Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ చివరి బాల్ అలాగే మిగిలి ఉంది… 22 పరుగులు వచ్చి గెలిచేశారు…

January 19, 2026 by M S R

.

మీరు క్రికెట్ అభిమానులా..? అనేక ఉత్కంఠభరిత ముగింపులను చూసి ఉంటారు కదా… కానీ బహుశా ఈ ముగింపు ఎప్పుడూ చూసి ఉండరు… అద్భుతం… అందుకే అంటారు పెద్దలు… దేన్నీ అంత తేలికగా వదిలేయకు, ఏమో గుర్రమెగురా వచ్చు… గెలుపు మెడలో పడనూ వచ్చు అని… ఇదీ అదే… నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్ అని ఏదో అంటారు కదా, అలా…

ఆఖరి బంతి.. అంతులేని ఉత్కంఠ!

Ads

మ్యాచ్ క్లైమాక్స్‌కు చేరుకుంది… గెలవడానికి చివరి బంతికి 22 పరుగులు కావాలి… సాధారణంగా ఏ బౌలర్ అయినా ఆత్మవిశ్వాసంతో ఉంటాడు, ఎందుకంటే ఒక బంతికి 22 పరుగులు రావడం సింపుల్‌గా అసాధ్యం కాబట్టి… బ్యాట్స్‌మెన్ కూడా ఆత్రపడి అవుట్ అయిపోయే చాన్సూ ఉంటుంది కాబట్టి… కానీ ఆ రోజు రాసి పెట్టి ఉంది వేరేలా!

ఏం జరిగింది? (The Sequence of Events)

బౌలర్ ఒత్తిడికి లోనయ్యాడో లేక లయ తప్పాడో తెలియదు కానీ, వరుస తప్పిదాలతో బ్యాటర్‌కు వరాలు ఇచ్చాడు… కరేబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ఇది… ఆ టీమ్స్ పేర్లు, ఆ ప్లేయర్ల పేర్లు పెద్ద పాపులర్ కావు గానీ… విషయం చెప్పుకుందాం, ఇదీ ఆ వీడియో…

https://muchata.com/wp-content/uploads/2026/01/AQPc1leg9pt73xDGuR58lpQASuTHQBW6oGhhW4G5-bufyGH7DVXy8gs08zaWUfgEUBncN1JOJqBxMQqgxqsvVNYMqBZcmjtnLzT-YQjw-6yVww.mp4

మొదటి ప్రయత్నం… నో బాల్… ఒక పరుగు వచ్చింది, ఇంకా 21 చేయాలి, బాల్ మిగిలే ఉంది, ఫ్రీ హిట్ చాన్స్…

రెండవ ప్రయత్నం… ఈసారి వైడ్ బాల్… మరో పరుగు వచ్చింది, ఇంకా 20 చేయాలి, బాల్ మిగిలే ఉంది… ఆ ఫ్రీ హిట్ చాన్స్ లైవ్‌గానే ఉంది…

మూడవ ప్రయత్నం… ఆ ఫ్రీ హిట్‌ను సిక్స్ కొట్టాడు… పైగా అదీ నో బాల్… అంటే ఏడు పరుగులు జత కలిశాయి… అంటే మరో 13 చేయాలి, మళ్లీ ఫ్రీ హిట్, అంటే ఆ బాల్ ఇంకా బతికే ఉంది… 

నాలుగో ప్రయత్నం… మళ్లీ నో బాల్, మళ్లీ సిక్స్… అంటే మరో ఏడు పరుగులు… చివరి బాల్ ఇంకా మిగిలే ఉంది… ఇప్పుడిక మరో ఫ్రీ హిట్ చాన్స్… ఆ బాల్‌కు సిక్స్ కొట్టినా మరో బాల్ మిగిలే ఉంటుంది…

5. అయిదో ప్రయత్నం… మరో సిక్స్… ఆ ఫ్రీ హిట్‌తో గెలుపు ఒడిలోకి వచ్చి వాలింది… ఆ చివరి బంతి అలాగే మిగిలి ఉంది…

అంటే… లెక్కకు వచ్చే బంతి పడకుండానే, 22 పరుగులు ఇచ్చేశారన్నమాట… వావ్, అమేజింగ్… ఒక ఓవరులో 36 పరుగులు సాధించిన యువరాజ్ సింగ్ గుర్తున్నాడు… కానీ ఒక నో బాల్‌కు ఏకంగా 22 పరుగులు అనేది ఆశ్చర్యం, అద్భుతం…

ఈ స్టోరీ మనకు ఏం చెబుతుందంటే?…. క్రికెట్‌లో “ఇట్స్ నాట్ ఓవర్ అంటిల్ ఇట్స్ ఓవర్” (చివరి వరకు ఏదీ ముగిసిపోదు)…. 21 పరుగులు కావాల్సి ఉన్నప్పుడు బౌలర్ నిశ్చింతగా ఉన్నా, క్రమశిక్షణ తప్పితే ఆట ఎలా తలకిందులు అవుతుందో చెప్పడానికి ఈ మ్యాచ్ ఒక గొప్ప పాఠం….

డిస్‌క్లయిమర్ ..... కొందరు ఈ వీడియోను ఫేక్ అంటున్నారు... అవునో కాదో తెలియదు... కానీ ఫేక్ అయినా సరే చూడటానికి ఎంత బాగుందో కదా....

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ చివరి బాల్ అలాగే మిగిలి ఉంది… 22 పరుగులు వచ్చి గెలిచేశారు…
  • ప్రియమైన భార్యామణి గారికి… నాకు ఓ ‘పర్‌ఫెక్ట్ మ్యాచ్’ దొరికింది సుమా…
  • ఉడకని అమెరికా పప్పులు…. ట్రంపరికి ఇండియా సైలెంట్ వాతలు…
  • గిల్ సొంత హైటెక్ వాటర్ ప్యూరిఫయర్… కోహ్లీ అత్యంత ఖరీదైన వాటర్…
  • నాటో కూటమి అటో ఇటో… జియోపాలిటిక్స్‌లో అమెరికా కొత్త ఆట….
  • సాహసమే కృష్ణ ఊపిరి..! తెలుగు రాజకీయాల్లో పెద్ద రచ్చ ఆనాడు..!!
  • చమురుపై అమెరికా గ్రిప్… తద్వారా ప్రపంచంపై గ్రిప్… పార్ట్ 5
  • మదురో భవనం సెట్ వేసి… అమెరికా ఎడారిలో నెల రిహార్సల్… పార్ట్-4 …
  • వెనెజులా కొంప ముంచిన చైనా… చేతులెత్తేసిన నాసి రాడార్లు… పార్ట్-3
  • S E A D …. వెనెజులాపై దాడికి ప్రయోగించిన వార్ టెక్నిక్… (పార్ట్-2)

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions