.
Subramanyam Dogiparthi …… బాలకృష్ణ , కోడి రామకృష్ణ , యస్ గోపాలరెడ్డి జైత్రయాత్రలో మరో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ 1989 ఏప్రిల్లో వచ్చిన ఈ ముద్దుల మామయ్య సినిమా . అలాగే బాలకృష్ణ , విజయశాంతి సక్సెస్ కాంబినేషన్లో వచ్చిన మరో సినిమా ఇది .
60 సెంటర్లలో యాభై రోజులు , 28 సెంటర్లలో వంద రోజులు , ఫైనల్ గా సిల్వర్ జూబిలీ ఈ సినిమా రికార్డు . ఈ సినిమా ఎందుకు ఇంత బ్లాక్ బస్టర్ అయిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే .
Ads
తమిళంలో విజయవంతమైన En Thangachi Padichava సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . తమిళంలో ప్రభు , రూపిని , చిత్ర ప్రధాన పాత్రల్లో నటించారు . మన తెలుగు సినిమా తర్వాత హిందీలోకి రీమేక్ అయింది . హిందీలో అమితాబ్ , జయప్రద , రాధిక నటించారు . కన్నడంలో రవి మామ అనే టైటిలుతో రీమేక్ అయింది . రవిచంద్రన్ , నగ్మా , హేమ నటించారు . బెంగాలీ భాషలోకి పబిత్రపాపీ అనే టైటిలుతో రీమేక్ అయింది . అయితే మన తెలుగులో బ్లాక్ బస్టర్ అయింది .
తెలుగులో అంతగా బ్లాక్ బస్టర్ అవటానికి క్రెడిట్ ప్రధానంగా కోడి రామకృష్ణ సారధ్యానికే దక్కుతుంది . సినిమాలో బాలకృష్ణ హీరోయిజం , విజయశాంతి గ్లామరస్ పెంకితనం , అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ , ఏక్షన్ , ఫైట్లు , పాటలు , బాలకృష్ణ డాన్సులు , అన్నింటినీ బ్రహ్మాండంగా మిక్స్ చేసాడు కోడి రామకృష్ణ .

నటనపరంగా ప్రధమ తాంబూలం బాలకృష్ణదే . ముద్దుల మేనల్లుడుగా కాసేపే కనిపించినా మాస్టర్ అమిత్ ఇరగతీసాడు . ముఖ్యంగా క్లైమాక్సులో తాతను తగలబెట్టే సీనులో ఆరిందాలాగా నటించాడు . చెల్లెలు పాత్ర అయినా సీత విలన్ని ఎదిరించే సీన్లలో హీరోయిన్ లాగా నటించింది .
ఇంక విజయశాంతి గురించి చెప్పేదేముంది ? గ్లామర్+ రొమాంటిక్ ఏక్షన్+ అల్లరి . అన్నింటినీ ఆరపోసింది . డ్యూయెట్లలో అదరగొట్టేసింది . విలనుగా కిట్టీ అని పిలవబడే రాజా కృష్ణమూర్తి బాగా నటించాడు . తెలుగులో అతనికి ఇదే మొదటి సినిమా అనుకుంటాను . తమిళంలో ఈ పాత్రను తానే పోషించాడు .
కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టయ్యాయి . మామయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దు పొడుపు పాట సూపర్ డూపర్ పాపులర్ . సినిమా మొదట్లో బాలకృష్ణ గ్రూప్ డాన్స్ హే రాజా విలాసం నాది అంటూ సాగే పాటలో బ్రేక్ డాన్స్ వేసి తన అభిమానులను ఊగించేసారు .

చుక్కేసుకొచ్చానమ్మా చూడు అనే రీమిక్స్ పాటలో ఇద్దరూ నవ్వులు పూయించారు . ఓ దేవదా ఓ పార్వతీ అంటూ బ్రహ్మాండంగా అల్లరి చేసారు . మరో గ్రూప్ డాన్స్ ఓం శాంతి ఓం శాంతిః చిత్రీకరణ బాగుంటుంది . చెంగు చెంగు ముద్దాడంగ , ఆకుచాటున పిందె అంటూ సాగే రెండు డ్యూయెట్లలో ఇద్దరూ అలరించారు .
సి నారాయణరెడ్డి , వెన్నెలకంటి పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మ , శైలజ శ్రావ్యంగా పాడారు . డైలాగులను గణేష్ పాత్రో పదునుగా వ్రాసారు . ఫైట్లను అద్భుతంగా కంపోజ్ చేసిన సాహుల్ని ప్రత్యేకంగా అభినందించాలి . ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్లో ఆనంద్ రాజ్ , బాలకృష్ణల ఫైట్ బాగుంటుంది .
బెంగుళూరులోని బెంగుళూరు పేలసుని బాగా వినియోగించుకున్నారు . సినిమాకు richness ను తెచ్చింది . డాన్సులను బ్రహ్మాండంగా కంపోజ్ చేసిన శివ , సుబ్రమణ్యాలను కూడా మెచ్చుకోవాలి .

ఈ సినిమాలో కళ్ళు చిదంబరానికి ప్రాముఖ్యత ఉన్న పాత్ర లభించింది . అతనూ బాగా చేసాడు . ఇతర ప్రధాన పాత్రల్లో ఆహుతి ప్రసాద్ , ఫణి , బాలాజి , ఈశ్వరరావు , గొల్లపూడి , శుభలేఖ సుధాకర్ , అనిత , బ్రహ్మాజీ , రవికిరణ్ తదితరులు నటించారు . ఎందుకనో ఆహుతి ప్రసాదుకు వేరే వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పించారు !
సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనట్లయితే ఈరోజు ఆదివారం చూసేయండి . 10000% వినోదం గ్యారంటీ . ఒక్క క్షణం కూడా బోరించదు . దడదడా లాక్కెళ్ళుతుంది .
నేను పరిచయం చేస్తున్న 1219 వ సినిమా
#తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు
Share this Article