ఏం రాస్తోంది..?
తల్లిదండ్రుల మీద దయలేని పుత్రిక పుట్టనేమి తాను గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా? అనీ తిడుతోంది… కేసీయార్ చావు కోరతారా అన్న గొంతులే కవిత చావు కోరడమేమిటి..? అదీ మరీ చెదలతో పోల్చి..!
తల్లిదండ్రుల మీద దయలేని తండ్రి పుట్టనేమి తాను గిట్టనేమి అని కవిత బ్యాచ్ అనలేదు ఎక్కడా..!! కవిత సోషల్ మీడియా బ్యాచ్ పదునుగా లేనట్టుంది…
సో, ఇన్నేళ్లూ ఏపీ పాలిటిక్స్‌ను మించిన దుర్గంధం ఇంకెక్కడా ఉండదు అనుకున్నవాళ్లు తెలంగాణలో మరింత దుర్గంధం వ్యాపిస్తున్న తీరు చూసి విస్తుపోతున్నారు… చివరకు కవిత కూడా శాసనమండలిలో ‘ఏం పీకి కట్టలు కట్టామని’ అనే భాషలోకి వెళ్లిపోయింది ఓ దశలో…
ఈ బూతుల యవ్వారంలో ఎవరూ తక్కువ కాదు, కాస్త మోతాదులో ఎక్కువ, తక్కువ… అంతే… ఏమాటకామాట బీజేపీ గానీ, లెఫ్ట్ గానీ ఈ కంపు భాషలోకి వెళ్లడం లేదు… ఎటొచ్చీ… రెండు ప్రత్యర్థి పార్టీల భాష ఇంకా ఏ రేంజుకు చేరబోతున్నదనేదే ఆందోళన..!!
అవునూ... రాహుల్ గాంధీని కూడా తిట్టిపోస్తే అమిత్ షా, మోడీ ఖుషీ అయిపోయి... పొత్తో, అవగాహనో, విలీనమో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారనే ఆశ ఏమైనా ఉందా సార్..?!

లోకేష్ రెడ్‌బుక్‌లాగే… అంటే హిట్ లిస్టులాగే… బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటెయిన్ చేస్తున్నట్టుంది… మాకు మళ్లీ అధికారం వచ్చాక మీ సంగతి చూస్తాం అని ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికార్లకు అల్టిమేటమ్ జారీ చేస్తున్నారు సరే… దూకుడుగా తమ పార్టీ జోలికి రావద్దని ఓ బెదిరింపు టైపు, వర్తమాన రాజకీయాల్లో సాధారణమైపోయింది…
కానీ, మరీ ప్రజలు నిన్నగాక మొన్న ఎన్నుకున్న సర్పంచులను కూడా బెదిరించడం ఏమిటి..? వచ్చేది మేమే, మీ సంగతి చూస్తాం అని హెచ్చరికలు జారీ చేయడం ఏమిటి..? నిన్న గాక మొన్న ప్రజల తీర్పును పొందడమేనా వాళ్లు చేసిన తప్పు..?!
Share this Article