Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మదురో భవనం సెట్ వేసి… అమెరికా ఎడారిలో నెల రిహార్సల్… పార్ట్-4 …

January 19, 2026 by M S R

.

( పొట్లూరి పార్థసారథి ) ….. మరి వెనెజులాకు రష్యా ఇచ్చిన ఆయుధాల సంగతి ఏమిటీ? రష్యాS-300v ఎయిర్ డిఫెన్స్ బాటరీలు ఇచ్చింది వెనిజులాకి. మరో షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయిన బ్యూక్ M2E ( BUK-M2E) లని కూడా రష్యా ఇచ్చింది. S-300v కానీ Buk- M2E లు కానీ వెనిజులా అధ్యక్షుడిని కాపాడలేక పోయాయి.

చైనా రాడార్లని ఎలా పేల్చివేసిందో అదే తరహాలో రష్యన్ ఎయిర్ డిఫెన్స్ ని కూడా పేల్చివేసింది అమెరికా! పుతిన్ ఉక్రెయిన్ యుద్ధంలో తలమునకలుగా ఉన్న సమయంలో S-300v లకి కానీ, Buk- M2E లకి కానీ స్పేర్ పార్ట్స్ సరఫరా ఆగిపోవడం అమెరికాకి కలిసి వచ్చింది.

Ads

సరే! రష్యన్ S-300v లు, బ్యూక్ M2E లు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కాబట్టి పవర్ఫుల్ రాడార్లు ఉంటాయి కాబట్టి యాంటి రేడియేషన్ మిసైళ్ళకి తేలికగా దొరికిపోతాయి అనుకుందాం!

మరి కరకాస్ లో ఉన్న రష్యన్ Pantsir S1 ఎయిర్ డిఫెన్స్ ఏం చేస్తున్నట్లు? Pantsir S1 అనేది S-300v ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి తక్కువ ఎత్తులో ఎగురుతూ వచ్చి దాడి చేసే డ్రోన్స్, హెలికాప్టర్లని ఎదుర్కోవడానికి ఉపయోగిస్తారు. రష్యన్ Pantsir S1 కనీసం ఒక్కటంటే ఒక్క అమెరికన్ హెలికాప్టర్ ని ఎందుకు కూల్చలేకపోయింది?

*******
అమెరికా విజయంని పెద్దదిగా చూపుతున్న వాళ్లకి అసలు వెనిజులాలోని సైనిక జెనరళ్ళు, సామాన్య సైనికులు, ప్రజల సహకారం లేకుండా అమెరికా ఒక్కటే వ్యూహరచన చేసి గెలిచిఉండేదా? అసలు సాధ్యం కాదు!

  • వెనిజులా సైనిక జెనరళ్ళు, ప్రజలు, చివరికి అధ్యక్ష్య భవనంలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది కూడా అమెరికన్ డాలర్, పౌరసత్వం కోసం అమ్ముడుపోయారు! విచిత్రం ఏమిటంటే వెనిజులా వైస్ ప్రెసిడెంట్ కూడా అమెరికాకి అమ్ముడుపోయింది!

వెనిజులా సైనిక జెనరళ్ల పాత్ర!
వైర్లేస్, మొబైల్ వ్యవస్థలని అమెరికన్ సైబర్ టీమ్ జామ్ చేసింది! కానీ వాకీ టాకీలు ఉన్నాయి కదా ఎమర్జెన్సీ కోసం వాటితో సంభాషించి ఉండవచ్చు కదా? ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో దొరుకుతున్న వాకీ టాకీలు 10 కిలోమీటర్ల పరిధి కలిగి ఉన్నాయి. చైనాతో సత్సంబంధాలు ఉన్న వెనిజులాకి మిలిటరీ గ్రేడ్ వాకీ టాకీ లు ( 50 km) ఇవ్వలేదా?

వెనిజులా సైనిక జెనరళ్ళు అమ్ముడుపోయారు కాబట్టే వాకీ టాకీలని ఉపయోగించమని ఆదేశాలు ఇవ్వలేదు.

రష్యన్ ఇగ్లా S మాన్ పాడ్స్ ( Igla-S MANPADS)…. రష్యా 5,000 ఇగ్లా S మాన్ పాడ్స్ అమ్మింది వెనిజులాకి. మాన్ పాడ్స్ (Man Portable Air Defence System) ని ఎందుకు వెనిజులా సైనికులు ఉపయోగించలేదు? ఒక సైనికుడు భుజం మీద పెట్టుకొని తక్కువ ఎత్తులో ఎగిరే ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్ ని తేలికగా కూల్చవచ్చు.

గత మూడేళ్లలో రష్యా మొత్తం 20 హెలికాప్టర్ గన్ షిప్స్ ని కోల్పోయింది ఉక్రెయిన్ సైనికులు ఇగ్లా, స్టింగర్ మిసైల్స్ తో పేల్చడం వల్ల. ఇగ్లా-S మాన్ పాడ్ అనేది సోవియట్ డిజైన్ కాబట్టి ఉక్రెయిన్ దగ్గర కూడా ఉన్నాయి కానీ అవి ఫస్ట్ జనరేషన్ వి అయినా బాగానే పనిచేసాయి.

****
జెనరల్ జెవియర్ మార్కానో టబాట ( General Javier Marcano Tabata)! వెనిజులా అధ్యక్ష్య భవనంతో పాటు అధ్యక్షుడి భద్రతా విభాగంకి కమాండర్ గా అధికారం చేలాయిస్తున్నాడు. జెవియర్ మార్కనో టబట వెనిజులా మిలిటరీ కౌంటర్ జంటెలిజెన్స్ కి కూడా డైరెక్టర్ జెనరల్ ( DGCIM).

జెనరల్ జెవియర్ మార్కానో టబట అమెరికాకి అమ్ముడుపోయాడు. వెనిజులా సైనిక జెనరళ్లలో చాలా మంది అమెరికన్ డాలర్లకి, CIA ఆఫర్ చేసిన గ్రీన్ కార్డ్ కి అమ్ముడుపోయారు.

జెనరల్ జెవియర్ మార్కనో టబట వెనిజులా సైనికుల దగ్గర ఉన్న Igla-S మాన్ పాడ్స్ ని తన ఆదేశాలు లేకుండా ఫైర్ చేయవద్దని ముందే ఆదేశాలు ఇచ్చాడు CIA చెప్పినట్లుగా. కమ్యూనికేషన్ వ్యవస్థ జామ్ అవగానే చీనూక్ ట్రాన్స్పోర్ట్ హెలికాఫ్టర్లు, బ్లాక్ హాక్ హెలికాఫ్టర్లు, అపాచి ఎటాక్ హెలికాఫ్టర్లు చాలా తక్కువ ఎత్తులో ఎగురుతున్నా IGLA-S మాన్ పాడ్స్ ని ప్రయోగించలేదు సైనికులు ఎందుకంటే జెవియర్ మార్కనో టబట ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు!

ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ లో భాగంగా EA/18G గ్రోలర్ జెట్స్ తక్కువ ఎత్తులో ఎగురుతూ జామింగ్ చేస్తున్నా IGLA-S లని ప్రయోగించలేదు వెనిజులా సైనికులు. నిజానికి EA/18G గ్రోలర్ జెట్స్ మొత్తం 4 తక్కువ ఎత్తులో ఎగురుతూ IGLA-S కూల్చగల రేంజ్ లో ఉన్నా వాటిని ప్రయోగించలేదు!

******
iPhone 17 max pro! ఒక ఐఫోన్ 17 మాక్స్ ప్రో మొబైల్ ఫోన్ వెనిజులా అధ్యక్షుడిని అమెరికన్ డెల్టా ఫోర్స్ కి దొరికేలా చేసింది.

వెనిజులా అధ్యక్షుడు నీకోలాస్ మదురో తన రక్షణ కోసం వెనిజులా సైన్యాన్ని నమ్ముకోలేదు! క్యూబా నుండి సెక్యూరిటీ గార్డ్స్ తెప్పించుకొని తనకి రక్షణగా పెట్టుకున్నాడు.

200 మంది క్యూబా సెక్యూరిటీ గార్డ్స్ రెండు షిఫ్ట్ లలో మదురోకి కాపలా కాస్తుంటారు. క్యూబా ఇంటెలిజెన్స్ అధికారులు మదురో రక్షణ బాధ్యతలని నిర్వర్తిస్తూఉంటారు. లాటిన్ అమెరికన్ దేశాలలో సైనిక కుట్రలు సర్వసాధారణం కాబట్టి ఒకప్పటి సోవియట్ యూనియన్ ఇప్పుడు రష్యాకి మిత్ర దేశం అయిన క్యూబా ని తన రక్షణ కోసం ఎంచుకున్నాడు మదురో.

CIA ఎలా ప్రవర్తిస్తుందో బాగా తెలిసిన క్యూబా ఇంటెలిజెన్స్ మదురో ని రోజూ ఒకే బెడ్ రూమ్ లో కాకుండా అధ్యక్షభవనంలో ఒక్కో రోజు ఒక్కో బెడ్ రూమ్ లో నిద్రపోయేలా ప్లాన్ చేసింది. మదురో ఏ రోజు ఏ బెడ్ రూమ్ లో నిద్రిస్తాడో క్యూబా ఇంటెలిజెన్స్ అధికారి నిర్ణయిస్తాడు కానీ ఎవరికీ తెలియదు.

జెనరల్ జెవియర్ మార్కనో టబట అధ్యక్ష్య భవనం బ్లూ ప్రింట్ ని చాలా కాలం కిందటే అమెరికాకి ఇచ్చాడు. అధ్యక్ష్య భవనం బ్లూ ప్రింట్ సహాయంతో CIA టెక్సస్ లోని నెవెడా ఎడారిలో అచ్చం వెనిజులా అధ్యక్ష్య భవనంని పోలి ఉండేలా తాత్కాలిక కట్టడం కట్టి గదులకి నంబర్లు పెట్టి, కారిడార్ లు, హెలిపాడ్ లు ఎక్కడ ఉన్నాయో అలాగే హెలిపాడ్ మీద హెలికాప్టర్ ల్యాండ్ చేసి ఎలా అధ్యక్ష్య భవనంలో కి ప్రవేశించాలో, ఎక్కడెక్కడ క్యూబా సెక్యూరిటీ గార్డులు ఉంటారో ఇలా యాక్షన్ ప్లాన్ ప్రాక్టీస్ చేశారు 200 మంది డెల్టా ఫోర్స్ కమాండో లు.

ఒక నెలపాటు తీవ్రమైన ప్రాక్టీస్ చేసిన అనంతరం డిసెంబర్ 25 న దాడి చేయడానికి నిర్ణయించగా అది కాస్తా జనవరి 3 కి వాయిదాపడింది. అమెరికా దాడి చేసిన రాత్రి డెల్టా ఫోర్స్ కి అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నది Go Ahead అనే సంకేతాన్ని ఇవ్వడానికి ఐఫోన్ 17 మాక్స్ ప్రో ని ఉపయోగించుకున్నది CIA.

ఒక పక్క EA/18 G గ్రోలర్ ఎయిర్ డిఫెన్స్ ని, కమ్యూనికేషన్ వ్యవస్థని స్థంబింపచేస్తే మరో పక్క F-35 లైట్నింగ్ II రాడార్లని పేల్చివేస్తుంటే డెల్టా ఫోర్స్ కోసం ప్రత్యేకంగా మోడీఫై చేసిన స్టెల్త్ హెలికాప్టర్స్, ఆపరేషన్ కోసం శబ్దం తక్కువగా వచ్చేట్లుగా మార్పులు చేసిన చినూక్ ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్లలో మొత్తం 200 మంది డెల్టా ఫోర్స్ కమాండో లు సిద్ధంగా ఉన్న సమయంలో…

అధ్యక్షుడు మదురో అధ్యక్షభవనంలో ఏ గదిలో నిద్రిస్తున్నాడో ముందే సమాచారం జెనరల్ జెవియర్ మార్కనో టబట CIA కి ఇచ్చేసాడు కానీ అమెరికన్ దళాలు దాడి చేస్తున్నప్పుడు వచ్చే శబ్దాలకి క్యూబా సెక్యూరిటీ మదురోని అప్పటికప్పుడు గది మార్చేస్తే ఆ విషయం కోడ్ సంభాషణ ద్వారా CIA కి తెలియ చేయాలి జెవియర్.

ఒకవేళ మదురో కనుక అదే గదిలో ఉన్నట్లయితే జస్ట్ ఐ ఫోన్ 17 మాక్స్ ని ఆన్ చేస్తే చాలు అది రహస్య సంకేతం అన్నమాట. జెనరల్ జెవియర్ మార్కనో టబట తన సహాయకుడిని ఐ ఫోన్ 17 మాక్స్ ప్రో ని స్విచ్ ఆన్ చేయమని ఆదేశించాడు. జెవియర్ సహాయకుడు ఐఫోన్ స్విచ్ ఆన్ చేసాడు థట్స్ ఇట్!

అంతరీక్షంలో ఉన్న అమెరికన్ శాటి లైట్ ఐఫోన్ స్విచ్ ఆన్ అయినట్లుగా సమాచారం ఇచ్చింది అప్పటికే సిద్ధంగా ఉన్న డెల్టా ఫోర్స్ కమాండోలో అధ్యక్షభవనం మీద హెలికాప్టర్స్ నుండి కిందకి దిగి నేరుగా నీకోలాస్ మదురో నిద్రిస్తున్న గది దగ్గరికి వెళ్లి తలుపులు పగులకొట్టి మదురోని అదుపులోకి తీసుకున్నారు!

మరి సెక్యూరిటీ డ్యూటీ లో ఉన్న క్యూబా గార్డ్స్ ఏమయ్యారు? అంతుచిక్కని, ఇప్పటివరకూ వినని, చూడని ఆయుధంతో 80 మంది క్యూబా సెక్యూరిటీ గార్డ్స్ ని చంపేసి నేరుగా మధురో ఉన్న గది దగ్గరికి వెళ్లిపోయారు డెల్టా ఫోర్స్ కమాండో లు.

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గిల్ సొంత హైటెక్ వాటర్ ప్యూరిఫయర్… కోహ్లీ అత్యంత ఖరీదైన వాటర్…
  • నాటో కూటమి అటో ఇటో… జియోపాలిటిక్స్‌లో అమెరికా కొత్త ఆట….
  • సాహసమే కృష్ణ ఊపిరి..! తెలుగు రాజకీయాల్లో పెద్ద రచ్చ ఆనాడు..!!
  • చమురుపై అమెరికా గ్రిప్… తద్వారా ప్రపంచంపై గ్రిప్… పార్ట్ 5
  • మదురో భవనం సెట్ వేసి… అమెరికా ఎడారిలో నెల రిహార్సల్… పార్ట్-4 …
  • వెనెజులా కొంప ముంచిన చైనా… చేతులెత్తేసిన నాసి రాడార్లు… పార్ట్-3
  • S E A D …. వెనెజులాపై దాడికి ప్రయోగించిన వార్ టెక్నిక్… (పార్ట్-2)
  • 2026 జియోపాలిటిక్స్… కాలజ్ఞాని బాబ వంగ ముందే చెప్పింది… (పార్ట్-1)
  • నేలకొరిగిన తెలుగు సింహం… ఒకేరోజు మూడు సప్లిమెంట్లు ఇచ్చాం….
  • అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు… కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions