Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

25 లక్షల లైకుల వైరల్ ఇన్‌స్టా పోస్ట్… ఇంతకీ ఏముందీ ఇందులో..?

January 21, 2026 by M S R

.

ఓ సాదా సీదా ఇన్‌స్టా వీడియో బిట్… ఆ ఖాతాలో పెద్ద లైకులు కూడా ఉండవ్ పోస్టులకు… కానీ హఠాత్తుగా 2.5 మిలియన్ల వ్యూస్, 76 వేలకు పైగా లైకులు… 320 కామెంట్లు… ఫుల్ వైరల్…

ఆ ఖాతా టీనా శ్రావ్య అనే మహిళది… నటి అట… కొమరవెల్లి మల్లన్న ట్యాగ్ లైన్ ఉంటుంది… కానీ ఈ వైరల్ వీడియో మాత్రం మేడారం బెల్లం తూకం బాపతు… ఇక్కడ ఆమె తన పెంపుడు కుక్కను కాటాలో పెట్టి తూస్తోంది… దానికి సమానమైన బరువైన బంగారం అనగా బెల్లాన్ని దేవతలకు మొక్కు చెల్లించడానికి…

Ads

ఆ ఖాతాలోనే మరో మహిళ వీడియో కూడా కనిపిస్తోంది, పెంపుడు కుక్క తూకం బాపతు… రెండు పెంపుడు కుక్కలూ ఒకటేనా..? వేర్వేరా తెలియదు గానీ, ఆ వీడియోను జనం ఎవరూ దేకలేదు… కానీ ఈ వీడియో మాత్రం వైరలైంది…  పదండి కొన్ని వివరాల్లోకి వెళ్దాం…



View this post on Instagram



కొందరు కామెంట్లలో అభినందిస్తున్నారు… సొంత పిల్లల్లాగానే పెంపుడు కుక్క (కుక్క అనొద్దట, జస్ట్ పెట్ అనాలట… పేరు మారిస్తే కుక్క కుక్క కాకుండా పోతుందా) నిలువెత్తు బంగారాన్ని దేవతలకు అర్పించడం కొందరి దృష్టిలో అభినందనీయం…

కానీ కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు… అది ధర్మవిరుద్ధం అంటున్నారు… అవమానించడం అంటున్నారు… కానీ ఈ గుడ్డి వ్యతిరేకతే కరెక్టు కాదు… సమాజంలో పెట్స్‌ను సొంత పిల్లల్లా ప్రేమించేవాళ్లు బోలెడు మంది… సో, ఇక్కడ ఆమె అభిమానాన్ని, ప్రేమను తప్పుపట్టాల్సిన పనేముంది..?

కాకపోతే ప్రజెంట్ సోషల్ మీడియా ట్రెండ్ తెలిసిందే కదా… ఏదైనా సరే, రచ్చ చేయడమే..! తను ప్రేమించే పెట్ బాగుండాలని కోరుకుంటే అందులో దేవతల మీద విశ్వాసమే కదా కనిపించేది..!  గుళ్ల దగ్గర కోతుల్ని ఎవరూ కొట్టరు… గానుగాపూర్ వెళ్లండి… ఆవులు, కుక్కలు ఆ పరిసరాల్లో స్వేచ్ఛగా తిరుగుతాయి, ఎవరూ కొట్టరు…

కుక్కలయితే గుడి లోపలకు కూడా వస్తుంటాయి… దత్తాత్రేయుడి అనుచరగణంగానే వాటినీ భావిస్తారు భక్తులు… తప్పు కాదు… ఆవులకు అరటి పండ్లు తినిపిస్తుంటారు కూడా అక్కడే… అసలు జంతురూపాల్ని కూడా పూజించేది హిందూ ఆధ్యాత్మిక ధర్మం… దశావతారాల్లో మత్స్యం, వరాహం, సింహం తదితర కొన్ని అవతారాలతోపాటు గరుత్మంతుడు, హనుమంతుడు, గణేషుడు తదితర దేవుళ్లు కూడా మన దేవుళ్లే కదా…

ఎటొచ్చీ విశేషం ఏమిటంటే..? లక్షల కోళ్లు, మేకలు, పందుల బలి, నైవేద్యం జరిగే చోట ఓ పెంపుడు శునకం బాపతు బంగారం మొక్కు చెల్లించబడటమే ఆ విశేషం...!! అవునూ, ఓ డౌట్... కుక్కను ప్రేమించే ఈమె అందరిలాగే ఓ కోడిని కోసి, పొతం చేసి నైవేద్యం ఇచ్చి ఉంటుందా..?!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 25 లక్షల లైకుల వైరల్ ఇన్‌స్టా పోస్ట్… ఇంతకీ ఏముందీ ఇందులో..?
  • బయట హరీష్ ప్రచారం వేరు… సిట్ అసలు విచారణ నిజాలు వేరు…
  • పెళ్లికాని ప్రసాదులు..!! నిజానికి సీరియస్ వార్తే… రాబోయే సంక్షోభాల సూచన..!!
  • లక్షల మిర్చి బజ్జీలు… వేల భక్ష్యాలు… కర్నాటక జాతరల స్పెషాలిటీ…
  • జోలా జోలమ్మ జోలా… ఈ సినిమాకు ‘సూత్రధారులు’ ఎవరయ్యా అంటే…
  • థాంక్స్ రెహమాన్… నీ అభిమానుల కళ్లు కూడా తెరిపించావు…
  • అబుదాబి ఆయిల్ క్షేత్రాల్లో… ఇండియా సొంత ఉత్పత్తి… శుభసంకేతం…
  • దంపతులకు జాయింట్ టాక్స్ … మధ్యతరగతికి ‘బడ్జెట్’ వరం..?
  • 2 గంటల పర్యటనకు ఓ విశిష్ట అతిథి..! మోడీ స్వీయ స్వాగతం వెనుక..?!
  • సాక్షి…! భర్త విలన్… భార్య షీరో… అప్పట్లో ఓ క్రైమ్ థ్రిల్లర్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions