ఇతర పత్రికలకన్నా నాలుగు మైళ్లు ముందుండేది ఈనాడు… అది ఒకప్పుడు… కానీ ఇప్పుడది ఏ పూర్వకాలం ప్రమాణాల్లోనే ఆగిపోయి, అక్కడే తచ్చాడుతోంది… దాని ఖర్మ, దానిష్టం అని కొట్టిపారేయకండి, ఇన్నేళ్లుగా తెలుగువాళ్ల మైండ్ ట్యూనింగ్, థాట్ పోలీసింగ్ చేసిన ఓ వ్యవస్థ ప్రస్తుత స్థితి చెప్పుకోకపోతే ఎలా..? ఫస్ట్ పేజీ బ్యానర్ కొట్టింది… ఏమిటయ్యా అంటే..? మూడో దశలో 30 లక్షల మంది పిల్లలకు వైరస్ సోకుతుంది, 8 వేల మందికి ఐసీయూ అవసరపడొచ్చు, ఒక శాతం మంది ‘‘మల్టి సిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్’’కు గురవుతారు, అదీ డేంజరే, 2000 ఐసీయూ వెంటిలేటర్ పడకలకు ఏర్పాట్లు… ఇదీ వార్త… ఏమేం మందులు కొనబోతున్నారు, ఎలా మూడో వేవ్‌కు ప్రిపేర్ కాబోతున్నారు అనేది సారాంశం… కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎంత సిన్సియర్‌గా కష్టపడుతున్నదో అందరికీ తెలుసు, అప్పుడే మూడో వేవ్‌కు పకడ్బందీగా రెడీ అయిపోతోంది అన్నట్టుగా, ఓ సర్టిఫికెట్ ఇస్తున్నట్టుగా రాసిపారేసింది… డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ప్రిపేర్డ్నెస్ ప్రధానం… అది ప్రభుత్వం వైపు ఎప్పుడూ కనిపించలేదు, దాన్నలా వదిలేస్తే… ఒక్క తెలంగాణలో 30 లక్షల మంది పిల్లలకు కరోనా తప్పదు అని హెచ్చరిస్తోంది ఈ కథనం…
మరి ఇంతటి భయానక అంచనాల్ని డీజే సౌండ్‌లో ప్రచురిస్తున్నప్పుడు దాని సోర్స్ ఏమిటో చెప్పాలి కదా… అంతర్జాతీయ నిపుణులు చెప్పారట… ఎవరు వాళ్లు, ఎప్పుడు చెప్పారు..? పైగా ఊహాజనితమైన భీకర ప్రమాదాల్ని, పొద్దున లేవగానే, చదివి సమాజం భయకంపితమయ్యేలా వార్తలు, ఫోటోలు ఉండకూడదనేది మోడరన్ ప్రొఫెషనల్ స్టాండర్డ్… అందుకే తెగిపడిన అవయవాలను, రక్తాన్ని, బీభత్స దృశ్యాలను వీలైనంతవరకూ ఫస్ట్ పేజీలో అవాయిడ్ చేస్తున్నారు ఇప్పుడు, కాదు, కాదు, లోపల పేజీల్లో కూడా వేయడం లేదు… మరి ఇంతటి భీకరమైన అంచనాను ఓ బ్యానర్ స్టోరీగా ఎలా ప్రజెంట్ చేశారు..? ప్రభుత్వం అనుకుంటోందట..!! ఫస్ట్, సెకండ్ వేవ్స్ కలిపి 80 వేల మంది పిల్లల్ని కరోనా అటాక్ చేస్తే, థర్డ్ వేవ్‌లో ఏకంగా 30 లక్షల మందిని కొడుతుందా..? ఏమిటి ప్రామాణికం..? ఏమిటి ఈ లెక్క…?
Ads
నిజానికి థర్డ్ వేవ్ అనేదే ఓ ఊహాజనితం… శాస్త్రీయ ప్రాతిపదిక ఏమీ లేదు, కాకపోతే రెడీగా ఉండాలనే ప్రభుత్వ ప్రక్రియ, అడుగులు కరెక్టే… అయితే ఈ 30 లక్షల అంకె ఎక్కడి నుంచి వచ్చింది..? అందులో 24 లక్షలు అసింప్టమాటిక్ అట, 6 లక్షలు మధ్యస్థం అట… అసలు వర్తమాన కరోనా పేషెంట్లు, మరణాలనే ప్రభుత్వం సరిగ్గా రిపోర్ట్ చేయడం లేదు.., రాబోయే లెక్కల్ని అంజనం వేసి, అంచనా వేసి మరీ అడుగులు వేస్తోందా..? పోనీ, ఈ సంఖ్య బడులు ఓపెన్ చేస్తేనా..? బడులు మూసేసి ఉంచేస్తేనా..? ఈ భారీ అంకెను చూపి ఈసారీ బళ్లు ఓపెన్ చేయడం లేదనేనా అంతరార్థం..? సరే, జనాన్ని భయపెడదాం, కాస్త జాగ్రత్తగా ఉంటారు, అందుకే ఇలా చేశారనుకుందాం… అలాంటప్పుడు… కాస్త పిల్లల్ని బయట ఆడుకోనివ్వండి, డీ విటమిన్ వస్తుంది, కరోనాకు అదే అసలైన విరుగుడు అని చెప్పలేదేం..? పాలు తాగించండి, సీజనల్ పళ్లను తినిపించండి, కాస్త పౌష్టికాహారం పెట్టండి అని నాలుగైదు కీలక సలహాలో, సూచనలో ఇవ్వలేదేం..? వాస్తవానికి బడి వయస్సులోనే పిల్లల్లో గ్రోత్ హార్మోన్లన్నీ యాక్టివ్‌గా ఉంటయ్… ఆటలాడితేనే అవి ఉత్పత్తయి పనిచేస్తయ్… థర్డ్ వేవ్ పేరిట, ఈ బీభత్సమైన ముందస్తు, ఉద్దేశపూర్వక అంచనాలతో ఇంకా పిల్లల్ని ఇళ్లల్లోనే కూర్చోబెట్టేసి…. మన భారత్ భయోటెక్ వాళ్లు రెడీ చేస్తున్నారుగా, ఆ వేక్సిన్లు వేయించేద్దామా సార్..?!
Share this Article