.
కేవలం ఒక రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు ఒక రోజంతా జాతీయ చానెళ్లు ఎందుకు అంత ప్రయారిటీ ఇచ్చాయి..? దాదాపు జనరల్ ఎన్నికల ఫలితాలకు చేసినంత హడావుడి చేశాయి… ఎందుకు..? విశేష ప్రాధాన్యం ఉంది గనుక… ముంబై ఈ దేశ ఆర్థిక రాజధాని గనుక… ఈ ఫలితాలు రాబోయే జాతీయ రాజకీయాలనూ ప్రభావితం చేస్తాయి గనుక… మహారాష్ట్ర జనం ప్రాంతీయ, భాష, విద్వేష భావనల్ని అడ్డంగా తిరస్కరించారు గనుక… ఠాక్రే, పవార్ కుటుంబ అవకాశవాద రాజకీయాలు ఇక చాలు అని స్పష్టంగా చెప్పారు గనుక…
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్… ‘‘ఆపరేషన్ సిందూర్ ఫెయిల్, ఫస్ట్ రోజే మనం చేతులెత్తేశాం, అసలు ఇంత మంది సైన్యం దేనికి..?’’ ఈ వ్యాఖ్య మాత్రమే కాదు, నోరి విప్పితే కంపు…
Ads
- ఫలితం :: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయింది… అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో మరీ ఘోరం…
.
మరాఠీయేతరులు ఎవ్వడూ ముంబై రాకుండా మేం రైళ్లను ముంబై సరిహద్దుల్లోనే ఆపేస్తాం… అన్నాడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే కొడుకు అమిత్ ఠాక్రే … రాజ్ ఠాక్రే అయితే ‘లుంగీవాలా హఠావో, బజావో పుంగీ’ అని సౌతిండియన్ల మీద విద్వేషం కక్కాడు… బీజేపీ నాయకుడు అన్నామలైని రసమలై అని వెక్కిరించాడు…
- ఫలితం :: ఇన్నాళ్లు బద్ధశత్రువుగా భావించిన ఉద్దవ్ ఠాక్రేతో అవకాశవాద దోస్తీ చేసినా వెల్లకిలా పడ్డాడు…

.
బాల్ ఠాక్రే వారసుడు ఉద్దవ్ ఠాక్రే ఏం చేశాడు..? పార్టీ బేసిక్ భావజాలాన్ని అరేబియా సముద్రంలో కలిపేసి, అధికారం కోసం ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలిపాడు అసెంబ్లీ ఎన్నికల్లో… మున్సిపల్ ఎన్నికల్లో రాజ్ ఠాక్రేతో పొత్తు అన్నాడు… చివరికి ఏం జరిగింది…?
- ఫలితం :: ముంబై నగరంపై దాదాపు మూడు దశాబ్దాల ఆధిపత్యాన్ని షిండేకు, బీజేపీకి ధారాదత్తం చేశాడు…
.
శరద్ పవార్ ఏం చేశాడు..? ఏమీ చేయలేదు..? అత్యంత అవినీతి పార్టీ అది… అవకాశవాదమే సిద్ధాంతం…
- ఫలితం :: 227 వార్డులకు గాను ఒకే ఒక్కటి… తన రాజకీయ జీవితం ఇక సమాప్తం…
.

అజిత్ పవార్… ఎన్సీపీని శరద్ పవార్ నుంచి లాగేసుకున్నాడు కదా… తనదే అసలైన ఎన్సీపీ అని రైట్స్ హైజాక్ చేశాడు కదా… సొంతంగా పోటీ చేశాడు…
- ఫలితం :: జస్ట్, 3 సీట్లు… తనకు సొంత బలం ఏమీ లేదని… బీజేపీ దయ తలిస్తే తప్ప తనకు కెరీర్ లేదని జనానికి చాటిచెప్పినట్టయింది…
.
పార్టీ ఏదయినా సరే… జనం ఆమోదించిన తమ పాత సిద్ధాంతాలకు కట్టుబడాలి… అవకాశవాదంతో, అత్యాశావాదంతో వ్యవహరిస్తే ఏం జరుగుతుందో మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు నిరూపించాయి… బీజేపీ- షిండే శివసేన విజయపతాక ఎగరేశాయి… మిగతావి చతికిలపడ్డాయి… ఈవీఎంలు, వోట్ చోరీ అనే పిచ్చి సాకులు పదే పదే ఎంత మొత్తుకున్నా వాటిని జనం నమ్మే రోజులు పోయాయి…
.
మరో ఉదాహరణ కావాలా..? ఏకంగా ప్రధాని అయిపోతామని కలలు కని… మస్తు ఖర్చు పెట్టి… తన పార్టీలోని తెలంగాణ ఆత్మను కూడా కత్తిరించుకుని… బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్ ఏమైందో చూశాం కదా… అసలు మహారాష్ట్ర ఎన్నికల్లో అసలైన శల్యుడు సంజయ్ రౌత్…

ఎన్సీపీకి కోవర్టు… ఉద్దవ్ ఠాక్రే శివసేనలో ఈ సంజయుడు ఏం చెబితే అదే చెల్లుబాటు… ఉద్ధవ్‌కు సొంత తెలివి లేక సంజయ్ మీద ఆధారపడతాడు… పిచ్చి కూతలతో ఎప్పుడూ వార్తల తెరపై ఉంటాడు ఈయన…
కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), ఉద్ధవ్ (యూబీటీ)ల నడుమ సంధానకర్త... తప్పుడు వ్యూహాలతో అందరినీ తప్పుదోవ పట్టిస్తాడు... ఈసారి ఎవరికివారే పోటీచేసినా... జనం ఛీకొట్టారు... ఈ శల్యుడు యాక్టివ్‌గా ఉన్నన్ని రోజులు ఫడ్నవీస్, షిండేలకు మహారాష్ట్రలో ఎదురు లేదు..!!
చివరగా మరొకటీ చెప్పుకోవాలి… లాతూర్… ఇక్కడ బీజేపీకి కూడా వోటర్లు బుద్దిచెప్పారు… కారణం, ఆ ప్రాంతానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర చవాన్ అవాకులు చవాకులు పేలడం, జనానికి నచ్చలేదు… ఫలితం :: బీజేపికి తిరస్కరణ, కాంగ్రెస్ వైపు మొగ్గు..!!
2869 వార్డులకు ఎన్నికలు జరిగితే… సీపీఎం జీరో, ఆప్ జీరో… బీఎస్పీ నయం కాస్త, ఆరు సీట్లు… మరాఠీయేతరులను ముంబైలోకి అడుగుపెట్టనివ్వం అన్న రాజ్ ఠాక్రే మొత్తం గెలిచిన వార్డులెన్నో తెలుసా..? కేవలం 12 వార్డులు…!!
Share this Article