.
Pardha Saradhi Upadrasta ….. ఒక ఒప్పందం… రెండు ప్రభావాలు… భారత్‌కు చారిత్రాత్మక విజయం | అమెరికాకు వ్యూహాత్మక దెబ్బ…
భారత్– యూరప్ యూనియన్ Free Trade Agreement (FTA) – పూర్తి విశ్లేషణ
Ads
భారత్– యూరోపియన్ యూనియన్ మధ్య కుదరబోయే India–EU FTA కేవలం ట్రేడ్ డీల్ కాదు —ఇది గ్లోబల్ పవర్ షిఫ్ట్.
ఈ ఒప్పందం విషయాన్ని President, European Commission, Ursula von der Leyen ధృవీకరించారు.
సమ్మిట్‌లో పాల్గొనేవారు:
➡️ భారత ప్రధాని Narendra Modi
➡️ António Costa, President, European Council
ఇప్పుడు అసలు ముఖ్యమైన ప్రశ్న, ఈ భారత్ – యూరప్ యూనియన్ FTA లో ఏమేం ఉన్నాయి?
1️⃣ వ్యవసాయం – పూర్తిగా మినహాయింపు
✔️ భారత రైతుల రక్షణ
✔️ యూరప్ యూనియన్ సబ్సిడీ వ్యవసాయ ఉత్పత్తులు భారత్‌లోకి రాకుండా నిరోధం
✔️ దేశ శ్రామికుల్లో ~44% మంది వ్యవసాయంపై ఆధారపడటం కీలక కారణం
ఇది భారత్ సాధించిన అతిపెద్ద వ్యూహాత్మక విజయం.
2️⃣ పరిశ్రమలు & మాన్యుఫ్యాక్చరింగ్
🔹 యూరప్ యూనియన్ → భారత్
• ఆటోమొబైల్స్
• మెషినరీ
• గ్రీన్ టెక్నాలజీ
• హై-ఎండ్ ఇండస్ట్రియల్ గూడ్స్
వీటిల్లో టారిఫ్‌లు భారీగా తగ్గింపు. యూరప్ యూనియన్ వస్తువుకు భారత్ లో కొంత చౌకగా దొరికే అవకాశం ఉంది.
🔹 భారత్ → యూరప్ యూనియన్
• ఇంజినీరింగ్ గూడ్స్
• ఎలక్ట్రానిక్స్
• తయారీ ఉత్పత్తులు
యూరోపియన్ మార్కెట్‌లో పోటీ పెరుగుతుంది
3️⃣ IT & డిజిటల్ సేవలు – భారత్‌కు గోల్డెన్ ఛాన్స్
✔️ భారత IT కంపెనీలకు యూరప్ యూనియన్ మార్కెట్ పూర్తిగా ఓపెన్
✔️ డేటా ఫ్లోస్ & డిజిటల్ సర్వీసులకు స్పష్టమైన ఫ్రేమ్‌వర్క్
✔️ స్టార్ట్‌అప్స్ & SaaS కంపెనీలకు భారీ అవకాశాలు
4️⃣ ఫార్మాస్యూటికల్స్ & హెల్త్‌కేర్
🔹 భారత జనరిక్ మందులకు యూరప్ యూనియన్ లో సులభ ప్రవేశం. ఇది పెద్ద గేమ్ చేంజర్. భారత్ తన జనరిక్ మందులు ఎక్కువ అమెరికా కు ఎగుమతి చేస్తుంది. మొన్నటి అమెరికా సుంకాల వల్ల మొదట్లో 50% వేసి తరువాత మినహాయింపు చేసి ఇట్లా బెదిరింపులకు దిగి. గందరగోళం సృష్టించింది అమెరికా.
ఇప్పుడు యూరప్ యూనియన్ మార్కెట్ ఓపెన్ అవటం మూలంగా అమెరికా మార్కెట్ కు ఇంకొంత ప్రత్యామ్నాయం కూడా వస్తుంది. మనం ఆఫ్రికా దేశాలకు కూడా ఈ మందులు పంపిస్తున్నాం. మన లక్ష్యం ఒక్కటే ఒక్కరి మీద ఎప్పుడూ ఆధారపడం.
🔹 రెగ్యులేటరీ అడ్డంకులు తగ్గింపు
🔹 మెడికల్ డివైసెస్ ట్రేడ్ సులభతరం
యూరప్ యూనియన్ హెల్త్ సిస్టమ్‌కు భారత్ కీలక భాగస్వామి
5️⃣ టెక్స్టైల్స్ & గార్మెంట్స్
టారిఫ్ తగ్గింపులతో భారత్ టెక్స్టైల్స్ యూరప్ యూనియన్ లో మరింత చౌక, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలపై పోటీ ఆధిక్యం. ఇక్కడ కూడా భారత్ నుండి వెళ్ళే బ్రాండెడ్ దుస్తుల మీద అమెరికా సుంకాలు వేసింది. ఇప్పుడు యూరప్ యూనియన్ కు సుంకాలు లేకుండా పంపుతారు.
6️⃣ వైన్ & స్పిరిట్స్ (యూరప్ యూనియన్ → భారత్)
ప్రస్తుతం: 150% వరకు దిగుమతి సుంకాలు, FTA తర్వాత: గణనీయ తగ్గింపు (ఫేజ్ వారీగా)
ఇది యూరప్ యూనియన్ ఇచ్చే ప్రధాన కన్సెషన్ కాదు,కానీ భారత్ ఇచ్చిన లిమిటెడ్ ఓపెనింగ్ మాత్రమే.
7️⃣ గ్రీన్ ఎనర్జీ & క్లైమేట్ కోఆపరేషన్
✔️ హైడ్రోజన్
✔️ రిన్యూవబుల్స్
✔️ ఎలక్ట్రిక్ మొబిలిటీ
✔️ కార్బన్ టెక్నాలజీ
యూరప్ యూనియన్ టెక్నాలజీ + భారత్ స్కేల్ = స్ట్రాటజిక్ విన్
భారత్‌కు ఇది ఎందుకు చారిత్రాత్మకం?
వ్యవసాయం పూర్తిగా మినహాయింపు ఇవ్వడం ద్వారా భారత్ తన ప్రయోజనాలను కాపాడుకుంటూ — తన బలాల్ని మాత్రమే తెరిచింది.
నాన్-అగ్రి ఎగుమతులకు భారీ బూస్ట్
లాభపడే రంగాలు:
• IT & డిజిటల్ సేవలు
• ఫార్మా
• టెక్స్టైల్స్
• ఇంజినీరింగ్ గూడ్స్
అంచనా లాభం: సంవత్సరానికి €100 బిలియన్+
టారిఫ్‌లలో భారీ తగ్గింపు
ప్రపంచంలో భారత్ స్థానం
• ఈ FTA ప్రపంచ జనాభాలో ~25% మందిని కవర్ చేస్తుంది
• భారత్ = గ్లోబల్ ట్రేడ్‌లో కీలక కేంద్రం
• యూరప్ యూనియన్ తో వ్యూహాత్మక బంధం చరిత్రలోనే బలమైనది
అమెరికాకు ఇది ఎందుకు “దెబ్బ”?
ఇదే ఒప్పందం — అమెరికా ఆధిపత్యానికి నిశ్శబ్ద సవాల్.
అమెరికా “మధ్యవర్తి” పాత్ర కోల్పోతుంది
ఇప్పటివరకు: భారత్–యూరప్ యూనియన్ వాణిజ్యంలో. అమెరికా ఫైనాన్షియల్ & కార్పొరేట్ పాత్ర
FTA తర్వాత భారత్ యూరప్ యూనియన్ నేరుగా వాణిజ్యం. అమెరికా అవసరం తగ్గింపు అమెరికా gatekeeper పాత్ర బలహీనం.
అమెరికా కంపెనీలు భారత్‌లో పోటీ కోల్పోతాయి
యూరప్ యూనియన్ ఉత్పత్తులకు తక్కువ టారిఫ్‌లు వేయటం ద్వారా అమెరికా ఉత్పత్తులు ఖరీదైనవిగా మారతాయి.. ఎంత త్వరగా మాబర్గి వాణిజ్య ఒప్పందాన్ని క్లోజ్ చేసి టారిఫ్ లు తగ్గేలా చేసుకుంటారో అమెరికా ఇష్టం
ఫలితం: యూరప్ యూనియన్ కంపెనీలు , అమెరికా కంపెనీలను అండర్‌కట్ చేస్తాయి.
China+1 వ్యూహానికి దెబ్బ
అమెరికా ప్లాన్: చైనా నుంచి బయటకు వచ్చే తయారీ. భారత్ → అమెరికా సరఫరా చైన్, కానీ ఈ FTA తర్వాత: యూరప్ యూనియన్ – భారత్ సప్లై చైన్ బలపడుతుంది, అమెరికా కేంద్రంగా లేని వ్యవస్థ తయారవుతుంది. అంటే భారత్ ఎవరో ఒకరి మీద ఆధారపడే వాణిజ్య వ్యవస్థ కాకుండా బహుళ ఆధారిత వాణిజ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటోంది. తద్వారా ఒక దారి లో సుంకాలు, ప్రపంచ అనిస్థితులు ఏమన్నా వచ్చినా ఇంకొక 10 దారులు తెరుచుకుంటాయి.
డాలర్ ఆధిపత్యానికి నిశ్శబ్ద సవాల్
రూపాయి–యూరో సెటిల్‌మెంట్లు పెరుగుతాయి, డాలర్ అవసరం తగ్గుతుంది
ఇది చిన్న విషయం కాదు — ఇది అమెరికా గ్లోబల్ పవర్‌కు దీర్ఘకాల ప్రమాదం.
బ్రిక్స్ దేశాలతో బ్రిక్స్ కరెన్సీ, యూరప్ యూనియన్ తో యూరో, రష్యా తో రూపాయి, రుబుల్ ఇలా డాలర్ తో ఎక్కువ ఆధారపడని వాణిజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ పోతోంది భారత్. ఇది అమెరికా డాలర్ అధిపత్యానికి పెద్ద దెబ్బ.
ప్రొటెక్షనిజానికి ఓటమి
అమెరికా టారిఫ్‌లు, వాణిజ్య యుద్ధాలు , శాంక్షన్ లు, బెదిరింపులు వీటన్నిటి మధ్య ప్రత్యామ్నాయ వాణిజ్య వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటూ పోతోంది భారత్.
భారత్ –యూరప్ యూనియన్ ల మధ్య ఫ్రీ ట్రేడ్, ఓపెన్ మార్కెట్లు ఏర్పాటు అవుతాయి.
ప్రపంచానికి సంకేతం: “అమెరికా లేకుండానే వాణిజ్యం సాధ్యం.”. మీ బెదిరింపులకు లొంగం ఒక పక్క . యూరప్ యూనియన్ కూడా తన అమెరికా సంబంధాలు కొంత వత్తిడికి గురి అవుతున్న కారణంగా ప్రత్యామ్నాయాలు చూసుకుంటోంది. ఇప్పుడు భారత్ ప్రపంచంలో పటిష్ట ఆర్థిక వ్యవస్థ. ఇది ఇద్దరికీ విజయమే.
తుది మాట భారత్‌కు:
✔️ రైతుల రక్షణ
✔️ పరిశ్రమల వృద్ధి
✔️ ఎగుమతుల దూకుడు
✔️ గ్లోబల్ లీడర్‌షిప్
యూరప్ యూనియన్ కు:
✔️ ప్రపంచ పటిష్ట ఆర్థిక వ్యవస్థలో ఒకటి అయిన భారత్ మార్కెట్ కు యాక్సెస్.
✔️ పరిశ్రమల వృద్ధి
✔️ దిగుమతుల దూకుడు
✔️ గ్లోబల్ లీడర్‌షిప్
అమెరికాకు:
❌ మార్కెట్ షేర్ నష్టం
❌ సప్లై చైన్ కంట్రోల్ తగ్గింపు
❌ డాలర్ ఆధిపత్యానికి సవాల్
ఇది యుద్ధం కాదు, ఇది వాణిజ్యం కాదు, ఇది పవర్ మార్పు
నెమ్మదిగా… కానీ ఖచ్చితంగా…. — ఉపద్రష్ట పార్ధసారధి
#PardhaTalks #IndiaEUFTA #GlobalPowerShift #NarendraModi #UrsulaVonDerLeyen #MultipolarWorld #StrategicMasterstroke #AtmanirbharBharat
Share this Article