.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ … యుఎఈ… దీని అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ (MBZ) భారత్ వచ్చినప్పుడు ప్రధాని మోడీ అన్ని ప్రోటోకాల్స్ బ్రేక్ చేస్తూ, స్వయంగా విమానాశ్రయానికి వెళ్లడం, ఆత్మీయ ఆలింగనం చేసుకుని, ఒకే కారులో వెళ్తూ ముచ్చటించడం అసాధారణమే…
ఇలాంటి చర్యలు, స్నేహపూర్వక సంభాషణలు, ఆత్మీయ ఆలింగనాలు, స్వాగతాలు, అధిక ప్రాధాన్యాలు మోడీ మార్క్ విదేశాంగం..! గతంలో సౌదీ యువరాజుకు కూడా ఇదే ప్రాధాన్యం… పుతిన్‌తో చెప్పనక్కర్లేదు…
Ads
- యుఎఈ అధ్యక్షుడు మరీ రెండు గంటల పర్యటనకు రావడం ఏమిటనేదే ఆశ్చర్యార్థకమైన ప్రశ్న… ఇరాన్- అమెరికా పరిణామాలు, యెమెన్ సంక్షోభం, గాజా అస్థిరత, చమురు దేశాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో… ఏవో కీలక చర్చల కోసమే ఇండియాకు వచ్చి మోడీతో భేటీ అయ్యాడని అంటున్నారు కానీ పర్టిక్యులర్‌గా ఏ అంశంలో చర్చలు అనేదే బయటికి రావడం లేదు… అది విదేశాంగ రహస్యం…
ఐతే యుఎఈ ముస్లిం దేశాల సమాఖ్య కదా… తోటి మత దేశం అనే భావనతో పాకిస్థాన్‌కు మద్దతునిస్తుంటాయి కదా… మరెందుకు ఇండియా ఇంత ప్రాధాన్యతనిస్తోందనేది చాలామందిలో డౌట్… కానీ గ్లోబల్ పాలిటిక్స్ మారుతున్నాయి… పాకిస్థాన్ ధూర్త ప్రయత్నాలకు పలు గల్ఫ్ దేశాలు దూరంగా ఉంటున్నాయి… పైగా…
- యుఎఈ ఇప్పుడు కొన్ని కీలక గ్లోబల్ అంశాల్లో మనకు భాగస్వామి… అదే కాదు, సౌదీ, కతర్ కూడా ఇప్పుడు ఇండియాతో సత్సంబంధాల్లో ఉన్నాయి… మనకు అతి పెద్ద చమురు, సహజ వాయువు (50 శాతం) సప్లయర్స్ మాత్రమే కాదు.., ఈ దేశాల్లో 90 లక్షల మంది ఇండియన్స్ పనిచేస్తున్నారు… అన్నింటికీ మించి రెండు అంశాల్లో అరబ్ ఎమిరేట్స్ మనకు కీలక పార్టనర్… (కతర్‌లో మన నేవీ అధికారులను విడిపించగలగడం కొత్త దౌత్యం, కొత్త స్నేహాల ఫలితమే)…
సౌదీ 100 బిలియన్ డాలర్లు, యూఏఈ 75 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో భారత్‌ను తమ రెండో ఇల్లుగా భావిస్తున్నాయి… గతంలో కాశ్మీర్ విషయంలో పాక్‌కు మద్దతు ఇచ్చే ఈ దేశాలు, ఇప్పుడు ఆ సమస్యను భారత్ అంతర్గత విషయంగా గుర్తిస్తున్నాయి…. ఇది పాకిస్థాన్ దౌత్యానికి కోలుకోలేని దెబ్బ…
మరో కీలకం IMEC… ఇది చైనా ‘బీఆర్ఐ’ కి గట్టి చెక్… చైనా తన Belt and Road Initiative (BRI) ద్వారా ప్రపంచాన్ని అప్పుల ఊబిలో నెట్టి తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తోంది… దీనికి ప్రత్యామ్నాయంగా భారత్ తీసుకొచ్చిన అస్త్రమే IMEC (India-Middle East-Europe Economic Corridor)….
IMEC ప్రత్యేకతలు…. భారత్ నుండి యూరప్‌కు సరుకులు వెళ్లే సమయం 40% తగ్గుతుంది… ఇది చైనా సముద్ర మార్గాల కంటే వేగవంతమైనది…. చైనా ప్రాజెక్టులలాగా దేశాలను అప్పుల పాలు చేయకుండా, ఇందులో అన్ని దేశాలు సమాన భాగస్వాములుగా పెట్టుబడులు పెడతాయి… కేవలం రైలు పట్టాలే కాదు, ఇంటర్నెట్ కేబుల్స్, గ్రీన్ హైడ్రోజన్ పైప్‌లైన్లు కూడా ఈ మార్గం ద్వారా సాగుతాయి…
3. భౌగోళిక రాజకీయాల్లో మార్పు (Geopolitical Shift) చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి పాకిస్థాన్‌ను (CPEC ద్వారా) (చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్) వాడుకుంటోంది… దీనికి సమాధానంగా భారత్, గల్ఫ్ దేశాలతో కలిసి “మిడిల్ ఈస్ట్ క్వాడ్” (I2U2), IMEC ద్వారా చైనా ఆధిపత్యాన్ని అడ్డుకుంటోంది…
ఇంతగా ఇండియాకు విశేష ప్రాధాన్యం ఉన్నందునే మోడీ కూడా ‘అసాధారణ మర్యాద’ ప్రదర్శిస్తూ, ఆత్మీయ బంధాన్ని పెంచే ప్రయత్నం చేయడం… దీన్ని పాకిస్థాన్ – చైనాలకు కూడా చూపించడం..!!
సరే… మరి ఈ ఐటుయుటు (I2U2) – IMEC ఏమిటి..? ఇవీ వివరాలు…
పశ్చిమ ఆసియా క్వాడ్… ఐటుయుటు… ఇది నాలుగు దేశాల (India, Israel, UAE, USA) కలయిక… అందుకే దీనిని ‘I2’ (ఇండియా, ఇజ్రాయెల్) ‘U2’ (యూఏఈ, యూఎస్) అని పిలుస్తారు… దీనిని “పశ్చిమ ఆసియా క్వాడ్” అని కూడా అంటారు…
వాణిజ్యం, ఇంధనం, నీరు, రవాణా, అంతరిక్షం, ఆరోగ్యం, ఆహార భద్రత అనే 6 కీలక రంగాల్లో ఉమ్మడి పెట్టుబడులను ప్రోత్సహించడం దీని లక్ష్యం… ఇది గల్ఫ్ దేశాలతో మనకున్న సంబంధాలను కేవలం ‘చమురు’కే పరిమితం చేయకుండా, టెక్నాలజీ, భద్రత వైపు మళ్లిస్తుంది… గ్లోబల్ పాలిటిక్స్‌లో మనవైపు ఉండేలా చేస్తుంది…
India-Middle East-Europe Economic Corridor (IMEC) అనేది 2023 G20 సదస్సులో భారత్, అమెరికా, సౌదీ అరేబియా కలిసి ప్రకటించిన ఒక చారిత్రాత్మక కారిడార్…
-
నిర్మాణం…: ఇది సముద్ర మార్గం, రైలు మార్గాల కలయిక… భారత్ నుండి సరుకులు యూఏఈకి చేరుతాయి, అక్కడి నుండి సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్ మీదుగా రైలు మార్గం ద్వారా ఐరోపాకు (యూరప్) వెళ్తాయి…
ఇది కేవలం రైలు పట్టాలే కాదు, గ్రీన్ హైడ్రోజన్ పైప్‌లైన్లు, హై-స్పీడ్ డేటా కేబుల్స్‌ను కూడా కలిగి ఉంటుంది… భారత్‌ను ప్రపంచ వాణిజ్యానికి ఒక ‘నోడల్ హబ్’గా మారుస్తుంది…
ఈ రెండు కూటముల వల్ల భారత్‌కు లభించే అతిపెద్ద బలం ఏమిటంటే… చైనా మన పొరుగు దేశాల్లో (పాకిస్థాన్, శ్రీలంక) తన పట్టును పెంచుకుంటుంటే, భారత్ తన మిత్రదేశాలతో కలిసి ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన మధ్యప్రాచ్యాన్ని తన వైపు తిప్పుకుంది…
ఏడు ఎమిరేట్స్ కలయిక … యూఏఈ అనేది ఏడు చిన్న రాజ్యాల (ఎమిరేట్స్) సమాఖ్య… అవి…
-
అబుదాబి (Abu Dhabi)
-
దుబాయ్ (Dubai)
-
షార్జా (Sharjah)
-
అజ్మాన్ (Ajman)
-
ఉమ్ అల్-ఖువైన్ (Umm Al-Quwain)
-
రస్ అల్-ఖైమా (Ras Al-Khaimah)
-
ఫుజైరా (Fujairah)
ఈ ఏడు ఎమిరేట్స్‌కు ఒక్కొక్కరు ‘షేక్’ (రాజు) ఉంటారు… వీరిలో అబుదాబి పాలకుడు దేశానికి ప్రెసిడెంట్‌గా, దుబాయ్ పాలకుడు వైస్ ప్రెసిడెంట్, ప్రధానమంత్రిగా వ్యవహరిస్తారు… ప్రస్తుతం నిన్న భారత్ వచ్చిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (MBZ) అబుదాబి పాలకుడు, యూఏఈ ప్రెసిడెంట్…
"మొత్తానికి, గల్ఫ్ దేశాల రాజులు భారత ప్రధానికి ఇస్తున్న ఈ 'అసాధారణ గౌరవం'... మారుతున్న ప్రపంచ క్రమంలో భారత్ ఒక 'గ్లోబల్ పవర్'గా ఎదుగుతోందనడానికి సజీవ సాక్ష్యం... చైనా గోడలు బద్దలవుతున్నాయి... పాక్ గొంతు మూగబోతోంది... ఇది నవ భారత్ వేస్తున్న రాజమార్గం...!"
Share this Article