Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మన పీఎస్ఎల్‌వీ వరుస వైఫల్యాల వెనుక ఏదైనా ‘స్పేస్‌వార్’..?

January 20, 2026 by M S R

.

( గోపు విజయకుమార్ రెడ్డి ) …..  ఇస్రో డైరీస్: పీఎస్ఎల్వీ ‘హ్యాట్రిక్’ గండం – తెర వెనుక ఏం జరుగుతోంది?

ఒకప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోయేలా, ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపి రికార్డు సృష్టించిన “వర్క్ హార్స్” (Workhorse) మన PSLV… హాలీవుడ్ సినిమా బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో అంగారకుడిని చేరిన ఘనత మన ఇస్రోది… అలాంటి ఇస్రోకు ఇప్పుడు ఒక పట్టరాని “గ్రహణం” పట్టుకుందా? లేక ఎవరైనా కావాలనే పక్కలో బల్లెంలా మారుతున్నారా?

Ads

 మిషన్: ‘స్మార్ట్ ఐ’ (EOS-N1) క్లోజ్డ్

మొన్నటి ప్రయోగం కేవలం ఒక రాకెట్ ప్రయోగం మాత్రమే కాదు… అది అంతరిక్షంలో భారతదేశం ఏర్పాటు చేసుకోబోయే ఒక “డిజిటల్ కన్ను”… DRDO కష్టపడి తయారు చేసిన ఈ EOS-N1 కనుక కక్ష్యలో చేరి ఉంటే, సరిహద్దుల్లో చీమ చిటుక్కుమన్నా మనకు హై-డెఫినిషన్ పిక్చర్ వచ్చేది….

  • గత వైఫల్యం….: మే 18, 2025 (PSLV-C61) – అప్పుడు కూడా మూడో దశలోనే సమస్య….

  • తాజా వైఫల్యం…: మళ్ళీ అదే రిపీట్!

 ఇది యాదృచ్ఛికమా? లేక కుట్రనా?

పలు సందేహాలు తలెత్తుతున్నట్టుగా, ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేస్తున్న వేళ, మన రక్షణ ఉపగ్రహాలు వరుసగా ఫెయిల్ అవ్వడం వెనుక కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి…

  1. మూడో స్టేజ్ మిస్టరీ…: రాకెట్ భూమి ఆకర్షణ శక్తిని దాటి, కక్ష్యలోకి ప్రవేశించే కీలక సమయంలోనే (3rd Stage) ఇంజిన్ మొరాయించడం వెనుక సాఫ్ట్‌వేర్ గ్లిచ్ ఉందా? లేక ఎవరైనా ‘సైబర్ అటాక్’ ద్వారా సిగ్నల్స్ మారుస్తున్నారా?

  2. పబ్లిక్ డొమైన్ లో లేని రిపోర్ట్…: సాధారణంగా ఇస్రో వైఫల్యాలను వెంటనే విశ్లేషించి రిపోర్ట్ ఇస్తుంది… కానీ C61 రిపోర్ట్ ఇంకా PMO (ప్రధానమంత్రి కార్యాలయం) దగ్గరే ఉండిపోవడం చూస్తుంటే, ఇందులో ఏదో సెన్సిటివ్ మ్యాటర్ ఉందని అర్థమవుతోంది….

  3. డ్రాగన్ & ఈగిల్ కన్ను….: చైనాకు చెందిన  ‘గావోఫెన్’, అమెరికా ‘వరల్డ్ వ్యూ’లకు దీటుగా భారత్ ఎదగడం ఆ దేశాలకు ఇష్టం ఉండకపోవచ్చు…. స్పేస్ టెక్నాలజీలో మన కమర్షియల్ మార్కెట్‌ను దెబ్బతీయడానికి ఇది ఒక “స్పేస్ వార్” కావొచ్చా?


 ఇస్రో బ్రాండ్ వాల్యూకు ముప్పు?

ఇస్రో అంటేనే ‘నమ్మకం + తక్కువ ఖర్చు’... ఇప్పుడు వరుసగా రెండు ఫెయిల్యూర్లు రావడం వల్ల…

  • విదేశీ కస్టమర్లు తమ ఉపగ్రహాలను మనకు ఇవ్వడానికి వెనకాడుతారు…

  • నమ్మకమైన రాకెట్ అని పేరున్న PSLV పై అనుమానాలు మొదలవుతాయి…

  • వచ్చే 12 నెలల పాటు మన రక్షణ రంగం మళ్ళీ పాత డేటా మీదే ఆధారపడాల్సి వస్తుంది…

బాటమ్ లైన్...: యుద్ధంలో ఆయుధాల కంటే సమాచారమే (Information) గొప్పది... మన సమాచార వ్యవస్థను దెబ్బతీయడం అంటే, యుద్ధం మొదలవ్వకముందే మనల్ని కళ్లు లేని కబోదులను చేయడమే....


ముగింపు….: మన శాస్త్రవేత్తల ప్రతిభపై మనకు నమ్మకం ఉంది. కానీ, “లోగుట్టు పెరుమాళ్ళకెరుక” అన్నట్టుగా.. సాంకేతిక లోపమా లేక అంతర్జాతీయ రాజకీయ చదరంగమా అనేది తేలాలంటే ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బయటకి రావాల్సిందే!

మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు…. కార్గిల్ యుద్దంలో అమెరికా మనల్ని తప్పుదోవ పట్టించింది, జీపీఎస్ కచ్చితత్వాన్ని తగ్గించేసి… పాకిస్థాన్‌కు ఉపయోగపడేలా… దాన్ని నమ్మలేం… చైనా సరేసరి… మన సొంత హైటెక్ నేవిగేషన్ ఉపగ్రహం ఫెయిల్ కావడం మనకు రక్షణ కోణంలో దెబ్బ, పైగా ఇస్రో కమర్షియల్ వాల్యూ, క్రెడిబులిటీకి కూడా దెబ్బ… ఈ ఫెయిల్యూర్ల వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి..? పీఎంఓ వెల్లడించాల్సిందే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అబుదాబి ఆయిల్ క్షేత్రాల్లో… ఇండియా సొంత ఉత్పత్తి… శుభసంకేతం…
  • దంపతులకు జాయింట్ టాక్స్ … మధ్యతరగతికి ‘బడ్జెట్’ వరం..?
  • 2 గంటల పర్యటనకు ఓ విశిష్ట అతిథి..! మోడీ స్వీయ స్వాగతం వెనుక..?!
  • సాక్షి…! భర్త విలన్… భార్య షీరో… అప్పట్లో ఓ క్రైమ్ థ్రిల్లర్…
  • మన పీఎస్ఎల్‌వీ వరుస వైఫల్యాల వెనుక ఏదైనా ‘స్పేస్‌వార్’..?
  • ఆ చివరి బాల్ అలాగే మిగిలి ఉంది… 22 పరుగులు వచ్చి గెలిచేశారు…
  • ప్రియమైన భార్యామణి గారికి… నాకు ఓ ‘పర్‌ఫెక్ట్ మ్యాచ్’ దొరికింది సుమా…
  • ఉడకని అమెరికా పప్పులు…. ట్రంపరికి ఇండియా సైలెంట్ వాతలు…
  • గిల్ సొంత హైటెక్ వాటర్ ప్యూరిఫయర్… కోహ్లీ అత్యంత ఖరీదైన వాటర్…
  • నాటో కూటమి అటో ఇటో… జియోపాలిటిక్స్‌లో అమెరికా కొత్త ఆట….

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions