Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రియుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు… ఇదీ అలాంటి స్టోరీయే…

January 25, 2026 by M S R

.

కామంతో పెట్రేగిపోయే భార్యలు…. భర్తలను, పిల్లలను ఎలా చంపేస్తున్నారో చదువుతున్నాం… రోజుకొక వార్త… మొగుళ్లు గడగడా వణికిపోతున్నారు… దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్…

క్రూర భార్యల ఉదంతాలు కూడా రకరకాలు… నిన్న ఓ వార్త… మరీ రెండో ప్రియుడిని మొదటి ప్రియుడు ప్లస్ భర్తతో కలిసి చంపేసిందట… వావ్, ఆ భర్త, ఆ మొదటి ప్రియుడి నిర్వాకం… చివరకు భర్త కూడా భార్యా ప్రియుడితో కలిసి హత్యాకాండకు దిగడం…

Ads

ఆమధ్య ఓ సినిమా వచ్చింది… రాజు వెడ్స్ రాంబాయి అనుకుంటా… సినిమాలో కూతురికి రహస్యంగా తండ్రి హెచ్ఐవీ ఇంజక్షన్ చేయిస్తాడు… ఇదోరకం పరువు హత్య… మరీ దారుణమైంది…

మరో సినిమాటిక్ స్టోరీ వెలుగులోకి వచ్చింది… ప్రియుడి భార్యకు వైరస్ ఎక్కించిన ప్రియురాలు..! అంటే… ఆమె అడ్డుతొలిగిపోతే ఇక ఆ ప్రియుడు తనకే సొంతం… కాదు, కాదు, ఇక్కడే ట్విస్టు… తను మాజీ ప్రియుడు, తన మీద కక్షతోనే వాడి భార్యకు వైరస్ ఎక్కించింది… ఎంత క్రుయల్‌గా మారిపోతున్నారో భార్యలు… అందుకే భర్తలూ బహుపరాక్… అవునూ, ఈమెకు భర్త ఉన్నాడా..? వాడినేం చేసిందనే వివరాల్లేవు… ఆ న్యూస్ స్టోరీలోకి వెళ్తే….

రాజు వెడ్స్ రాంబాయి



ఒక యువతి తన మాజీ ప్రియుడిపై పగ పెంచుకొని, అతని భార్యకు ప్రాణాంతకమైన వైరస్‌ను ఇంజెక్షన్ ద్వారా ఎక్కించిన వైనం వెలుగులోకి వచ్చింది… ఈ నీచ చర్యకు పాల్పడిన వసుంధర అనే యువతితో పాటు ఆమెకు సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు… సినిమాలలో క్రైమ్ నిజజీవితంలో ఎలా ప్రభావితం చూపుతుందో స్పష్టం చేసే క్రైమ్ స్టోరీ ఇది..!

కర్నూలుకు చెందిన డాక్టర్ కరుణ్ కుమార్ అనే వ్యక్తికి వసుంధరతో గతంలో పరిచయం ఉంది… అంతకు మించిన సాన్నిహిత్యం ఉంది…. అయితే కొన్ని కారణాల వల్ల వారి బంధం తెగిపోవడంతో కరుణ్ కుమార్… శ్రావణి అనే మహిళను (డాక్టర్) వివాహం చేసుకున్నాడు… తన ప్రియుడు మరొకరిని పెళ్లి చేసుకోవడాన్ని సహించలేకపోయిన వసుంధర… కోపంతో ఆక్రోశంతో రగిలిపోయింది…

ఎలాగైనా వారి వివాహ బంధాన్ని విచ్చిన్నం చేయాలని కంకణం కట్టుకుంది.. ! అనుకున్నదే తడవుగా క్రైమ్ యాంగిల్ స్కెచ్ ప్లాన్ చేసింది..! శ్రావణిని అడ్డుతొలగించుకుంటే తన ప్రియుడు తనకు దక్కుతాడని భావించిన వసుంధర… అదే ఆలోచనతో ఆమెను అడ్డుతొలగించే ప్లాన్ తో టాస్క్ రూపొందించింది…

కర్నూలు

నలుగురు కిరాయి వ్యక్తులకు డబ్బులు ఇచ్చి తను చెప్పినట్లు చేయమని ఆదేశించింది..! హెచ్ఐవీ రోగుల నుంచి రక్తం సేకరించి, శ్రావణికి ఎక్కించడమే ప్లాన్…  అనుకున్న ప్రకారం కిరాయి వ్యక్తులు టాస్క్ అమలు చేశారు.! అయితే అనుకున్నట్లుగా కాకుండా ప్లాన్ కాస్త బెడిసి కొట్టింది..!

శ్రావణి స్కూటీపై వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యేలా ప్లాన్ వేసింది వసుంధర… రోడ్డుపై ఆమె స్కూటర్ కు ఎదురుగా అడ్డువచ్చిన కిరాయి వ్యక్తి అదుపు తప్పేలా చేశాడు… దీంతో శ్రావణి స్కూటర్ తో సహా కిందపడిపోయింది… అదే అదునుగా వెంటనే అక్కడికి వచ్చిన వసుంధర… శ్రావణిని పైకి లేపింది…

గాయాలయ్యాయి కదా హాస్పిటల్ కు వెళ్దామని చెప్పింది… వెంటనే మిగతా ముగ్గురు కిరాయి వ్యక్తులతో కలిసి శ్రావణిని అప్పటికే సిద్ధం చేసిన ఆటోలో ఎక్కించింది… శ్రావణి వద్దని వారిస్తున్నా వినకుండా ఆటోలో తీసుకెళ్లే ప్రయత్నం చేసింది వసుంధర..!

ఆమె పక్కనే కూర్చుని తన హ్యాండ్ బ్యాగ్ లో వైరస్ ద్రవం ఎక్కించి సిద్ధం చేసిన సిరంజీని తీసి రెప్పపాటులో శ్రావణి భుజంపై ఇంజెక్షన్ చేసే ప్రయత్నం చేసింది… హఠాత్పరిణమంతో బిత్తరపోయిన శ్రావణి వెంటనే తేరుకుని ఎదురు తిరిగింది… వసుందర చేతిలోని ఇంజెక్షన్ లాగడానికి ప్రయత్నిస్తూ బిగ్గరగా అరవడం మొదలు పెట్టింది… దీంతో చుట్టుపక్కలవాళ్లు ఆటో వద్దకు చేరుకోగానే… భయంతో వసుంధర ఆమె మనుషులు పారిపోయారు…

శ్రావణిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా… చికిత్స అందించడంతో ఆమెకు ప్రమాదం తప్పింది… విషయం తెలుసుకున్న శ్రావణి భర్త కరుణ్ కుమార్… వసుంధరపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు… కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు… సీసీ కెమెరా పుటేజి ఆధారంగా… వసుంధరతో పాటుగా మరో ముగ్గురిని అరెస్టు చేశారు….

ఇక్కడ అసలు ప్రశ్న... ఆమెకు హెచ్ఐవీ గనుక ఎక్కిస్తే, తన ప్రియుడికీ అది సోకుతుంది కదా, తరువాత వాడితో శారీరకంగా కలిస్తే ఈమె కూడా వ్యాధిగ్రస్తురాలు అవుతుంది కదా... ఏమో, ఆవేశంలో, కోపంలో పిచ్చి పనికి పూనుకుంది అంటారా..,.? లేక వేరే ఇంకేదో వైరస్ ఎక్కించబోయిందా..? అదేమిటి..? ఏమో, పోలీసులు రసాయన పరీక్షలకు పంపించారట... రిజల్ట్ వచ్చాక మళ్లీ చెప్పుకుందాం...

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రియుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు… ఇదీ అలాంటి స్టోరీయే…
  • 120 రోజులు సముద్ర గర్భంలో… సెయిలర్ కాదు, ఏరోస్పేస్ ఇంజనీర్…
  • అత్యంత సంక్లిష్టత..! విదేశీ నిపుణులనూ ఆశ్చర్యపరుస్తున్న పోలవరం..!!
  • నిర్మూలన..! కనుమరుగు కానున్న హిస్టారికల్ పాంబన్ రైల్వే బ్రిడ్జి..!!
  • సిన్నర్స్..! ఆస్కార్ నామినేషన్లలో అదిరిపోయే రికార్డు..! మనమెక్కడ..?!
  • ‘గీత’మ్ దాటుతున్న కూటమి సర్కారు… వేల కోట్ల భూమి ధారాదత్తం…
  • చంటి బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ కంట్రోల్… అందరూ తప్పులో కాలేశారా..?!
  • IPS weds IAS … ఇదీ ఆదర్శ వివాహమే… సింపుల్‌గా రిజిష్ట్రార్ ఆఫీసులో…
  • రేవంత్‌కు అకారణ ప్రేమ ఉండొచ్చుగాక… హైకోర్టు వదలడం లేదు…
  • తెలుగు కంపోజర్ ఎంఎం కీరవాణికి అరుదైన గౌరవం + అవకాశం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions