Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వరల్డ్ క్రికెట్ అంటేనే ఇండియా… విదేశీ జట్లలో ఏకంగా 40 మంది మనోళ్లే..!!

February 7, 2026 by M S R

.

నిన్న అండర్-19 వరల్డ్ కప్ గెలిచారు మన కుర్రాళ్లు… అదీ ఘనంగా..! అప్పుడు ఈ వ్యాసరచయిత సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు… ‘‘ఇండియా అంటే క్రిికెట్… క్రికెట్ అంటే ఇండియా’’ నిన్నటి విజయమే కాదు… టీ20 మెన్స్ వరల్డ్ కప్ పోటీ స్టార్టవుతోంది కదా… కాస్త వివరంగా చెప్పుకుందాం…

బంగ్లాదేశ్ ఇండియాలో ఆడలేం అని ప్రకటించిందా..? రాజకీయం..! మేం కూడా ఇండియాతో ఆడలేం అని పాకిస్థాన్ ప్రకటించిందా..? రాజకీయం..! తరువాత నష్టపోయేవి, బాధపడేవి అవే… ఎందుకంటే..? వరల్డ్ క్రికెట్ అంటేనే ఇండియా కాబట్టి..!! అంతేకాదు… ఇతర దేశాల జట్లలో కూడా బోలెడుమంది ఇండియన్సే కాబట్టి…!

Ads

క్రికెట్ ప్రపంచంలో ‘ఇండియన్ ఇంపాక్ట్’ – ఇదొక యాదృచ్ఛికం కాదు… ఒకప్పుడు వరల్డ్ కప్ అంటే ఆస్ట్రేలియా, వెస్టిండీస్, పాకిస్తాన్ పేర్లు వినిపించేవి. ఇప్పుడు? ట్రోఫీ ఎవరి చేతిలో ఉన్నా… ఆ విజయంలో ఎక్కడో ఒకచోట ఇండియా ఉంది…

ప్రస్తుతం జరగబోయే టీ20 వరల్డ్ కప్‌ని తీసుకుంటే…

  • USA

  • కెనడా

  • నెదర్లాండ్స్

  • న్యూజిలాండ్

  • UAE

  • నేపాల్

  • హాంకాంగ్

ఇలా దాదాపు ప్రతి జట్టులోనూ ఇండియన్ మూలాలున్న ఆటగాళ్లు కీలక పాత్రల్లో ఉన్నారు… వాళ్లు కేవలం “ప్లేయర్స్” కాదు – ఓపెనర్లు, కెప్టెన్లు, మ్యాచ్ విన్నర్లు…

ఇది వలస ప్రభావమా? లేక ఇండియన్ క్రికెట్ సిస్టమ్ సక్సెసా? నిజానికి… రెండూ…


BCCI నుంచి గల్లీ క్రికెట్ వరకూ – క్రికెటర్ల ఫ్యాక్టరీలు

ఇండియాలో క్రికెట్ ఓ ఆట కాదు – ఓ కల్చర్.
గల్లీ నుంచి గ్రౌండ్ వరకూ, స్కూల్ నుంచి స్టేడియం వరకూ…
టాలెంట్‌ని గుర్తించి మలిచే సిస్టమ్ ఉంది.

  • అండర్-19 వరల్డ్ కప్ – నిన్నే మనమే గెలిచాం

  • ఉమెన్ వరల్డ్ కప్ – మనదే

  • టీ20 వరల్డ్ కప్ – ఫేవరెట్స్ మనమే

ఇవి ఒక్కో ట్రోఫీలు కాదు… ఇండియన్ డెప్త్‌కి సర్టిఫికెట్లు. ఇండియా A టీమ్‌తోనే కొన్ని దేశాల మెయిన్ జట్లను ఓడించగల సత్తా ఉంది అంటే – అది మాటలు కాదు, ఫ్యాక్ట్…


ఇతర దేశాల జట్లలో ఇండియన్స్ ఎందుకు?

ఒక నిజం చెప్పాలంటే – ఇండియాలో టాలెంట్ ఎక్కువ, అవకాశాలు తక్కువ. తక్కువ అనడంకన్నా పోటీ ఎక్కువ. అందుకే…

  • ఎవరో USAకి వెళ్లారు

  • ఎవరో కెనడాలో సెటిల్ అయ్యారు

  • ఎవరో న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లో పెరిగారు

కానీ క్రికెట్ డీఎన్ఏ మాత్రం ఇండియానే… ఇండియన్ కోచ్‌లు, ఇండియన్ లీగ్స్ (ప్రత్యేకంగా IPL)
ప్రపంచ క్రికెట్‌ను మార్చేశాయి… ఇప్పుడు ఒక ప్లేయర్ ఇండియా తరఫున ఆడకపోయినా, ఇండియన్ స్కూల్ ఆఫ్ క్రికెట్‌ని ప్రపంచానికి చూపిస్తున్నాడు…


IPL – అసలు గేమ్ ఛేంజర్ నిజం చెప్పాలంటే, ఈ రోజుల్లో ప్రపంచ క్రికెట్‌ని నడిపేది ఒకే లీగ్ – IPL... అక్కడ…

  • ఆస్ట్రేలియన్ నేర్చుకుంటాడు

  • ఇంగ్లిష్ ప్లేయర్ మెరుగుపడతాడు

  • అఫ్గాన్ స్టార్ అవుతాడు

కానీ ఆ స్టేజ్‌ని ఇచ్చింది ఎవరు? ఇండియా….

అందుకే ఈ వరల్డ్ కప్‌లో ప్రతి జట్టులో ఇండియన్ టచ్ కనిపిస్తోంది… క్రికెట్ గ్లోబల్ గేమ్ అయ్యింది, కానీ దాని హార్ట్‌బీట్ మాత్రం ఇండియానే… ఇది గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే – ఈ dominance యాక్సిడెంటల్ కాదు… డిజర్వ్డ్…



ప్రస్తుత వరల్డ్ కప్ జట్లను పరిశీలిద్దాం… భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచకప్‌లో 20 జట్లు పాల్గొంటున్నాయి… ఈ సారి భారత సంతతికి చెందిన 40 మంది ఆటగాళ్లు వేర్వేరు జట్ల తరఫున మైదానంలోకి దిగబోతున్నారు…
.

కెనడా… : దిల్ ప్రీత్ బజ్వా (కెప్టెన్), అజయవీర్ హుండల్, అంష్ పటేల్, హర్ష ఠాకర్, జస్కరణ్ సింగ్ బుట్టర్, హర్ష్ తుషార్ భాయ్ థాకర్, నవనీత్ ధాలివాల్, రవీందరపాల్ సింహ, శివం శర్మ, శ్రేయస్ మోవా, యువరాజ్ సమరా.

అమెరికా : మోనాంక్ పటేల్ (కెప్టెన్), జేసీ సింగ్, మిలింద్ కుమార్, నోస్తూష్ కెన్జిగె, సాయితేజ ముక్కామల, కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్ బర్టన్, సౌరభ్ నేత్రవల్కర్, శుభమ్ రంజనే.

ఒమన్ : జతిందర్ సింహ (కెప్టెన్), వినాయక్ శుక్ల, కరణ్ సోనావలే, జయ్ ఒడెద్రా, ఆశీష్ కుమార్, జితేన్ రామానంది, వాసిమ్ అలీ.

యూఏఈ : అలీషన్ షరాఫు, ఆర్యన్ శర్మ, హర్షిత్ కౌషిక్, మయంక్ కుమార్, సిమ్రన్ జిత్ సింగ్, సోహైబ్ ఖాన్, ధ్రువ్ పరాశర్

న్యూజిలాండ్ : ఈష్ సోధి, రచిన్ రవీంద్ర
దక్షిణాఫ్రికా : కేశవ మహారాజ్

వెస్టిండీస్ : గుడాకేష్ మోటి
ఇటలీ : జస్రీత్ సింహ
నెదర్లాండ్ : ఆర్యన్ దత్త…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టీబీజేపీకి దిష్టి తత్వం బోధపడింది… కళ్లు హఠాత్తుగా తెరుచుకున్నయ్…
  • వరల్డ్ క్రికెట్ అంటేనే ఇండియా… విదేశీ జట్లలో ఏకంగా 40 మంది మనోళ్లే..!!
  • అసలు ప్రేక్షకులే చూడని సినిమాకు మూడు ప్రభుత్వ అవార్డులు..!
  • సుపిత- జాతిపిత… ఎడతెగని రచ్చ… అర్హతలపై అంతులేని రాద్ధాంతం…
  • చావుతో అతి పెద్ద పోరాటం… ఆమె బతికిన తీరే ఓ అద్భుతం…
  • మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే..? అమరావతి పూలింగుకు అదే అడ్డంకి..!!
  • ఇది గోనా గన్నారెడ్డి ఏలిన కోట… ఓ ఘన చరిత్రకు శిథిల ఆనవాలు…
  • వరంగల్- కరీంనగర్… ఓ న్యూ మోడల్ పెంటాసిటీ కారిడార్..!!
  • ఆరోగ్యానికి ‘లలితకళా’ రక్ష…! ప్రొటియోమిక్స్ అంటే ఏంటి..?
  • గుణశేఖర్ గుణాత్మక పంథా… సామాజిక ఇతివృత్తాల వైపు… కానీ..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions