.
రామేశ్వరం, జనవరి 25 …. నిన్న ఆకర్షించిన వార్తల్లో ఒకటి… పాత పాంబన్ రైల్వే వంతెనను డిస్‌మాంటిల్ చేస్తున్నారనే వార్త… అందరికీ ఎన్నో దశాబ్దాలుగా ఆకర్షిస్తున్న వంతెనను అలాగే ఓ మాన్యుమెంట్‌లా ఉంచవచ్చు కదా, ఎందుకు నిర్మూలించాలనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి… కానీ..?
ఆల్రెడీ వందేళ్ల ఆయుష్షు పూర్తి చేసుకుంది… దీన్ని పూర్తిగా తొలగించాలని (Dismantle) రైల్వే శాఖ నిర్ణయించడానికి ప్రధాన కారణాలు ఇవే…
Ads
1. తుప్పు పట్టడం మరియు భద్రత (Corrosion & Safety)
ఈ వంతెన సముద్రంపై ఉండటం వల్ల ఉప్పు గాలికి ఇనుప నిర్మాణం బాగా తుప్పు పట్టిపోయింది… 2022 డిసెంబర్‌లో పాత వంతెనపై సెన్సార్లు ప్రమాద హెచ్చరికలు జారీ చేయడంతో, భద్రతా కారణాల దృష్ట్యా రైళ్ల రాకపోకలను శాశ్వతంగా నిలిపివేశారు…. దీని కాలపరిమితి కూడా ముగిసిపోవడంతో ఇది ఇక రైళ్ల బరువును మోయలేదని నిపుణులు తేల్చారు….
2. వర్టికల్ లిఫ్ట్ టెక్నాలజీ (New Vertical Lift Technology)
పాత వంతెనలో ఓడలు వెళ్లడానికి ‘షెర్జర్ రోలింగ్ లిఫ్ట్’ (Scherzer span) అనే పద్ధతి ఉండేది… ఇది కత్తెరలా రెండు వైపులా విడిపోయి పైకి లేచేది… కానీ కొత్త వంతెనలో ‘వర్టికల్ లిఫ్ట్’ సిస్టమ్ ఉపయోగిస్తున్నారు… ఇందులో వంతెన మధ్య భాగం మొత్తం ఒకేసారి సమాంతరంగా పైకి లేస్తుంది… పాతది పక్కనే ఉండటం వల్ల కొత్త సిస్టమ్ పనితీరుకు లేదా ఓడల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పాతదాన్ని తొలగిస్తున్నారు….
3. పాత వంతెనలోని భాగాలు ఏం చేస్తారు?
-
చారిత్రక చిహ్నం…: పాత వంతెనలోని అత్యంత కీలకమైన ‘లిఫ్ట్ స్పన్’ (Scherzer span) భాగాన్ని ఒక స్మారక చిహ్నంగా (Memorial/Museum piece) సముద్ర తీరంలో ప్రదర్శనకు ఉంచాలని యోచిస్తున్నారు…
-
స్తంభాల తొలగింపు…: సముద్రం లోపల ఉన్న పాత స్తంభాలను కూడా తొలగిస్తారు, తద్వారా కొత్త వంతెన గుండా వెళ్లే పెద్ద ఓడలకు ఎటువంటి ఆటంకం ఉండదు….
మరి పక్కనే ఓ రోడ్ బ్రిడ్జి ఉంది కదా... దానికి ఈ లిఫ్టులు, దారి వదలడాలు ఏమీ లేవు కదా... మరి రైల్వే బ్రిడ్జికి మాత్రమే ఎందుకు ఈ ఏర్పాటు..? ఇదీ ప్రశ్న...
పాత పాంబన్ రైల్వే వంతెన (Pamban Rail Bridge), పక్కనే ఉన్న రోడ్డు వంతెన (Annai Indira Gandhi Road Bridge) రెండింటి మధ్య ఉన్న కీలకమైన తేడా వాటి ఎత్తు (Height)…. రోడ్డు వంతెన ద్వారా నౌకల రాకపోకలు ఎలా సాధ్యమవుతాయంటే…
1. ఎత్తులో తేడా (Height Clearance)
రైల్వే వంతెన సముద్ర మట్టానికి చాలా తక్కువ ఎత్తులో ఉంటుంది… పెద్ద ఓడలు వెళ్లడానికి అది అడ్డుగా ఉంటుంది కాబట్టి, దానిని పైకి ఎత్తడానికి (Scherzer span లేదా కొత్త వర్టికల్ లిఫ్ట్) వీలుగా నిర్మించారు… కానీ, రోడ్డు వంతెనను చాప ఆకారంలో (Arc/Cantaliver shape) సముద్ర మట్టానికి చాలా ఎత్తులో నిర్మించారు…
2. షిప్ ఛానల్ (Ship Channel)
సముద్రం మధ్యలో నౌకలు ప్రయాణించే లోతైన భాగం (Navigational Channel) వద్ద రోడ్డు వంతెన ఎత్తు గరిష్టంగా ఉంటుంది. చిన్నవి , మధ్యస్థ స్థాయి నౌకలు ఎటువంటి లిఫ్టింగ్ అవసరం లేకుండానే ఈ రోడ్డు వంతెన కింద నుండి సులభంగా వెళ్ళిపోగలవు…
3. కొత్త రైల్వే వంతెన ప్రత్యేకత
కొత్త రైల్వే వంతెన పాతదాని కంటే కొంచెం ఎత్తులో ఉన్నప్పటికీ, అది రైలు పట్టాల కోసం కాబట్టి పూర్తిగా ఎత్తుగా కట్టలేరు (రైలు ఎక్కడానికి వీలుగా గ్రేడియంట్ ఉండాలి)… అందుకే దీనికి వర్టికల్ లిఫ్ట్ (Vertical Lift) టెక్నాలజీని వాడారు…. ఓడ వచ్చినప్పుడు వంతెన మధ్య భాగం సమాంతరంగా పైకి లేస్తుంది….
కొత్త వంతెన గురించి కొన్ని విశేషాలు:
-
ఇది భారతదేశపు మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే వంతెన…
-
పాత వంతెనతో పోలిస్తే ఇది మరింత వేగంగా, ఆటోమేటిక్ సెన్సార్ల సహాయంతో పైకి లేస్తుంది…
-
దీనివల్ల రామేశ్వరం వెళ్లే భక్తులకు, పర్యాటకులకు మరింత సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది… వెరసి పాత ప్రసిద్ధ వంతెన కాలగతిలో మాయమైపోనుంది..!!
Share this Article