.
Pardha Saradhi Upadrasta ……. భారత రక్షణ రంగంలో నిశ్శబ్ద విప్లవం – హైదరాబాద్ నుంచి సరిహద్దుల వరకూ!
ఇది ఒక సాధారణ స్టార్టప్ వార్త కాదు.
ఇది యుద్ధం జరుగుతున్న ఫ్రంట్‌లైన్ దగ్గరే టెక్నాలజీ తయారవుతున్న కథ.
Ads
బిట్స్ పిలానీ హైదరాబాదు క్యాంపస్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు ( Jayant Khatri, Sourya Choudhury) స్థాపించిన Apollyon Dynamics అనే స్టార్టప్ ఈరోజు భారత ఆర్మీ కోసం మొబైల్ డ్రోన్ ల్యాబ్ (Moving Drone Workshop) ను రూపొందించింది.
మొబైల్ డ్రోన్ ల్యాబ్ అంటే ఏమిటి?
ట్రక్కుపై అమర్చిన పూర్తి స్థాయి డ్రోన్ తయారీ వర్క్‌షాప్.
అందులోనే:
FPV డ్రోన్ల అసెంబ్లీ
సాల్డరింగ్
ప్రోగ్రామింగ్
అవసరమైనప్పుడు తక్షణ రిపేర్ & అప్‌గ్రేడ్
ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలకు దగ్గరగా (Frontline near deployment) డ్రోన్లను అక్కడికక్కడే తయారు చేయగల సామర్థ్యం.
యుద్ధంలో ఇది ఎందుకు కీలకం?
ఆధునిక యుద్ధాల్లో డ్రోన్లు కళ్ళు & చెవులు
FPV డ్రోన్లు:
ఖచ్చితమైన నిఘా
రియల్‌టైమ్ ఇంటెలిజెన్స్
మిషన్ స్పెసిఫిక్ మార్పులు
ఫ్యాక్టరీ నుంచి తెప్పించేలోపు యుద్ధ పరిస్థితి మారిపోతుంది
… అందుకే యుద్ధము జరిగే చోట, దగ్గరే డ్రోన్ తయారీ = వ్యూహాత్మక ఆధిక్యం
ప్రస్తుతం పరిస్థితి
ఈ మొబైల్ డ్రోన్ ల్యాబ్ ఇప్పటికే జమ్మూలో ఆపరేషన్‌లో ఉంది, నెలకు 100+ FPV డ్రోన్ల తయారీ సామర్థ్యం, సైనిక అవసరాలకు తగినట్లుగా డిజైన్ మార్పులు అక్కడికక్కడే చేసుకునే అవకాశం.
మరో ముఖ్యమైన విషయం
ఈ యువ విద్యార్థులు డ్రోన్లు ఇచ్చి ఆగిపోలేదు భారత సైన్య అధికారులకు స్వయంగా ఈ ల్యాబ్ వాడటం ఎలా?, డ్రోన్లు తయారు చేయటం ఎలా?, ఫీల్డ్‌లో సమస్యలు పరిష్కరించటం ఎలా? ఇలాంటి వాటి మీద ట్రైనింగ్ ఇచ్చారు
అంటే Knowledge transfer + Technology transfer
అంతర్జాతీయ స్థాయిలో దీని ప్రాముఖ్యత
ఇలాంటి మొబైల్ డ్రోన్ తయారీ సౌకర్యం ఇప్పటివరకు రష్యా, ఉక్రెయిన్ లాంటివి యుద్ధంలో ఉన్న దేశాల్లో మాత్రమే కనిపించింది. ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలోకి ప్రవేశించింది
భారత సైన్యం ఏమంటోంది?
భారత సైన్యం నుంచి వచ్చిన ప్రశంసా పత్రంలో… “వారి ప్రొఫెషనల్ అప్రోచ్, టెక్నికల్ నైపుణ్యం, నిబద్ధత పూర్తిగా ప్రశంసనీయమైనవి”… ఇది చిన్న విషయం కాదు. సైన్యం ఇచ్చే ప్రశంస = అత్యున్నత నమ్మకం
ఈ ప్రయాణం ఎక్కడ మొదలైంది?
ఇద్దరు 20 ఏళ్ల విద్యార్థులు BITS Pilani Hyderabad Campus హాస్టల్ రూమ్ నుండి మొదలు పెట్టి, 6 నెలల్లోనే భారత రక్షణ వ్యవస్థలో కీలక భాగస్వాములు అయ్యారు.
అసలు సందేశం ఏమిటి?
ఇది నిజమైన Make in India, నిజమైన Atmanirbhar Bharat. కాగితాలపై కాదు, యుద్ధ భూమిలో పని చేసే ఆవిష్కరణ
భవిష్యత్తులో యుద్ధాలు ఆయుధాలతో కాదు, టెక్నాలజీతో గెలుస్తారు. ఆ టెక్నాలజీని ఇప్పుడు భారత్ తయారు చేస్తోంది ఈ భారత నవ యువత.
ఇదే నిజమైన ‘Make in India – Make for Army’ ... Congratulations సోదరులారా, ఇదే యువ శక్తి అంటే . –— ఉపద్రష్ట పార్ధసారధి
#IndianArmy #DroneWarfare #DefenseInnovation #MakeInIndia #AtmanirbharBharat #ApollyonDynamics #FPVDrones #Hyderabad #IndianStartups #ModernWarfare #pardhatalks
Share this Article