.
మేడారం… ఆదివాసీ కుంభమేళా… రేవంత్ రెడ్డి పుణ్యమాని 250 కోట్లతో కొత్త రూపు సంతరించుకుంటోంది… సమ్మక్క చరిత్ర శిలాక్షరాలుగా కొత్తగా లిఖితమవుతోంది… ఆదివాసీ గొట్టు గోత్రాల పుస్తకం అవుతోంది… గుడ్…
మంత్రి సీతక్క స్వయంగా ఆదివాసీ… ఆ ఏరియా ప్రజాప్రతినిధి… తనే స్వయంగా ఈ డెవలప్‌మెంట్ పనులు పర్యవేక్షిస్తోంది… ఎక్కడా ఆదివాసీ సంప్రదాయాలు, ఆచారాలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తపడుతోంది… వెరీ గుడ్…
Ads
కానీ 250 కోట్లు పెడుతున్నది కదా… ప్రభుత్వానికి కొత్త కంటెంటుతో మంచి పబ్లిసిటీ వీడియోలు చేసే క్రియేటర్లే దొరకలేదా..? ఇదీ ప్రశ్న… ముందుగా సీతక్క సోషల్ మీడియా టీమ్ షేర్ చేసుకున్న వీడియో చూసి, ఆ టీమ్ క్రియేట్ చేసిన ప్రైవేటు వీడియో అనుకున్నా…
కానీ ఐఅండ్‌పీఆర్ శాఖ సోషల్ మీడియా అకౌంట్‌లో కూడా కనిపించింది… బహుశా ప్రభుత్వం రూపొందింపజేసిన యాడ్ వీడియో కావచ్చు… కానీ అసలు ప్రశ్న ఏమిటంటే..?
https://www.facebook.com/reel/913653888007392
ఇందులో కొంత కంటెంటు వింటుంటే ఎప్పుడో విన్నట్టుగా అనిపించింది… అవే వాక్యాలు, అదే వర్ణన… పైన వీడియోలో ఉన్నదే… బంగారం, వొడిబియ్యం, వన జాతర, జన జాతర అవే పదాలు… కాస్త కష్టపడితే అసలు వెర్షన్ యాదికొచ్చింది…
2022లో తెలంగాణ ప్రభుత్వం డబ్బులిచ్చి అజహర్ షేక్ అనే క్రియేటర్‌తో చేయించిన వీడియోలోని వర్ణనే అది… (బండి మధు రాసిన కంటెంటు అజహర్ అడిగితే ఇచ్చాడు)… అదే కంటెంటు, అదే స్క్రిప్టు, అదే వాయిస్ ఓవర్, అదే సౌండ్ ఎఫెక్ట్… కాకపోతే ఆ వాయిస్ ఓవర్ దగ్గర కొత్త విజువల్ యాడ్ చేశారు, అంతే… ఆ పాత ఒరిజినల్ వీడియోలో అదే కంటెంటు వినిపించే బిట్ ఇదుగో…
సదరు పాత క్రియేటర్ దగ్గర అనుమతి తీసుకున్నారా లేదా వదిలేద్దాం… దేవతల వర్ణన బాగుంటే ఎవరైనా వాడుకోవచ్చు అనుకుందాం… కానీ కనీసం తనకు క్రెడిట్ ఇవ్వాలి కదా… అదీ లేదు… పోనీ, అడిగి ఉంటే తనే మొత్తం ఫీడ్ ఇచ్చేసేవాడు కదా… అదీ లేదు…
కాపీ కొట్టాల్సిన పనేముంది..? 250 కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం తలుచుకుంటే… మాంచి ఇన్నొవేటివ్, క్రియేటివ్ కళాకారులు, కలంకారులు ఎందరు లేరు..? ఇంకా బాగా చేయొచ్చు కదా… కాపీ దేనికి..? ఇదుగో ఇలాంటివే ప్రభుత్వం పరువు తీస్తుంటాయి… దీనికి బాధ్యులు ఎవరైనా సరే, ఇది సరైన చర్య కాదు… తమన్‌కూ వీళ్లకూ ఏం తేడా ఉన్నట్టు ఇక..!
చివరగా... అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ అనే జాతిగీతానికి బోలెడంత ఖర్చుపెట్టి, కీరవాణితో ట్యూన్ చేయించారు, తన టీమ్‌తో పాడించారు, రికార్డు చేయించి విడుదల చేశారు ఘనంగా... కాలరెగరేసుకునేట్టుగా ఉండాలి ఇలాంటివి... కానీ ఎవరో క్రియేట్ చేసిన కంటెంటును కాపీ చేయడం కాదు..!!
మంత్రి సీతక్క ఇవన్నీ చూసుకుంటుందని కాదు… కానీ తన కోసం వర్క్ చేసే టీమ్ చూసుకోవాలి కదా..!!
Share this Article