.
చందమామ మీద అప్పట్లో… అంటే యాభై ఏళ్ల క్రితం… అమెరికా కాలు పెట్టిందా లేదా అన్నది పాత పంచాయితీ… ఈరోజుకూ దాన్ని ఎవరూ నమ్మడం లేదు… అమెరికా ఫేక్ ప్రచారమనే నమ్ముతున్నారు… అపోలో చంద్రుడి మీద దిగడం, నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తొలిసారి కాలు పెట్టడం మీద కొన్ని వేల సందేహ కథనాలు కూడా వచ్చాయి…
సీన్ కట్ చేస్తే… ఇప్పుడు మాత్రం చంద్రుడి మీద నిజంగానే అడుగు పెట్టడానికి అమెరికా నాసా ఓ కొత్త ప్రయత్నం మొదలు పెట్టింది… నాసా తన అర్టెమిస్-2 తో ఫిబ్రవరిలో హడావుడి చేయడానికి రెడీ అవుతుంటే, మరోవైపు మన భారత్, డ్రాగన్ కంట్రీ చైనా కూడా సై అంటే సై అంటున్నాయి…
Ads

చైనా రహస్య ప్లాన్.. అంతా గుట్టుగుట్టే!
చైనా ఎప్పుడూ ఇంతే..చేసేదంతా సైలెంటుగా చేసేసి చివర్లో బాంబు పేలుస్తుంది… ప్రస్తుతం చైనా తన ‘చాంగే’ (Chang’e) మిషన్లతో చంద్రుడి మీదకు మనుషుల్ని పంపేందుకు పక్కా స్కెచ్ వేసింది…
-
2030 కల్లా చైనా వ్యోమగాములు చంద్రుడిపై కాలు మోపడమే లక్ష్యంగా పెట్టుకుంది…
-
ఇప్పటికే చంద్రుడి వెనుక భాగాన (Far side) ల్యాండర్లను దించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన చైనా, ఇప్పుడు రహస్యంగా అక్కడ ‘లూనార్ బేస్’ కట్టేందుకు సామాగ్రిని కూడా సిద్ధం చేస్తోంది…
-
అమెరికా కంటే ముందే అక్కడ జెండా పాతాలని చైనా వేస్తున్న అడుగులు నాసాకు నిద్రలేకుండా చేస్తున్నాయి…

మన ‘ఇస్రో’ తగ్గెదే లే! గగన్‌యాన్ నుంచి చంద్రయాన్ దాకా..
ఇక మన భారత్ విషయానికొస్తే.. చంద్రయాన్-3 సక్సెస్‌తో ప్రపంచం మొత్తం మనవైపు చూస్తోంది… ఇప్పుడు ఇస్రో గురి ‘భారతీయ అంతరిక్ష స్టేషన్’, ‘మానవ సహిత చంద్రయానం’…
-
గగన్‌యాన్…: మొదటగా మన వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపి సురక్షితంగా తీసుకురావడమే ఇస్రో తక్షణ లక్ష్యం… దీని కోసం టెస్ట్ ఫ్లైట్స్ శరవేగంగా జరుగుతున్నాయి…
-
మిషన్ 2040…: 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడిని దించాలని ప్రధాని మోదీ ఇప్పటికే డెడ్ లైన్ పెట్టాడు… చైనా, అమెరికాతో పోలిస్తే మనం ఆలస్యంగా మొదలుపెట్టినా, అతి తక్కువ ఖర్చుతో సక్సెస్ కొట్టడంలో మనోళ్లు దిట్టలు… ఫలితం చూడాలి…
ముచ్చటగా ముగ్గురు.. గెలుపెవరిది?
గతంలో రష్యా-అమెరికా మధ్య మాత్రమే పోటీ ఉండేది… కానీ ఇప్పుడు సీన్ మారింది…
-
అమెరికా…: ‘అపోలో’ ఫేక్ అనే విమర్శల నుంచి బయటపడాలని, మళ్లీ తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చూస్తోంది… నాసా వేగంగా కార్యాచరణ స్టార్ట్ చేస్తోంది…
-
చైనా…: అమెరికాను వెనక్కి నెట్టి తనే సూపర్ పవర్ అవ్వాలని రహస్యంగా పావులు కదుపుతోంది… అంతరిక్ష విజయాల్లో చైనాను ఏమాత్రం తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు…
-
భారత్…: అగ్రరాజ్యాలకు ధీటుగా, స్వదేశీ పరిజ్ఞానంతో ‘స్పేస్ లీగ్’లో టాప్ ప్లేస్ కోసం పోరాడుతోంది… కానీ మనది లేటు ప్లానింగు…
రష్యా ప్రస్తుతం తన సొంత గొడవల్లో బిజీగా ఉంది కాబట్టి, ప్రస్తుతానికి చందమామ వేటలో ఈ ముగ్గురి మధ్యే అసలు సిసలు పోరు నడుస్తోంది… ఫిబ్రవరిలో నాసా ప్రయోగం సక్సెస్ అయితే ఈ రేసు ఇంకా ఊపందుకుంటుంది…!

ఆర్టెమిస్ 2 (Artemis II) ప్రయోగంతోనే అమెరికన్లు మళ్లీ చంద్రుడి మీద కాలుపెట్టరు… 1972లో జరిగిన అపోలో 17 తర్వాత, సుమారు 50 ఏళ్ల విరామం అనంతరం చంద్రుడి వద్దకు మనుషులను పంపే నాసా (NASA) ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఇది రెండో దశ మాత్రమే…
ఈ ప్రయోగంలో నలుగురు వ్యోమగాములు చంద్రుడి చుట్టూ ప్రయాణించి సురక్షితంగా తిరిగి భూమికి చేరుకుంటారు… అయితే, వీరు చంద్రుడి మీద కాలు పెట్టరు... చంద్రుడి ఉపరితలంపై దిగడానికి ముందు సిస్టమ్స్ అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరీక్షించడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశ్యం…
ఇందులో నలుగురు సభ్యులు ఉంటారు (రీడ్ వైజ్‌మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్)… వీళ్లు ఓరియన్ (Orion) అంతరిక్ష నౌకలో ప్రయాణిస్తారు… దీనిని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన SLS (Space Launch System) రాకెట్ ద్వారా ప్రయోగిస్తారు…
ఆర్టెమిస్ 3 ద్వారానే మనుషులు చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు పెడతారు…

అమెరికా కంటే ముందే చంద్రుడిపైకి మనుషులను పంపాలని సోవియట్ యూనియన్ తీవ్రంగా ప్రయత్నించింది… కానీ వారి N1 రాకెట్ ప్రయోగాలు వరుసగా నాలుగు సార్లు విఫలమవడంతో (పేలిపోవడంతో) వారు ఆ ప్రాజెక్టును మధ్యలోనే ఆపేశారు…
మనుషులను పంపలేకపోయినా, రష్యా రోబోటిక్ నౌకలను (Luna missions) చంద్రుడిపైకి విజయవంతంగా పంపింది… చంద్రుడి మీది మట్టిని రోబోల ద్వారా భూమికి తెచ్చిన ఘనత రష్యాకు ఉంది…
తొలి విజయాలు…: అంతరిక్ష పరిశోధనల్లో రష్యా చాలా రికార్డులు సృష్టించింది.,.. మొదటి ఉపగ్రహం (స్పుత్నిక్), అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మనిషి (యూరి గగారిన్), మొదటి మహిళ (వాలెంటినా తెరిష్కోవా) అంతా రష్యా నుండే జరిగింది…. కానీ అంతరిక్ష విజయాల్లో తరువాత వెనకబడిపోయింది..!!
Share this Article