Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘వందల వీథి కుక్కల్ని చంపేసే ఊళ్లకు తెలుసు… ఆ సమస్య తీవ్రత…’’

January 23, 2026 by M S R

.

భూత దయ, జీవ కారుణ్యం, జంతు ప్రేమ… ఈ పదాలు ఇప్పుడు వార్తల్లో చర్చనీయాంశాలయ్యాయి… ఎందుకు..? వీథి కుక్కల సమస్యపై సుప్రీం కోర్టు తీసుకున్న కఠిన వైఖరి కారణంగా…

కుక్క కాట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం, చిన్న పిల్లలపై కుక్కల దాడులు, కొన్ని మరణాలు కూడా… దాంతో సుప్రీం కోర్టు సీరియస్‌గా తీసుకుంది… షెల్టర్లకు తరలించాలనే తీర్పుపైనా హైఫై సమాజంలో భిన్నాభిప్రాయాలు…

Ads

ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ ఎపిసోడ్… భూత దయకు పేటెంట్ తీసుకున్నట్టు మాట్లాడే మనేకా గాంధీ సుప్రీం కోర్టు వైఖరి మీద చేసిన వ్యాఖ్యలపై కోర్టు ఆగ్రహం… ఆమె బాడీ లాంగ్వేజ్, భాషల మీద కోర్టు ధిక్కారం పెట్టాలనుకున్నాం కానీ, వదిలేస్తున్నాం అంది కోర్టు…

హైదరాబాదులో నటి రేణు దేశాయ్ ప్రెస్ మీట్… ఏదేదో అరిచింది… మగాళ్లు కారా, మీకు మగతనం లేదా… దోమలు కుడితే వ్యాధులు రావడం లేదా వంటి వ్యాఖ్యలూ సందర్భరహితంగా వదిలింది… ఓ సీనియర్ సోషల్ మీడియా యాక్టివిస్టుపై నోరు పారేసుకుంది… ఆమె భాష, ఆమె బాడీ లాంగ్వేజ్… అంతా అయోమయం, గందరగోళం… పెడితే జైలులో పెట్టుకొండి నన్ను అంటోంది.., నా పర్సనల్ లైఫ్ మీద ట్రోలింగ్ సాగుతోంది అంటోంది…

renu

మళ్లీ వరుసగా వీడియోలు పెడుతోంది… నాకెవరూ తోడు లేరు అంటుంది ఓసారి, కల్కి సినిమా తెలుసుగా అలాగైపోతారు అని శాపనార్థాలు పెడుతోంది… ఆమెకు నిజంగా ఏదో అయింది… ఓ కొత్త రేణు దేశాయ్ కనిపిస్తోంది… ఆమెను చూసి యాంకర్ రష్మికి కూడా ఏదో అయింది… కొత్తిమీరలో ప్రాణం, పాలు- జున్ను దాకా ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్థం కావడం లేదు… (అమ్మలూ, మీకు తెలిసిన హిందీయో, ఇంగ్లిషో మాట్లాడండి, తెలుగును ఖూనీ చేయకండి…)

థాంక్ గాడ్… వీథి కుక్కలు అనగానే గుర్తొచ్చే అమలమ్మ ఇంకా రంగంలోకి రాలేదు… సరే, ఇవిలా నడుస్తూనే ఉన్నాయి కదా… నిన్నటి ఓ వార్త ఇది… హైదరాబాదులోనే ఓచోట పిల్లాడిపై కుక్క దాడి, గాయాలు… సమయానికి ఎవరో వచ్చేసరికి కుక్క వెళ్లిపోయింది గానీ లేకపోతే పిల్లాడి ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండేది…

dogs

వీథి కుక్కలపై ప్రేమ చూపించే వాళ్ల కోసం… ఆఫ్టరాల్ కొన్ని కుక్కలు దాడులు చేస్తుంటే అన్ని కుక్కల్నీ చంపేయాలి, షెల్టర్లలో వేయాలా అని వాదించే వాళ్ల కోసం… కొన్ని నిజాలు ఇవిగో… ఇవి ప్రభుత్వం చెప్పిన లెక్కలే… (ఓ వెబ్ పత్రికలో కనిపించింది…)

dogs

ఇవి ప్రభుత్వ హాస్పిటళ్ల లెక్కలు… ప్రైవేటు హాస్పిటళ్లవీ కలిపితే ఇంకెన్నో… నిజంగానే పరిస్థితి భీకరంగానే ఉంది… నిష్ఠురంగా ఉన్నా ఇంకొన్ని నిజాలు కూడా చెప్పుకోవాలి…

ఈమధ్య కొన్ని తెలంగాణ పల్లెల్లో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కొన్ని వందల వీథి కుక్కల్ని చంపించేశారు… కేసుల పాలవుతామని తెలిసీ చంపిస్తున్నారంటే ఆయా ఊళ్లల్లో సమస్య ఎంత తీవ్రంగా ఉందో, ప్రజలు ఎంత భయాందోళనల్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు…

మరోవైపు ఓ మంత్రి కుక్కల్ని చంపితే కేసులు పెడతాం అంటోంది… కేసులు పెట్టి, చంపిన కుక్కల శవాల్ని బయటికి తీసి, పోస్ట్ మార్టం చేయిస్తున్నారు… కానీ ఈ సమస్య నివారణకు ఏం చేయాలనేది మాత్రం ప్రభుత్వం పట్టించుకోదు, ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు… పసివాళ్ల ప్రాణాలకు గండం… మరేం చేయాలి సర్పంచులు..? పట్టుకుని స్టెరిలైజ్ చేసి వదిలేయాలట… పోనీ, ఈ కార్యక్రమాన్నైనా పకడ్బందీగా చేసే ప్రభుత్వ కార్యాచరణ ఏది..? దానిపై దృష్టి ఏది..?

dogs

నిజమే, చాలామంది చెబుతున్నట్టు… బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు వేయించుకునే బాధితుడికి తెలుసు బాధ ఏమిటో… ఏసీ కార్లలో భద్రంగా తిరిగే జీవకారుణ్యవాదులకు ఎలా అర్థమవుతుంది…? ఐదేళ్లలో ఒక్క రాష్ట్రంలో 36 లక్షల రేబిస్ వేక్సిన్లు అంటే… ఇది సమస్య తీవ్రత కాదా..?

మరింత కటువుగా ఉన్న నిజం ఏమిటంటే… రోజూ ఆహారం కోసం ఎన్ని కోట్ల జీవుల్ని చంపేయడం లేదు..? దేవుళ్లకు బలి కూడా ఇవ్వడం లేదా..? ఈ జీవ కారుణ్యవాదుల్ని తీసుకెళ్లి, ఒక్కసారి అల్ కబీర్ జంతు మాంస ఉత్పత్తి ఫ్యాక్టరీలో లోపల ప్రక్రియ తీరు చూపించాలి…

జీవ కారుణ్యం మాటలు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది...! లేదా, తమ దాకా వస్తే గానీ అర్థం కాదు..! చాలామంది కలుక్కుమనవచ్చుగాక... కానీ రియాలిటీ మాత్రం ఇదే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ భూమితో సంబంధం లేకుండా మనిషి బతకగలడా..? ఓ ప్రయోగనగరం..!!
  • కాంతారావు డెస్టినీ మార్చేసిన సినిమా… ‘స్వాతి చినుకులు’ ముంచేశాయి…
  • ‘‘వందల వీథి కుక్కల్ని చంపేసే ఊళ్లకు తెలుసు… ఆ సమస్య తీవ్రత…’’
  • రెహమాన్ ఆస్కార్ దొంగ..! రియల్ విన్నర్ సుఖ్వీందర్ సింగ్..! ఎలాగంటే..?!
  • అసలైన విజేత శర్వానంద్… పరాజితుడు రవితేజ… ఎందుకనగా..?
  • చిరంజీవికి సీఎం అమిత ప్రాధాన్యం… ఎవరికీ అంతుపట్టని ఓ మిస్టరీ…
  • ‘‘ఒరేయ్.., మీరెందుకురా ఆ మొగుళ్ల హత్య కేసుల్లో ఇరుక్కుంటారు..?’’
  • SIB … అరాచకాల అడ్డాగా మారిన ఆ పాలన నుంచి… మళ్లీ గాడిన పడి…
  • చాగోస్ దీవులు..! హిందూ మహాసముద్రంలో అగ్రదేశాల ఆట..!!
  • చైన్లు కాదు గానీ… అప్పట్లో మా కొట్లాటల్లో సోడా బుడ్లు పగిలేవి బాగా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions