Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాటో కూటమి అటో ఇటో… జియోపాలిటిక్స్‌లో అమెరికా కొత్త ఆట….

January 19, 2026 by M S R

.

Pardha Saradhi Upadrasta  గ్రీన్‌లాండ్ వివాదం → ట్రంప్ టారిఫ్ యుద్ధం → NATO బలహీనత → యూరప్ యూనియన్ వ్యూహాత్మక మలుపు → భారత్ & BRICS కోణం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్‌లాండ్ అంశాన్ని కేంద్రంగా చేసుకుని యూరప్ దేశాలపై భారీ టారిఫ్‌లు ప్రకటించారు. డెన్మార్క్ , నార్వే , స్వీడన్ ఫ్రాన్స్, జర్మనీ , యూకే , నెదర్లాండ్స్ , ఫిన్‌లాండ్. ఈ దేశాల మీద 2026 ఫిబ్రవరి 1 నుంచి 10% దిగుమతి సుంకం, 2026 జూన్ 1 నుంచి 25% టారిఫ్ పెంపు
ఇది సాధారణ వాణిజ్య నిర్ణయం కాదు, ఇది భూభౌగోళిక–ఆర్థిక యుద్ధం (Geo-Economic Warfare)

Ads

1️⃣  గ్రీన్‌లాండ్ ఎందుకు అంత కీలకం?
ఆర్క్టిక్‌లో వ్యూహాత్మక స్థానం
అరుదైన ఖనిజ సంపద (Rare Earths)
భవిష్యత్ సముద్ర మార్గాలు
అమెరికా కీలక మిసైల్ & ఎయిర్ డిఫెన్స్ బేస్
ఇక్కడ రష్యా, చైనా ప్రభావం పెరుగుతోంది అబే ఆరోపణతో అమెరికా సంపూర్ణ నియంత్రణ కోరుతోంది.
ట్రంప్ దృష్టిలో “గ్రీన్‌లాండ్ = అమెరికా జాతీయ భద్రత”

2️⃣ యూరప్ ఎందుకు గట్టిగా ఎదిరించింది?
గ్రీన్‌లాండ్ అమ్మకానికి కాదు
సార్వభౌమత్వ ఉల్లంఘన
అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం
వలసవాద దృక్పథం
యూరప్ ఒక సమూహంగా అమెరికాను తిరస్కరించింది, అదే ట్రంప్‌కు అసహనం

3️⃣ ట్రంప్ టారిఫ్‌లు – అసలు ఆయుధం
“బాంబులు కాదు – టారిఫ్‌లే చాలు”
వీటి వల్ల
యూరప్ ఎగుమతులు ఖరీదవుతాయి
ఆటోమొబైల్, స్టీల్, ఫార్మా, టెక్ రంగాలకు దెబ్బ
మాంద్యం, నిరుద్యోగం ముప్పు
ఇది స్పష్టమైన Economic Blackmail

4️⃣  NATO ఎందుకు బలహీనమవుతోంది?
NATO పునాది =  నమ్మకం
కానీ ఇప్పుడు అమెరికానే మిత్రదేశాలపై ఆర్థిక, రాజకీయ దాడి, భాగస్వామి ఏ బెదిరింపు దారుగా మారటం వల్ల ఆ విశ్వాసం తీవ్రంగా దెబ్బతినడం
NATO సైనికంగా ఉండొచ్చు రాజకీయంగా, నైతికంగా మాత్రం బలహీనమవుతోంది
“NATO is not dead militarily, but dying politically.”

multipolar

5️⃣  యూరప్ ఇక ఏం చేయబోతోంది?
యూరప్ యూనియన్ స్వంత రక్షణ దళం ఏర్పాటు చేసుకుంది, ఇప్పటికే ఫలు దేశాలు వారి ట్రూప్ లను గ్రీన్లాండ్ లో రక్షణకు దించాయి.
అమెరికా ఆయుధాలపై ఆధారాన్ని తగ్గింపు
డాలర్ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయాలు
రష్యా, చైనా, భారత్ లాంటి దేశాలతో వ్యూహాత్మక సర్దుబాట్లు
మొత్తం అర్థం అమెరికా కేంద్రిత ప్రపంచ వ్యవస్థ నుంచి నెమ్మదిగా విడిపోవడం

6️⃣  ప్రపంచానికి దీని అర్థం ఏమిటి?
మిత్రదేశాలే శత్రువులవుతారు
వాణిజ్యం = కొత్త యుద్ధ రంగం
డాలర్ = అత్యంత శక్తివంతమైన ఆయుధం
చిన్న దేశాలు పెద్ద శక్తుల ఆటలో పావులే, గ్రీన్‌లాండ్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ

7️⃣ ఇక్కడే భారత్ ఎంటర్ అయ్యింది
అమెరికాతో దూరం పెరుగుతున్న వేళ
యూరప్ యూనియన్ భారత్ వైపు వేగంగా తిరుగుతోంది. ఇది భారత్ కూడా ఎప్పటి నుండో వేసిన వ్యూహాత్మక అడుగు. అమెరికా టారిఫ్ ల యుద్ధ నేపధ్యంలో భారత్ తవ ఎగుమతులను వివిధ దేశాల వైపు మళ్ళించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. అదే యూరప్ యూనియన్ కి అవసరం, భారత్ కి అవకాశం.
యూరప్ యూనియన్ , భారత్ Free Trade Agreement (FTA) ఇప్పటికే ఫైనల్ స్టేజ్ చర్చల్లో. జనవరి 27 న ఫైనల్ చర్చ, ఆ రోజే సంతకాలు అని ఇద్దరూ ప్రకటించారు.

nato

యూరప్‌కు కావాల్సింది
• భారీ మార్కెట్
• నమ్మకమైన రాజకీయ భాగస్వామి
• అమెరికా, చైనా‌కు ప్రత్యామ్నాయం
ఈ ఖాళీని భారత్ పూరించగల స్థితిలో ఉంది

8️⃣  యూరప్ యూనియన్ దేశాలు BRICS లోకి వెళ్తాయా?
యూరప్ యూనియన్ మొత్తం BRICS లోకి వెళ్ళకపోవచ్చు, NATO దేశాలు యూరప్ యూనియన్ నుంచి బయటకు రావు కానీ ఒకొక్కరు BRICS వైపు దగ్గర అవచ్చు. ఇప్పటికే యూరప్ యూనియన్ FTA తో పాటు UK, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు భారత్ తో రక్షణ , ఆటోమొబైల్, IT ఇలా వివిధ రంగాల్లో నేరుగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి, అంటే యూరప్ యూనియన్ ఒక సమూహంగా, వివిధ దేశాలు వారి వారి ఏరియాలలో ఇండివిడ్యుయల్ ఒప్పందాలు.

BRICS అంటే డాలర్ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయం, మల్టీ- పోలార్ ప్రపంచానికి వేదిక. అందుకే అన్ని దేశాలు ఈ BRICS దేశాలతో ఒప్పందానికి వస్తున్నాయి.

సాధ్యమైన మార్గాలు…
BRICS‌తో ఆర్థిక సహకారం
BRICS బ్యాంక్ (NDB)తో భాగస్వామ్యం
డాలర్ కాకుండా ట్రేడ్ సెటిల్‌మెంట్స్. ఇప్పటికే భారత్, యూరప్ యూనియన్ దేశాల మధ్య రూపాయి, యూరోలలో వాణిజ్యం చేద్దాం అనే ప్రతిపాదన, చాలా చోట్ల చేయటం మొదలు పెట్టారు.
అంటే BRICS లోకి దూకుడు కాదు – కానీ బ్యాక్‌డోర్ ఎంట్రీ. వ్యూహాత్మక, ఒప్పందాలు.

trump

9️⃣  తుది విశ్లేషణ
ఇది కేవలం టారిఫ్ వార్త కాదు, ఇది గ్రీన్‌లాండ్ వివాదం మాత్రమే కాదు
✔ ఇది Post-NATO ప్రపంచ సంకేతం
✔ అమెరికా –యూరప్ యూనియన్ మైత్రిలో చీలిక
✔ యూరప్ యూనియన్ – భారత్ భాగస్వామ్యానికి స్వర్ణావకాశం. ఇప్పటికే ఒకొక్క దేశంతో ఉంది, ఇప్పుడు అది యూరప్ యూనియన్ స్థాయిలో బలపడుతుంది.
✔ BRICS ప్రాధాన్యత పెరుగుతున్న దశ
✔ ప్రపంచం మల్టీ- పోలార్ వైపు ప్రయాణం

“ప్రపంచం ఇక ఒకే కేంద్రం కాదు, అనేక శక్తి కేంద్రాల సమతుల్యం. దానిలో భారత్ ఒకటి”. భారత్ ప్రతి ఒక్క సంక్షోభాన్ని అవకాశంగా తీసుకొని తన అడుగులు తాను వేస్తోంది. — ఉపద్రష్ట పార్ధసారధి

#TrumpTariffs #GreenlandCrisis #NATO
#EUShift #EUIndiaFTA #BRICS
#WorldOrder #MultipolarWorld
#Geopolitics #GlobalPowerShift #PardhaTalks

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గిల్ సొంత హైటెక్ వాటర్ ప్యూరిఫయర్… కోహ్లీ అత్యంత ఖరీదైన వాటర్…
  • నాటో కూటమి అటో ఇటో… జియోపాలిటిక్స్‌లో అమెరికా కొత్త ఆట….
  • సాహసమే కృష్ణ ఊపిరి..! తెలుగు రాజకీయాల్లో పెద్ద రచ్చ ఆనాడు..!!
  • చమురుపై అమెరికా గ్రిప్… తద్వారా ప్రపంచంపై గ్రిప్… పార్ట్ 5
  • మదురో భవనం సెట్ వేసి… అమెరికా ఎడారిలో నెల రిహార్సల్… పార్ట్-4 …
  • వెనెజులా కొంప ముంచిన చైనా… చేతులెత్తేసిన నాసి రాడార్లు… పార్ట్-3
  • S E A D …. వెనెజులాపై దాడికి ప్రయోగించిన వార్ టెక్నిక్… (పార్ట్-2)
  • 2026 జియోపాలిటిక్స్… కాలజ్ఞాని బాబ వంగ ముందే చెప్పింది… (పార్ట్-1)
  • నేలకొరిగిన తెలుగు సింహం… ఒకేరోజు మూడు సప్లిమెంట్లు ఇచ్చాం….
  • అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు… కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions