Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘తెలంగాణ వ్యతిరేకులతో కలిసొస్తాం.., కాస్త కరుణించి వోట్లేయండి ప్లీజ్..!!

January 12, 2026 by M S R

.

‘జాతీయ స్థాయిలో మేం పొత్తులు నిర్ణయిస్తాం, ఈ రాష్ట్ర నాయకులదేముంది..?’ ఇదీ తెలంగాణలో బలంగా పాదం మోపాలని ఫిక్సయిపోయిన జనసేన ధోరణి… తెలంగాణ రాష్ట్ర బీజేపీకి ఇంకా చాలా తలనొప్పులు రాబోతున్నాయి…

సొంతంగా ఎదగడానికి అవకాశాలుండీ, అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న పార్టీ… మరోవైపు బీఆర్ఎస్, టీడీపీ కూటముల నడుమ నలిగిపోవడానికి రెడీ అయిపోవల్సిందే… సొంతంగా బలపడే సత్తా ఉండీ, ఇంకా ఇంకా ఏదో ప్రధాన పార్టీకి తోకగా మిగిలిపోవడం కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ బీజేపీ అనుభవిస్తున్న దురవస్థ…

Ads

బీఆర్ఎస్‌తో కలిసి వెళ్దామని బీజేపీలోనే ఓ వర్గం… కాదు, ఏపీలో టీడీపీ కూటమిలాగే ఇక్కడా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్లేలా ఏపీ నుంచి నరుక్కొస్తున్న వర్గం మరోవైపు… దేశం మొత్తమ్మీద బీజేపీ హైకమాండ్‌కు వ్యూహాలుంటాయి, ఆశలుంటాయి, ఆచరణ ఉంటుంది… తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అది ఏమాత్రం చేతకాదు…

తెలంగాణ ఏర్పడితే రోజుల తరబడీ నిద్రాహారాలు మాని…, తెలంగాణ దిష్టి తగిలి ఏపీ కోనసీమ దెబ్బతిన్నదని…, రాష్ట్ర విభజనకు కారణం అదేననీ చింతించే పవన్ కల్యాణ్ కొండగట్టు గుడికి టీటీడీ నిధులు ఇప్పించాడు… వచ్చాడు, వాహనంపై కూర్చుని ఊరేగింపులు తీశాడు… మళ్లీ తృటిలో ప్రమాదం తప్పిందనే ప్రచారం… అంతా ప్లాన్‌డ్…

తెలంగాణలోకి కూటమి తరఫున అడుగు పెడుతున్నాడు… సొంతంగా జనసేన మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేస్తుందనీ, తదుపరి అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్ అనీ తెలంగాణ లీడర్లతో ప్రకటనలు ఇప్పిస్తున్నాడు… తెలంగాణ బీజేపీని ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాడు…

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు పైకి ‘మేం సొంతంగానే పోటీచేస్తాం’ అని ప్రకటించినా తనకూ తెలుసు… తమ హైకమాండ్ మీద పవన్ కల్యాణ్ ఒత్తిడి గనుక పనిచేస్తే, రాష్ట్ర నేతల అభిప్రాయాలకు విలువ ఏమీ ఉండదని..!!

janasena

నిజానికి తెలంగాణలో జనసేన బలం ఏపాటిదో అందరికీ తెలుసు… అసలు టీడీపీయే దుకాణం మూసుకుని వెళ్లిపోయి, మళ్లీ బీజేపీ ముసుగుతో తెలంగాణలోకి ఎంట్రీ ఆశిస్తోంది… (గతంలో కాంగ్రెస్ ముసుగులో రావాలని ప్రయత్నించి భంగపడింది)… అసలు ఇవే కాదు, వైసీపీ దుకాణం క్లోజ్ ఇక్కడ… ఏదో ఉద్దరిస్తానని సొంత పార్టీ పెట్టిన షర్మిల బోలెడంత ఖర్చు చేసి, చేతులు కాలిపోయి, తెలంగాణ దుకాణం క్లోజ్ చేసి, ఆంధ్రాలో తేలింది…

అర్బన్ వోటింగు ఎంతోకొంత బీజేపీకి ఉపయోగపడుతుంది… దీన్నే ఆసరాగా తీసుకుని మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీలో బలపడాలని వాస్తవ తెలంగాణ బీజేపీ అభిమానులు కోరుకుంటూ ఉంటే… ఓవైపు బీఆర్ఎస్ లాగుతోంది… మరోవైపు టీడీపీ కూటమి లాగుతోంది… ఎంతకాలమైనా బీజేపీ తోకలాగా ఉండిపోవడమేనా..? తలెత్తి గర్జించలేదా ఇక..!? పక్కా తెలంగాణ వ్యతిరేకులతో మేం కలిసి వస్తున్నాం, మాకు వోట్లేయండి అనడగాలా వోటర్లను..?!

సహజంగానే మున్సిపల్ ఎన్నికలకు ప్రిపేరవుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మాత్రం బీజేపీ దురవస్థ సంతోషాన్ని కలిగిస్తోంది..!! అవునూ, తన విద్వేష దిష్టి వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఏమైనా వివరణ ఇచ్చాడా..? దానికే కట్టుబడి ఉన్నాడా..?!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘తెలంగాణ వ్యతిరేకులతో కలిసొస్తాం.., కాస్త కరుణించి వోట్లేయండి ప్లీజ్..!!
  • జూ..లకటక..! మతాంతర పెళ్లిళ్ల సినిమా కథలు అందరూ తీయలేరు..!!
  • అమెరికా మైక్రోవేవ్, సోనిక్ వెపన్స్ వాడిందా..? అసలు అవేమిటో తెలుసా..?!
  • హై-ప్రొఫైల్ వ్యక్తులో బోల్తాపడుతున్నారు – జేడీ లక్ష్మినారాయణ ఎంత..?!
  • పండుగ వాసనల్లేని… రెండు ముదురు బెండకాయల సంక్రాంతి షో..!!
  • అనిల్ రావిపూడి ‘మన శివశంకర ప్రసాద్ గారిని’ పాస్ చేసేశాడు..!!
  • జగన్ వ్యాఖ్యల్ని సొంత మీడియాయే ఎందుకు దాచిపెట్టినట్టు..!?
  • టీవీ న్యూస్..! వార్తల విశ్వసనీయతను చంపేస్తున్న వేగం…! ఓ ఉదాహరణ..!
  • అనేక భాషల్లో తీసినా… తెలుగులోనే సూపర్ బ్లాక్ బస్టర్… ఎందుకు..?!
  • ఒక వేదన నుంచి ‘వేదాంతం’… ఒక వైరాగ్యం నుంచి ఔదార్యం..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions