Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గొర్లు, బర్ల దాకా…! కేసీయార్ కరప్ట్ చేయని రంగం ఏమైనా మిగిలిందా..?!

January 16, 2026 by M S R

.

రీసెంటుగా మూణ్నాలుగు వార్తలు కనిపించాయి… డాట్స్ కలిపితే, ఓసారి సీరియస్ లుక్కెేస్తే… తెలంగాణ ప్రజల సొమ్మును కేసీయార్ మద్దతుతో రైస్ మిల్లర్లు అరాచకంగా చేసిన భారీ దోపిడీ అర్థమవుతుంది… కేసీయార్ చేసిన నష్టాలను దిద్దడానికి రేవంత్ రెడ్డికి ఓ పదేళ్ల పాలనకాలం కావాలనీ అనిపిస్తుంది… ఐనా కష్టమేనేమో…

ఫస్ట్ వార్త… సూర్యాపేటలో ఇమ్మడి నర్సయ్య అనే రెండు మూడు రైస్ మిల్లర్ల ఓనర్… మాజీ మంత్రి జగదీష్ రెడ్డి బినామీ అంటుంటారు… ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లుల్లో మరాడించే సీఎంఆర్ ప్రక్రియ ఉంది కదా… ఎడాపెడా లక్షల టన్నుల ధాన్యం తీసుకున్నాడు, కెపాసిటీకి మించి… బియ్యం చేసి బయట అమ్ముకున్నాడు… అసలు ప్లస్ వడ్డీలు కలిసి 240 కోట్లు…

Ads

  • కేసు పెట్టారు, అరెస్టు చేశారు, జైలుకు వెళ్లాడు, వచ్చాడు… ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు… రూపాయి కట్టలేదు ప్రభుత్వానికి… ఆర్ఆర్ యాక్ట్ పెట్టి రేవంత్ రెడ్డి మిల్లుల్ని సీజ్ చేసి, నర్సయ్యను శిక్షించాలని అనుకుంటే కోర్టులో స్టే తెచ్చుకున్నాడు… బ్యాడ్ గరల్స్ అని ఓ సినిమా తీశాడు… తన బంధుమిత్రుల్ని, కులంవాళ్లను పిలిచి సపరేష్ షో కూడా వేశాడు… ఎస్, పది వేల కోట్ల సీఎంఆర్ స్కాంలో జస్ట్ ఈయన ఒక ఉదాహరణ మాత్రమే…

bad girlz

10 వేల కోట్లు… దాదాపు ప్రతిచోటా బీఆర్ఎస్ బ్యాచే… కాళేశ్వరాలు, ఫోన్ ట్యాపింగులు, ఫార్ములా వన్‌లు, పవర్ ప్రాజెక్టులు, ధరణి, సిట్టింగుల కబ్జాలు, అరాచకాల దగ్గర నుంచి చివరకు గొర్లు, బియ్యం దాకా ఆ పదేళ్ల పాలన దేన్నీ వదల్లేదు… ఇది రియాలిటీ… 2019 నుంచి 2023 వరకు అరాచకంగా సాగింది సీఎంఆర్ బియ్యం దందా…

మరో ఉదాహరణ కావాలా..? బోధన మాజీ ఎమ్మెల్యే షకీల్‌ బాపతు సీఎంఆర్ స్వాహా విలువ 70 కోట్లు అని అధికారుల లెక్క… నిజం… సీఎంఆర్ దందా దాదాపు 22 లక్షల టన్నుల బియ్యం… 2 కోట్ల క్వింటాళ్లు… రైస్ షాపుల్లో దొరికే 25 కిలోల పాకెట్ల లెక్కల్లో 8 కోట్లు… ఆ బియ్యంతో ఎన్నేళ్లు పేదలకు ఉచితంగా బియ్యం ఇవ్వవచ్చో ఒక్కసారి ఊహించుకోవాల్సిందే… అసెంబ్లీలో ఓ చట్టం తీసుకొచ్చి, కఠినంగా వ్యవహరించడానికి రేవంత్ రెడ్డి ఎందుకో వెనకాడుతున్నాడు…

rice

రెండో వార్త… రీసెంటుగా సివిల్ సప్లయిస్ అధికారులు 19 రైస్ మిల్లులపై దాడులు చేస్తే, 14 మిల్లుల్లో దాదాపు 60 కోట్ల మేరకు ధాన్యం గల్లంతు… అంటే అమ్మేసుకున్నారు, అంటే మిల్లుల దందా నిరంతరాయంగా సాగుతూనే ఉంది… అంత చెలరేగిపోయారు మిల్లర్లు… కేసీయార్ పాలన పొల్యూట్ చేయని, కరప్ట్ చేయని రంగం ఏదైనా ఉందా..?

rice mill

మూడో వార్త… తెలంగాణ ఓ చరిత్రను క్రియేట్ చేసింది నిన్న… హరీష్ రావు, కేటీయార్ క్రియేట్ చేసే గాయిగత్తరలను బ్రేక్ చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా 70.82 లక్షల ధాన్యాన్ని సేకరించింది… 2020-21 రికార్డును బద్దలు కొట్టింది… 18 వేల కోట్ల విలువైన ధాన్యం… అదీ 14 లక్షల మంది రైతుల నుంచి… జాగ్రత్తలు, కఠిన నిబంధనలతో మిల్లర్లకు ఇస్తోంది…

అన్నింటికీ మించి 1425 కోట్ల బోనస్ చెల్లించింది సన్నాలకు… ఇక్కడ తేడా చెప్పుకుందాం… నిజాలు… కేసీయార్ మిల్లర్లను కూడా పొల్యూట్ చేసి, ఓ భారీ దందాకు తెరతీస్తే… రేవంత్ రెడ్డి సైలెంటుగా ధాన్యం కొనుగోళ్లలో రికార్డులు క్రియేట్ చేయడమే కాదు, మద్దతు ధర ఇవ్వడమే కాదు, 500 చొప్పున అదనపు బోనస్ కూడా ఇచ్చాడు…

మరో విశేషం ఏమిటంటే..? ఒకప్పుడు వరి వస్తే ఉరి అన్నాడు కేసీయార్... కానీ రేవంత్ రెడ్డి సన్నాలకు బోనస్ అనడంతో రైతులు దాదాపు 60 శాతం వరకూ సన్నాలే పండించారు... దాన్నే మిల్లింగ్ చేసి, పేదలకూ సన్నబియ్యం ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి... ఇదీ తేడా... అంటే మనమే పండిస్తున్నాం, మనమే తింటున్నాం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చిన్న ఆవిష్కరణలే… చెప్పరాని అవస్థల్ని తీరుస్తాయి… ఇలా…!!
  • గొర్లు, బర్ల దాకా…! కేసీయార్ కరప్ట్ చేయని రంగం ఏమైనా మిగిలిందా..?!
  • “చచ్చావా… బతికావా?”…. చైనాలో సెన్సేషన్ సృష్టిస్తున్న కొత్త యాప్…!
  • ప్రజారాజ్యం పార్టీ పెట్టింది అక్కినేని..! ఎన్నికల్లో పోటీ కూడా చేశాడు..!!
  • భారత్‌కు చరిత్రాత్మక విజయం … అమెరికాకు వ్యూహాత్మక దెబ్బ…
  • కుంతి కోసం, నెత్తుటి మూలాల కోసం… ఓ డచ్ కర్ణుడి అన్వేషణ…
  • పండుగ స్పెషల్ షో అయినా సరే… అదే జబర్దస్త్ మార్క్ బూతు స్కిట్…
  • రాహుల్ ద్వంద్వ పౌరసత్వం… కోర్టులో ప్రస్తుత స్థితి… ఫ్యాక్ట్ చెక్…
  • ఈసారి నిజంగానే చంద్రుడిపై కాలు పెడతారట అమెరికన్లు..!!
  • అమెరికా చుట్టూ అసాధారణ లక్ష్మణరేఖ… 75 దేశాలకు వీసాల నిలిపివేత…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions