.
Pardha Saradhi Upadrasta…. $1 బిలియన్ ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ప్రతిపాదనతో పుతిన్ వ్యూహాత్మక చెస్ గేమ్… డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన Board of Peace కోసం, రష్యాకు చెందిన ఫ్రోజెన్ ఆస్తుల నుంచే $1 బిలియన్ ఇవ్వడానికి వ్లాదిమిర్ పుతిన్ ముందుకొచ్చాడు… ఇది కేవలం ఆర్థిక ప్రతిపాదన కాదు — ఇది హార్డ్ జియోపాలిటిక్స్ + లీగల్ ప్రెజర్ + డిప్లమాటిక్ చెస్ కలిసిన వ్యూహం…
1️⃣ నేపథ్యం: Board of Peace అంటే ఏమిటి?
డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన Board of Peace…: మధ్యప్రాచ్య యుద్ధాలు, ప్రత్యేకంగా పాలస్తీనా–ఇజ్రాయెల్ వివాదంపై గ్లోబల్ పవర్స్ నేరుగా చర్చల్లో పాల్గొనే ఒక వేదిక… ఇది అమెరికా ఆధ్వర్యములో వివిధ దేశాలు సభ్యులుగా ప్రతిపాదించబడిన సంస్థ.
ఐక్యరాజ్యసమితికి ప్రత్యామ్నాయం కాదు, కానీ ఐక్యరాజ్యసమితి నెమ్మదితనానికి బయట పనిచేసే మెకానిజం. అమెరికా నాయకత్వంలోనే ఉంటుంది. కానీ అంతర్జాతీయ అంగీకారం లేకపోతే విలువ ఉండదు
ఇక్కడే పుతిన్ ఎంట్రీ.
Ads
2️⃣ పుతిన్ ఎందుకు వెంటనే “Yes” అనలేదు?
పుతిన్ మాటల్లో కనిపించే కీలక లైన్…: “Strategic partners consultations are required.”
దీని అర్థం: రష్యా ఒంటరిగా అమెరికా లైన్‌లోకి రాదు. చైనా, ఇరాన్, భారత్, అరబ్ ప్రపంచంతో సమన్వయం తప్పనిసరి
“Russians never leave their own behind” → మల్టీపోలార్ బ్లాక్‌ను త్యజించరు.
ఇది ట్రంప్‌కు ఒక మెసేజ్: “మాతో పని చేయాలంటే, మా షరతులు కూడా వినాలి.”
3️⃣ అసలు గేమ్: ఫ్రోజెన్ రష్యన్ ఆస్తులు
ఎంత పెద్ద విషయం ఇది?
ఉక్రెయిన్ యుద్ధ నేపధ్యంలో అమెరికా & యూరప్‌లో వందల బిలియన్ల డాలర్ల రష్యన్ ఆస్తులు ఫ్రోజెన్. ఇప్పటివరకు అవి “డెడ్ మనీ”. వీటిమీద బోలెడన్ని కోర్టు కేసులు నడుస్తున్నాయి.
పుతిన్ చేసిన ట్రిక్:
“ఆ ఫ్రోజెన్ ఆస్తుల నుంచే $1 బిలియన్ ఇస్తాం”.
దీని వల్ల..: ఆస్తులు డెడ్ కాదు, నెగోషియేషన్ కరెన్సీ అయ్యాయి అమెరికా అన్‌ఫ్రీజ్ చేయకుండా ట్రాన్స్‌ఫర్ అసాధ్యం
లీగల్ & పాలిటికల్ ప్రెజర్
పుతిన్ స్పష్టంగా చెప్పిన మాట:
“This was done under the previous US administration.”
అర్థం…:
బైడెన్ → గ్లోబలిస్ట్ పాలసీ
ట్రంప్ → “America First”
ఇప్పుడు ట్రంప్ నిజంగా మార్పు తెస్తాడా? అనేది లిట్మస్ టెస్ట్
ఒకసారి $1 బిలియన్ అన్‌ఫ్రీజ్ అయితే మిగిలిన ఆస్తులపై కూడా ప్రీసిడెంట్ సెట్ అవుతుంది. ఇది రష్యాకు భారీ స్ట్రాటజిక్ విన్. ఎలాగో ఆ డబ్బులు రష్యా ఇప్పుడు వాడటం లేదు, ఆ శాంతి ఒప్పందం పనికొస్తుందా లేదా వదిలేస్తే ముందు డబ్బులు బయటకు వస్తాయి.
4️⃣ Board of Peace లో రష్యా పాత్ర ఎందుకు కీలకం?
రష్యా లేకుండా ఈ బోర్డ్ మరో “వైట్ హౌస్ ప్రాజెక్ట్”గా మిగిలిపోతుంది.
రష్యా చేరితే ఇది గ్లోబల్ ఇనిషియేటివ్గా మారుతుంది. అమెరికా– రష్యా డైరెక్ట్ డైలాగ్ పునఃప్రారంభం అవుతుంది. చైనా కూడా పక్కనుండి ప్రభావితం అవుతుంది. అమెరికా భారత్ ను కూడా పిలిచింది. భారత్ ఇంకా సమాధానం చెప్పలేదు. రష్యా చేరటం ద్వారా చైనా, భారత్ లు కూడా కొంత కంఫర్ట్ ఫీల్ అవుతాయి. ట్రంప్‌కు కూడా ఇది అవసరం
అందుకే పుతిన్ షరతులతో ముందుకు వస్తున్నాడు.
5️⃣ మధ్యప్రాచ్యం: ఎందుకు పాలస్తీనా కార్డ్?
రష్యా స్టాండ్ క్లియర్…: ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఉన్నాయి కానీ పాలస్తీనా హక్కులను వదలదు
పుతిన్ చెప్పిన నాలుగు కీలక పాయింట్లు.
– దీర్ఘకాలిక పరిష్కారం మాత్రమే — షార్ట్‌కట్ లేదు
– ఐక్యరాజ్యసమితి రిజల్యూషన్ల ఆధారం తప్పనిసరి. మీరు మీ ఇష్టమొచ్చినట్లు చేస్తే ఒప్పుకోను.
– పాలస్తీనా ప్రజల హక్కులు కేంద్రంగా ఉండాలి.
– గాజా పునర్నిర్మాణం — హెల్త్, వాటర్, ఫుడ్ సెక్యూరిటీ. దీని వల్ల అరబ్ ప్రపంచంలో రష్యా బ్లాక్ ఇమేజ్ బలపడుతుంది. అమెరికా “ప్రో-ఇజ్రాయెల్ ఒన్లీ” అన్న ముద్రను బ్యాలెన్స్ చేస్తుంది. మిగతా దేశాలు కూడా కొంత కంఫర్ట్ ఫీల్ అవుతాయి.
6️⃣ ట్రంప్‌కు ఇది ట్రాప్ లేదా ఛాన్స్?
✔️ అన్‌ఫ్రీజ్ చేస్తే ట్రంప్ “డీప్ స్టేట్”ని ఛాలెంజ్ చేసినట్లే. రష్యా సహకారం లభిస్తుంది. మధ్యప్రాచ్యంలో క్రెడిట్ ట్రంప్ ఖాతాలో పడుతుంది.
❌ అన్‌ఫ్రీజ్ చేయకపోతే Board of Peace ఖాళీ బోర్డ్ అవుతుంది. ట్రంప్ మాటలకు, చర్యలకు మధ్య గ్యాప్ బయటపడుతుంది
అందుకే పుతిన్ ప్రశాంతంగా చెబుతున్నాడు: “బాల్ మీ కోర్టులోనే ఉంది.”
తుది విశ్లేషణ
🔹 ఇది డొనేషన్ కాదు
🔹 ఇది దయ కాదు
🔹 ఇది యుద్ధం లేకుండా ఆడే పవర్ గేమ్
ఫ్రోజెన్ ఆస్తులు → ఆయుధాలు
శాంతి మాటలు → స్ట్రాటజిక్ ప్రెజర్
$1 బిలియన్ → గ్లోబల్ చెస్‌లో కింగ్ మూవ్
ఇది పుతిన్ స్టైల్ జియోపాలిటిక్స్…… — ఉపద్రష్ట పార్ధసారధి
#PardhaTalks #Putin #Russia #BoardOfPeace #Geopolitics #MiddleEast #Palestine #Israel #Trump #FrozenAssets #WorldPolitics
Share this Article