Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

SIB … అరాచకాల అడ్డాగా మారిన ఆ పాలన నుంచి… మళ్లీ గాడిన పడి…

January 22, 2026 by M S R

.

ప్రభుత్వం మారితే… కొన్ని కీలక వ్యవస్థల స్వరూపాలు మారతాయి..! కొన్నిసార్లు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లేదా ప్రభుత్వ పెద్దల విజన్ లోపం వల్ల ఆ వ్యవస్థల ఉద్దేశాలే మారిపోయి, స్థూలంగా ఆ వ్యవస్థల లక్ష్యాలు, ఫలితాలు పక్కదారి పట్టి అరాచకం తలెత్తుతుంది… అది పతనావస్థ…

ఎస్.., మనం పోలీసు యంత్రాంగంలోని ఎస్ఐబీ అనే కీలక వ్యవస్థ గురించి చెప్పుకుంటున్నాం… చెప్పుకోవాలి కూడా… ఎందుకంటే..? ఇప్పుడు ఎస్ఐబీ వ్యవస్థలో రాచపుండుగా మారిన ఫోన్ ట్యాపింగ్ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది… కేసులు, విచారణలు, రాజకీయ కంపనలు… తవ్వేకొద్దీ బోలెడు బాగోతాలు… అదొక అరాచకం… ఇంకాస్త వివరాల్లోకి వెళ్దాం…

Ads

పాలనతో సంబంధం ఉన్నవాళ్లకు తెలిసిన ఎస్ఐబీ విధి ఏమిటి..? ఉగ్రవాదులు, తీవ్రవాదుల ఉనికిని ట్రాక్ చేయడం… లొంగుబాట్లు లేదంటే వేట… కోవర్టులు, ఇన్‌ఫార్మర్లు… అసాంఘిక శక్తుల సమాచార సేకరణ, వాటి ఆట కట్టించే ప్రణాళికలు, ప్రయత్నాలు… ఏ ప్రభుత్వానికైనా ఇది ఓ రహస్య ఆయుధం… బయటికి కనిపించని మూడో నేత్రం…

telangana police

  • స్వరాష్ట్రం వచ్చింది… సొంత పాలన వచ్చింది… తరువాత ఏం జరిగింది..? ప్రభాకర్‌రావు వంటి ఖాకీల చేతుల్లో పడింది ఈ వ్యవస్థ… పాలకులు కూడా దేనికి వాడుకున్నారు..? పొలిటికల్ ట్రాప్‌లు… వజ్రాలు, బంగారం వ్యాపారాలు చేసే వ్యక్తుల చేజింగులు… బ్లాక్ మెయిళ్లు… చివరకు పాలకుడి సొంత కుటుంబంలో రాజకీయ కుట్రలకు కూడా అడ్డాగా మారింది ఎస్ఐబీ…

సినిమా తారల ఫోన్లే కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ధనిక వర్గాలు టార్గెట్… ఫోన్ ట్యాపింగ్, బ్లాక్ మెయిల్, డబ్బు… ఇంకా నానా దరిద్రాలు కూడా..! జర్నలిస్టులు, పొలిటిషియన్స్, మేధావులే కాదు, కీలక వ్యవస్థల్లో పనిచేసే ప్రతి ఒక్కరినీ ట్రాక్ చేశారు, ఫోన్లు ట్యాప్ చేశారు… ఆ పాలనలో ప్రైవసీ ఓ బ్రహ్మపదార్థం… అరాచకం ఓ నిష్ఠుర సత్యం…

సీన్ కట్ చేయండి… రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది… ఎస్ఐబీ అరాచకాలకు అడ్డుకట్ట వేసి, ఆ దరిద్రపు ఫోన్ ట్యాపింగ్ గ్యాంగును విచారణలు, దర్యాప్తుల బోనులో నిలబెడుతోంది… జవాబులు చెప్పుకోలేక నాటి పాలక పెద్దలు కిందామీదా పడుతున్నారు… ఎస్ఐబీ పనితీరును మళ్లీ గాడిన పడేసే లక్ష్యంతో, దాని పగ్గాల్ని ఓ మహిళా అధికారికి అప్పగించింది…

బి.సుమతి ఐపీఎస్

బి.సుమతి… ఈ ఆఫీసర్ గురించీ ఓసారి చెప్పుకోవాలి… మెదక్ ఎస్పీ నుంచి వుమెన్ సేఫ్టీ డీఐజీ దాకా… కఠిన సవాళ్ల బాధ్యతల్లో పనిచేసిన ఆమెకు ఇప్పుడు… ఈ ఎస్ఐబీ ప్రక్షాళన, ఆ వ్యవస్థ ఉద్దేశాలకు అనుగుణంగా పనితీరును చక్కదిద్దడం అనే మరో కఠిన బాధ్యత… రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్‌గా చాన్నాళ్లు పనిచేసిన శివధర్ రెడ్డి రాష్ట్ర డీజీపీ కావడం కూడా ఆమెకు సానుకూలత తెచ్చిపెట్టింది…

  • మరోవైపు మార్చి ఆఖరుకల్లా మావోయిస్టు పోరాటానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కేంద్రం డెడ్‌లైన్ పెట్టింది… అమిత్ షా ఓ హుకుం జారీచేశాడు… ఇక మొదలైంది మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఏపీ, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరుగు… ఉక్కుపాదం స్టార్టయింది… మావోయిస్టుల దుర్బేధ్యమైన అడ్డాల్లోకి కూడా బలగాలు జొరబడి కీలక నక్సల్ నేతలను హతమారుస్తున్న నేపథ్యంలో… మరోవైపు మావోయిస్టు పార్టీలోనే సైద్ధాంతిక సంక్షోభం తలెత్తింది… లొంగుబాట పట్టింది…

guns deva

ఇతర రాష్ట్రాలు వేరు, తెలంగాణ స్థితి వేరు… ఆయా రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు… అంటే, కేంద్రం- రాష్ట్రంలో సేమ్ పార్టీ పాలన… కానీ తెలంగాణలో పవర్‌లో ఉన్న పార్టీ వేరు, కేంద్రంలో పార్టీ వేరు… కేంద్రంలో పూర్తి రైట్ వింగ్… రాష్ట్రంలో లిబరల్, సెక్యులర్… సో, ఎస్ఐబీ ఈ పరస్పర విరుద్ధ రాజకీయ ధోరణుల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ… ఏపీలాగా ఎన్‌కౌంటర్ల బాట గాకుండా లొంగుబాట్ల మీద కాన్సంట్రేట్ చేయడం… అన్నింటికీ మించి లొంగిపోవాలనుకునే నక్సలైట్లకు తమ రక్షణ మీద నమ్మకం కలిగించడం… ఇదీ అసలు టాస్క్…

dgp

  • ఎస్ఐబీ గాడిన పడింది… అజ్ఞాతం వీడిన వాళ్లకు సరైన పునరావాసం, లొంగిపోయేవాళ్లకు రక్షణ కారణంగా 2025లోనే ఏకంగా 576 మంది లొంగిపోయారు… చిన్న సంఖ్యేమీ కాదు… మావోయిస్టు పోరాట చరిత్రలో గుర్తుంచుకోదగిన సంవత్సరం అది… నిన్న తెలంగాణ పోలీసులు విడుదల చేసిన ఓ ప్రకటన ఇంట్రస్టింగు… పోరాటంలో కొనసాగుతున్న, తెలంగాణకు చెందిన కీలక నక్సల్ నేతల వివరాలతో… మీ ప్రాణాలకు మా భరోసా, మెయిన్ స్ట్రీమ్‌లో కలిసిపొండి అని పిలుపు… ఆ నేతల వివరాలు, ఫోటోలతో సహా…

dgp

లొంగిపోయే నక్సలైట్లను గాలికి వదిలేసి, మీ బతుకులు మీరు బతకండి అని వదిలేయకుండా… తెలంగాణ ఎస్ఐబీ ఉదాత్తమైన మానవీయ కోణాన్ని చూపిస్తోంది… ఇది సరైన పునరావాసం… వాళ్లకు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, నివాస ధ్రువీకరణలు, బ్యాంకు ఖాతాలకు సహకరిస్తోంది… రివార్డు సొమ్మును అవే ఖాతాల్లో వేస్తున్నారు… ఈ పనులన్నీ ఎస్ఐబీ నేరుగా పర్యవేక్షిస్తోంది… ఇళ్ల స్థలాల కేటాయింపులు, కార్పొరేట్ హాస్పిటళ్లలో అనారోగ్య నక్సలైట్లకు చికిత్సలు… కనిపిస్తే కాల్చివేత రోజుల నుంచి ఈ కారుణ్య ధోరణి దాకా ఎంత మార్పు..? సీన్ మొత్తం మారిపోయింది…

అవును, ఆ ఫోన్ ట్యాపింగ్ అరాచక, నీచ, దరిద్ర, బ్లాక్ మెయిల్, కుట్రల రోజుల్ని దాటేసి... ఎస్ఐబీ పనితీరు కూడా మారింది... గాడిన పడింది..! రెండేళ్లలో ఎంత కంట్రాస్టో కదా... అదీ ఇక్కడ చెప్పదలిచింది..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘ఒరేయ్.., మీరెందుకురా ఆ మొగుళ్ల హత్య కేసుల్లో ఇరుక్కుంటారు..?’’
  • SIB … అరాచకాల అడ్డాగా మారిన ఆ పాలన నుంచి… మళ్లీ గాడిన పడి…
  • చాగోస్ దీవులు..! హిందూ మహాసముద్రంలో అగ్రదేశాల ఆట..!!
  • చైన్లు కాదు గానీ… అప్పట్లో మా కొట్లాటల్లో సోడా బుడ్లు పగిలేవి బాగా…
  • సరిగ్గా 30 ఏళ్లు… తెలుగు శాటిలైట్ చానెళ్ల తొలి రోజుల బాలారిష్టాలు…
  • 25 లక్షల లైకుల వైరల్ ఇన్‌స్టా పోస్ట్… ఇంతకీ ఏముందీ ఇందులో..?
  • బయట హరీష్ ప్రచారం వేరు… సిట్ అసలు విచారణ నిజాలు వేరు…
  • పెళ్లికాని ప్రసాదులు..!! నిజానికి సీరియస్ వార్తే… రాబోయే సంక్షోభాల సూచన..!!
  • లక్షల మిర్చి బజ్జీలు… వేల భక్ష్యాలు… కర్నాటక జాతరల స్పెషాలిటీ…
  • జోలా జోలమ్మ జోలా… ఈ సినిమాకు ‘సూత్రధారులు’ ఎవరయ్యా అంటే…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions