Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చంటి బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ కంట్రోల్… అందరూ తప్పులో కాలేశారా..?!

January 25, 2026 by M S R

.

అమరావతి, జనవరి 25… నిజానికి ఏపీ హోమ్ మంత్రి స్పందన అభినందనీయమే…. ఓ చంటి బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ కంట్రోల్ చేసిన జయశాంతి అనే కానిస్టేబుల్ వీడియో, ఫోటో చూసి, ఆమెను ఇంటికి పిలిచి భోజనం పెట్టి, సారె కూడా పెట్టింది… గుడ్… కానీ..?

ఒక హోమ్ మంత్రి వద్దకు ఓ కానిస్టేబుల్‌ను తీసుకొచ్చే ముందు ఆమె గత ట్రాక్ రికార్డు ఏమిటో పోలీసు ఉన్నతాధికారులు కాస్తయినా ఆరా తీయాలి కదా… అసలు ఆ చంటిబిడ్డతో ట్రాఫిక్ కంట్రోల్ అనేది కరెక్టేనా..? ఫేకా అనేదీ తెలుసుకోవాలి కదా…

Ads

బహుశా ఏపీ ప్రజలకు ఈ వివాదంపై సోషల్ మీడియా కథనాలతో ఎంతో కొంత అవగాహన వచ్చి ఉండవచ్చు కానీ హైదరాబాద్, తెలంగాణ ప్రజలకు ఈ వివాదం పెద్దగా తెలియదు… నిన్న వాట్సప్ న్యూస్ గ్రూపుల్లో వచ్చిన సమాచారం మేరకు… ఈ కథ ఏమిటంటే..?

police

రంగంపేట మహిళా కానిస్టేబుల్ జయశాంతి ఓ  చంటి బిడ్డను ఎత్తుకుని… ట్రాఫిక్‌ క్లియర్‌ చేసిన ఓ వీడియో బయటకు వచ్చి వైరల్‌గా మారిపోయింది… మూడు రోజులైంది కావచ్చు… ఇక ఆమెకు మద్దతుగా ఎంతోమంది పోస్టులు పెట్టారు… ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఆమెను అభినందించారు…. అంతేకాదు…. హోం మంత్రి అనిత ఆమెను ఇంటికి పిలిచి భోజనం పెట్టి, మరీ సన్మానించింది… కానీ, ఇప్పుడు అసలు కథ బయటకు వచ్చి దుమారం రేగుతోంది…

ఇప్పుడు బయటికి వస్తున్న సమాచారం ఏమిటంటే…

గత ఏడాది జరిగిన డీఎస్సీలో తప్పుడు సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందింది జయశాంతి… కానిస్టేబుల్ గా ఉన్న భర్త తాతారావు సంపాదన దాచి, తండ్రిని సంరక్షకుడిగా ప్రస్తావిస్తూ, ఈ డబ్ల్యూ ఎస్ సర్టిఫికెట్ పొందినట్లు నిర్ధారణ అయింది…

విచారణ చేసి డీఎస్సీ ఉద్యోగం రద్దు చేశారు విద్యాశాఖ అధికారులు… ప్రభుత్వాన్ని మోసం చేసిందని చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి ఎస్పీకి రిఫర్ చేశారు కాకినాడ డీఈవో…

ఇక, నకిలీ ఐడీ కార్డుతో ఎస్సై గా చలామణి అవుతున్న కామేశ్వరరావు అనే హెడ్ కానిస్టేబుల్ కి సహకారం అందించింది జయశాంతి.., చంటి బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేసి వార్తలలో నిలవడం కూడా ప్లాన్ ప్రకారం జరిగిందని సోషల్ మీడియాలో విమర్శలు…

క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి పల్నాడు ఎస్పీఎఫ్ కి జయశాంతి భర్త తాతారావు గతంలో బదిలీ అయ్యాడు… క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే రైల్వే నుంచి లా అండ్ ఆర్డర్ కు జయశాంతిని బదిలీ చేశారు…

భార్యాభర్తలపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా చర్యలు తీసుకోవడం, డీఎస్సీలో తప్పుడు ధృవీకరణ పత్రంతో ఉద్యోగం సంపాదించడంతో విమర్శలు రావడంతోనే… చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసినట్లు హడావుడి చేసిందని ఇప్పుడు విమర్శలు…

అసలు తన పరిధి కాకపోయినా చంటి బిడ్డను ఎత్తుకొని ట్రాఫిక్ క్లియర్ చేయడం ఏమిటి..? ఆ వీడియోను వైరల్ చేయడం ఏమిటి..? ఆమెను ఆ దంపతులను ఇంటికి ఆహ్వానించి హోమ్ మంత్రి అనిత సత్కరించడం ఏమిటి…?

ఆమె రాష్ట్రానికి హోమ్ మంత్రి... ఆమె వద్దకు జయశాంతిని తీసుకొచ్చేటప్పుడు కనీసం ఆమె పాస్ట్ ట్రాక్ రికార్డు తెలిసి, మంత్రి అనితను అలర్ట్ చేసి ఉండాలి కదానేది ప్రశ్న..! బాబు గారూ, ఎనీ ఐడియా..??

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చంటి బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ కంట్రోల్… అందరూ తప్పులో కాలేశారా..?!
  • IPS weds IAS … ఇదీ ఆదర్శ వివాహమే… సింపుల్‌గా రిజిష్ట్రార్ ఆఫీసులో…
  • రేవంత్‌కు అకారణ ప్రేమ ఉండొచ్చుగాక… హైకోర్టు వదలడం లేదు…
  • తెలుగు కంపోజర్ ఎంఎం కీరవాణికి అరుదైన గౌరవం + అవకాశం…
  • ఒత్తులు లేని తెలుగు దస్తూరీ… ఒరిజినాలిటీకే భంగకరం…
  • పక్కా డబుల్ స్టాండర్డ్స్…! ఫోన్ ట్యాపింగు అరాచకానికి విఫల సమర్థన..!!
  • ట్రంప్ స్వయంగా అమెరికా డాలర్‌కు చేస్తున్న ద్రోహం… ఇదీ కథ…
  • విచిత్ర సోదరులు..! సినిమా ప్రయోగాలకు 2 పేర్లు… సింగీతం, కమల్‌హాసన్..!!
  • చీకటిలో…! అక్కినేని శోభిత చుట్టూ ఓ మల్లెపూల కిల్లర్ కథ…!!
  • బోర్డర్-2…. ఆత్మ తక్కువ – అరుపులు ఎక్కువ… ఐనా హిట్టే… ఎందుకు..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions