బిగ్‌బాస్ కావచ్చు, ఇండియన్ ఐడల్ కావచ్చు… ఇంకేదైనా రియాలిటీ షో కావచ్చు… అదొక ఆట… ఎవరైనా గెలవొచ్చు, ఎవరైనా మధ్యలోనే వెళ్లిపోవాల్సి రావచ్చు… ప్రేక్షకులకు వినోదం, అంతే… కాకపోతే ప్రతి ఎలిమినేషన్‌ను కూడా టీవీ వాడు భీకరమైన సంగీత నేపథ్యంతో… కన్నీళ్లు, కౌగిలింతలు, పరామర్శలు, విషణ్ణ వదనాలతో ఇంకాస్త మసాలా వేస్తాడు… ఒకడు వ్యూయర్స్ వోట్స్ అంటాడు, ఇంకొకడు జడ్జిల మార్కులే అల్టిమేట్ అంటాడు… నిజానికి అంతిమ విజేతల విషయానికొచ్చినప్పుడు టీవీ వాడికి తన లెక్కలే ముఖ్యం… ఎవరు చివరి దాకా ఉంటే ప్రేక్షకులు ఎక్కువగా చూస్తారో లెక్కలేసుకుంటూ ఉంటాడు… కానీ మన తెలుగమ్మాయి షణ్ముఖప్రియ దగ్గరకొచ్చేసరికి ఎక్కడో లెక్క దారుణంగా తప్పింది… టీవీ వాడు ఒకటి తలిస్తే ప్రేక్షకులు మరొకటి తలిచారు… ఇప్పుడు ఎలిమినేషన్ కత్తి ఆమె మెడపై వేలాడుతోంది… ఎలాగంటారా..?
నిజానికి ఫస్ట్ నుంచీ సోనీ గానీ, జడ్జిలు, వచ్చీపోయే గెస్టులు షణ్ముఖప్రియకు మంచి హైప్ ఇచ్చారు… ఇండియన్ ఐడల్ తొలి లేడీ విన్నర్ అని డిక్లేర్ చేసినంత పనిచేస్తున్నారు… ఆ అమ్మాయి కూడా ఊరికే ఒరిజినల్ పాటను అలాగే పాడేసి వెళ్లిపోకుండా కొన్ని ప్రయోగాలు చేస్తోంది… అఫ్ కోర్స్, కొన్ని రక్తికట్టకపోవచ్చు, కానీ ఆమెలో ఆ క్రియేటివ్ జీల్‌ను మెచ్చుకోవాలి… కాకపోతే ఆమె అధికంగా పాప్ తరహా సాంగ్స్ సెలెక్ట్ చేసుకుంటోంది… మెలొడీ సాంగ్స్ తక్కువగా ఎంచుకుంటోంది… పైగా ఆమె ప్రయోగాలు కొన్నిసార్లు ప్రేక్షకులకు నచ్చడం లేదు… దాంతో ట్రోల్ చేస్తున్నారు ఆమెను… ఆ సాంగ్స్ ఖూనీ చేసిందంటూ తిట్టిపోస్తున్నారు… ఇది ఆమె వోట్లపై వ్యతిరేక ప్రభావం చూపుతోంది… తాజాగా జరిగింది అదే…
Ads
ప్రేక్షకుల వోట్లను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఇప్పుడు పోటీలో మిగిలిన 9 మందిలో… తక్కువ వోట్లు వచ్చినవి షణ్ముఖప్రియ, అంజలీ గైక్వాడ్‌లకు… వాస్తవానికి ఇద్దరూ మంచి సింగర్సే… కానీ ఈ రియాలిటీ షోలలో మెరిట్‌కూ, వోట్లకూ చాలాసార్లు లింక్ ఉండదు… ఈసారి అంజలి ఎలిమినేట్ అయిపోయింది… ఈ సీన్ మనకు తెలియజేసింది ఏమిటీ అంటే..? వోట్లలో షణ్ముఖప్రియ బాగా వెనకబడి పోయిందీ అని..! ఈ ఒక్కసారికి తప్పించుకోవచ్చుగాక, కానీ కత్తి వేలాడుతున్నట్టే కదా… సోనీ వాడు ప్రతిసారీ సేవ్ చేయడు కదా… ఇప్పటికే షణ్ముఖప్రియ కోసం అంజలిని బలితీసుకున్నారంటూ సోషల్ మీడియా మోతమోగిపోతోంది… ఇది కూడా షణ్ముఖకు మరింత నెగెటివ్ అవుతుంది… నిజానికి ఇప్పుడు మిగిలిన వాళ్లతో పోలిస్తే షణ్ముఖ ఏమాత్రం తక్కువ కాదు, పిసరంత ఎక్కువే… కానీ అకస్మాత్తుగా పరిస్థితులు ఆమెకు నెగెటివ్ అయిపోతున్నయ్… ఆల్‌రెడీ మన విశాఖ అమ్మాయే శిరీష ఎలిమినేట్ అయిపోయింది… తను కూడా మంచి సింగర్… కానీ షో లెక్కల్లో ఎక్కడో ఫిట్ కాలేదు…
వోటింగు అనేసరికి నార్త్ ఇండియన్ సింగర్స్‌కు అడ్వాంటేజ్ వస్తోంది… ఆ స్టేట్స్‌లో ఈ ప్రోగ్రామ్‌కు రీచ్ ఎక్కువ, ప్రేక్షకులు ఎక్కువ… వోటింగూ నార్తరన్ సింగర్స్‌కే ఎక్కువ ఉంటుంది… సౌతిండియన్ సేట్స్‌లో హిందీ రియాలిటీ షోకు ఎలాగూ ప్రేక్షకులు తక్కువే కదా… వోట్లూ తక్కువే… ఇది మనవాళ్లకు మైనస్… ఇక దీనికితోడు తాజాగా వచ్చిపడే వివాదాలు, కావాలని సౌతిండియన్ కంటెస్టెంట్ల పట్ల జరిగే నార్తరన్ ట్రోలింగ్ సరేసరి… ఇప్పుడు మిగిలిన వాళ్లలో అరుణితతో షణ్ముఖకు టఫ్ కాంపిటీషన్… ఆ బెంగాలీ సింగర్ గొంతులోని మాధుర్యంతోపాటు.., పవన్ దీప్‌తో లవ్వూ గట్రా వార్తలు ఆమెకు మంచి ప్రచారాన్ని, హైప్‌ను… అదే రేంజులో వోట్లను తెచ్చిపెడుతోంది… చూడాలిక షణ్ముఖ తన రూట్ మారుస్తుందా..?!
Share this Article