ఈరోజు నేను మంచి ఉన్నత స్థానంలో ఉన్నాను, ఇక నాకేముంది అని ఎవరైనా అనుకుంటే, దానంత వెర్రి భ్రమ మరొకటి ఉండదు…. అయ్యో, నేనిలాగే దిక్కుమాలిన పొజిషన్లోనే ఉండిపోవాలా అని ఎవరైనా నిరాశలోనే ఉంటే, దానంత పిచ్చితనం కూడా మరొకటి ఉండదు… డెస్టినీ నిర్ణయిస్తుంది… అనగా ప్రాప్తం..! ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీలో ఓడలు బళ్లు కావడం, బళ్లు ఓడలు కావడం చాలా వేగంగా మనం చూస్తూనే ఉంటాం… కొందరి జాతకచక్రాలు గిర్రున తిరుగుతూ ఉంటయ్… పరమపదసోపానపటంలో హఠాత్తుగా పాములు మింగుతుంటయ్… నిచ్చెనలు అమాంతంగా పైకి ఎక్కిస్తుంటయ్… 2012 ప్రాంతంలో… తమిళంలో సుందరపాండియన్ అనే ఓ సినిమా నిర్మాణంలో ఉంది… ఒక షూటింగ్ స్పాట్ నుంచి మరో స్పాట్‌కు పోవాలి… అది 300 కిలోమీటర్ల దూరం… అక్కడి షెడ్యూల్‌కు అవసరమైన వాళ్లంతా బయల్దేరారు…
నిర్మాత ఇన్నోవా కార్లను బుక్ చేశాడు… తప్పదు కదా… కానీ తీరా సమయానికి కార్ సప్లయర్ ఒకటీరెండు కార్లను తగ్గించాడు… ఏవో అనుకోని తన కారణాలతో… చివరి కారును ఇనిగో ప్రభాకరన్‌కు కేటాయించారు… మరి అప్పటికే తను కాస్త పాపులర్… గల్ఫ్ నుంచి వాపస్ వచ్చి, అప్పుడప్పుడే ఇండస్ట్రీలో చాన్సుల కోసం తొక్కులాడుతున్న విజయ్ సేతుపతి అనే ఓ చిన్న ఆర్టిస్టుకన్నా…! చివరకు ఆయనకు ఓ ఆర్డినరీ లోకల్ ట్రెయిన్ టికెట్ చేతిలో పెట్టారు… రైలులో వచ్చెయ్ అన్నారు… ఓ కాన్వాస్ బ్యాగు భుజాలకు తగిలించుకుని సేతుపతి రైలెక్కాడు… తమ కారులోనే ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోవాలని ఒక్క నిమిషం కూడా హీరో శశికుమార్ గానీ, సదరు ఇనిగో ప్రభాకరన్ గానీ ఆలోచించలేదు… ఆఫ్టరాల్ ఓ చిన్న పాత్ర పోషించే ఓ కేరక్టర్ ఆర్టిస్టు గురించి ఆలోచించేంత ‘విశాల హృదయాలు’ ఎవరికీ ఉండవు ఇండస్ట్రీలో… ఎవడి కంఫర్ట్ వాడిది… అంతే…
Ads
సీన్ కట్ చేస్తే… అది 2016… ఇదే ఇనిగో ప్రభాకరన్ ఓ కారు కొనుక్కోవడానికి అడ్వాన్స్ కట్టాడు… డబ్బు అడ్జస్ట్ కావడం లేదు… ఒక ఫైనాన్షియర్‌ను 35 లక్షలు అప్పు ఇవ్వాలని అడిగాడు… 15 నుంచి 20 రోజులు… కనీసం 20, 30 సార్లు ఫోన్లు చేయించుకున్నాక చివరకు సదరు ఫైనాన్షియర్ సారీ అన్నాడు… జస్ట్, 35 లక్షల అప్పు…! మరో సంవత్సరం ముందుకెళ్దాం… అది 2017… తరట్ తప్పటై అనే సినిమా… ఫైనాన్స్ ట్రబుల్స్లోె పడింది… శశికుమార్ ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు… కోటి రూపాయలు అడ్జస్ట్ చేస్తే సినిమా చిక్కులు వీడిపోతయ్… అదే ఫైనాన్షియర్‌కు శశికుమార్ ఫోన్లు చేస్తున్నాడు… ఒకటీరెండు నెలలు… ఊహూఁ… తిప్పుకునీ తిప్పుకునీ ఫైనాన్షియర్ అడ్జస్ట్ చేయలేను అని మొహం మీదే చెప్పేశాడు… జస్ట్, కోటి రూపాయలు..!! ఇంకో సంవత్సరం ముందుకెళ్దాం… అది 2018,.. విజయ్ సేతుపతి సినిమా… సినిమా పేరు 96… అది విడుదలవుతుందా లేదా అనే పరిస్థితి… సేమ్, ఫైనాన్షియల్ ట్రబుల్స్… నిర్మాతల బేరసారాలు, చర్చలు, ప్రయత్నాలు ఫలించడం లేదు… సేతుపతి ఓ ఫైనాన్షియర్‌కు కాల్ చేశాడు… 3.5 కోట్లు కావాలి, అడ్జస్ట్ చేయగలరా అనడిగాడు… ఒకటే కాల్… 44 నిమిషాల్లో డబ్బు అక్కడికి చేరుకుంది… సరిగ్గా గంట సేపట్లో డీల్ వోకే అయిపోయింది… ఎవరా ఫైనాన్షియర్..? ప్రభాకరన్‌కు 35 లక్షలు ఇవ్వడానికి, శశికుమార్‌కు కోటి రూపాాయలు సర్దుబాటు చేయడానికి నిరాకరించిన అదే ఫైనాన్షియర్… అప్పట్లో సుందరపాండియన్ సినిమాకు ఫైనాన్స్ చేసినవాడే… ఇప్పుడు సేతుపతి చేసిన ఒకే కాల్‌తో 3.5 కోట్లు అడ్జస్ట్ చేశాడు… వెరసి నీతి ఏమిటి…? టైమ్… ఎప్పుడూ ఒకేలాగా ఉండదు…!!
Share this Article