Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ముత్యమంత ముద్దు..! ఓ అబ్సర్డ్ నవలకు దారితప్పిన మూవీకరణ..!!

January 13, 2026 by M S R

.

Subramanyam Dogiparthi ….. చూసారా ఈ సినిమాను !? చూసి ఉండకపోతే వెంటనే చూసేయండి . తప్పకుండా చూడతగ్గ వెరైటీ సినిమా 1989 లో వచ్చిన ఈ ముత్యమంత ముద్దు . ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ నవల థ్రిల్లర్ ఆధారంగా నిర్మించబడిన సినిమా .

మరో విశేషం ఏమిటంటే సినిమాకు ఆయనే ఉపోద్ఘాతం ఇచ్చారు . It’s a social fantasy movie . యండమూరి వారికి super-natural powers/మానవాతీత శక్తుల మీద మక్కువ ఎక్కువ కదా ! దానికి ట్రయల్ రన్ ఈ నవల , ఈ సినిమా అని అనుకుంటాను .

Ads

హీరో గారికి ప్రేమ మీద అపార నమ్మకం . ప్రేమను ప్రేమించి , తపస్సు చేసి , సంకల్పసిధ్ధిని సాధించవచ్చు అనే ప్రగాఢ నమ్మకం . ఆ నమ్మకంతో తాను ప్రేమించిన హీరోయిన్ కొరకు వింధ్య పర్వతాలకు వెళ్ళి ఏడేళ్లు తపస్సు చేసి సంకల్పసిధ్ధిని సాధిస్తాడు . దానికి మెస్మరిజమనో , హిప్నటిజమనో , కనకట్టనో , ఏదో ఓ పేరు కూడా పెట్టవచ్చేమో ? పెట్టుకోవచ్చేమో ?

హీరోయిన్ సీత మగవారి ప్రేమ మీద చాలా అనుమానాలు , అపనమ్మకాలు , చీదర , వగైరా వగైరా . ఆమె అనుభవాలు అలాంటివి . అందుకు తగ్గట్టుగానే ఇంటి ఓనర్ గొల్లపూడి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాలో విలన్ లాగా అడవాళ్ళను రుద్దుకుంటూ ఉంటాడు .

అతనిని మించి బేవార్స్ ఆఫీసులో బాస్ సుధాకర్ . వీళ్ళందరి దెబ్బతో మగవారి ప్రేమంతా ఆడవారిని లోబరుచుకోవటానికే అని ప్రగాఢ విశ్వాసం .

ఏడేళ్ల తర్వాత వచ్చి హీరోయిన్ని ఇంప్రెస్ చేయటానికి విఫల యత్నాలు చేస్తాడు . హీరోయిన్ చేత తిరస్కరించబడతాడు . బాస్ అక్రమ వ్యాపార రహస్యాలను సంపాదిస్తానికి పోలీసులకు సాయం చేయబోయి తానే హత్య కేసులో ఇరుక్కుంటుంది . హీరోయినుకు తెలియకుండా ఆమెను రక్షించటమే కాకుండా , తానే హత్యాప్రయత్నానికి గురవుతాడు .

DSP మురళీమోహన్ హీరోయిన్ సీతకు నిజాలను చెప్పి చావు బతుకుల మధ్య ఉన్న హీరోని రక్షించుకోమని చెపుతాడు . ఆమె వెళ్ళేటప్పటికే తెల్ల దుప్పటి కప్పేస్తారు డాక్టర్లు . హీరోయిన్ పిలుపుకు రెస్పాండ్ అయి బతుకుతాడు . నవలలో చనిపోతాడు . సినిమాలో బతికించబడతాడు . సినిమా శుభాంతం అవుతుంది .

sita

ఇద్దరూ బాగా నటించారు . ఇద్దరిలో సీత ఇంకా బాగా నటించింది . ఈ రెండు పాత్రలు కాకుండా అంతులేని కధ సినిమాలో ఫటాఫట్ జయలక్ష్మి పాత్ర వంటి పాత్ర ఒకటి ఉంటుంది . దివ్యవాణి ఆ పాత్రలో చాలా బాగా నటించింది . ఈజీ గోయింగ్ పాత్ర . జీవితం అనుభవించేందుకే అని నమ్మే చార్వాక భౌతికవాది . చార్వాకం అంటే తిను , తాగు , సుఖించు తత్వం . భూమ్మీద సుఖపడితే తప్పు లేదురా అనే శాస్త్రం .

ఇతర ప్రధాన పాత్రల్లో చెప్పుకోవలసిన పాత్రలు బేవార్స్ బాస్ సుధాకర్ , సబ్ ఇనస్పెక్టర్ బ్రహ్మానందానివి . వీరిద్దరు కాకుండా రంగనాధ్ , మురళీమోహన్ , ప్రసాద్ బాబు , కాంతారావు , అన్నపూర్ణ , ఆలీ , నారాయణరావు తదితరులు నటించారు .

హంసలేఖ సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగా ఉంటాయి . బేక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగుంటుంది . ఆయన అసలు పేరు గంగరాజు . కన్నడ పరిశ్రమకు సంబంధించిన ఈయనకు తెలుగులో ఇదే మొదటి సినిమా అనుకుంటా . వేటూరి సాహిత్యానికి బాలసుబ్రమణ్యం , జానకమ్మ పాడారు .

ఓ అందమా తెలుగింటి దీపమా పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది . గొప్పింటి గోపమ్మా అంటూ సాగే పాట కూడా బాగుంటుంది . రాజేంద్రప్రసాద్ , సీతల మీద రెండు డ్యూయెట్లు ఉంటాయి . ఇచ్చుకో ముద్దిచ్చుకో , ప్రేమలేఖ వ్రాసా నీకంది ఉంటది అంటూ సాగుతాయి ఈ రెండు డ్యూయెట్లు . ప్రేమ లేఖ వ్రాసా పాట శ్రావ్యంగా ఉంటుంది . చిత్రీకరణ బాగుంటుంది .

సత్యమూర్తి డైలాగులను బాగా పదునుగా వ్రాసారు . ముఖ్యంగా సీత డైలాగులు బాగుంటాయి . స్క్రీన్ ప్లే , దర్శకత్వాన్ని రవిరాజా పినిశెట్టి నిర్వహించారు . సస్పెన్స్ బాగానే థ్రిల్లింగుగా ఉంటుంది . యండమూరి తన నవలకు థ్రిల్లర్ అని apt గానే పెట్టుకున్నారు .

సినిమా యూట్యూబులో ఉంది . ఓ ఆఫ్ బీట్ మూవీ . Watchable . నేను పరిచయం చేస్తున్న 1221 వ సినిమా .
#తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వామ్మో వాయ్యో…! సంక్రాంతి బరి నుంచి మరో పందెం కోడి ఔట్…!!
  • ఇండియా కొత్త బాట..! ఐనవాడే అందరికీ… ఐనా లొంగడు ఎవ్వరికీ..!!
  • అరైవ్ అలైవ్..! సేఫ్టీ ఫస్ట్..! తెలంగాణ పోలీసుల గుడ్ క్యాంపెయిన్…!!
  • ‘బాబు బూచి’… ఫ్రీజోన్ కుట్ర అట… బీఆర్ఎస్ గాయిగత్తర రాజకీయం…
  • ముత్యమంత ముద్దు..! ఓ అబ్సర్డ్ నవలకు దారితప్పిన మూవీకరణ..!!
  • పవన్ కల్యాణ్… ఓ యుద్ధ ఖడ్గం… ఓ బిరుదు ప్రదానం… ఓ క్లారిటీ..!!
  • హఠావో లుంగీ- బజావో పుంగీ..! వీళ్లు వారసులా..? విద్వేష వైరసులా..?!
  • మళ్లీ ఓ చిరంజీవి రెట్రో లుక్కు… జోడీగా ఇదే నయనతార… ఏమిటది..?!
  • హైడ్రోజన్ రైల్..! ఈ పైలట్ రన్స్ గనుక సక్సెసైతే… రవాణా విప్లవమే..!!
  • ‘‘తెలంగాణ వ్యతిరేకులతో కలిసొస్తాం.., కాస్త కరుణించి వోట్లేయండి ప్లీజ్..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions