Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాలు, కొసరాజు, సింగీతం, సాలూరి… అందరి కెరీర్లలోనూ ఇదే చెత్తపాట బహుశా…

June 10, 2021 by M S R

కొన్ని కొన్ని అంతే… సినిమా ఇండస్ట్రీలో కొందరు ప్రముఖుల కెరీర్ ఎంత ఉజ్వలంగా వెలిగినా… ఎన్ని ఎవరెస్టులు ఎక్కినా… కాస్త తరచిచూస్తే వాళ్ల కెరీర్లలో కొన్ని గులకరాళ్లు కనిపిస్తయ్… భారతీయ సినిమాలకు పాటలే ప్రాణం కాబట్టి ఆ పాటల గురించే చెప్పుకుంటున్నప్పుడు… ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనే ఓ మేరుపర్వతం ప్రస్తావన రాకుండా దక్షిణాది సినిమా సంగీతం గురించి ఏమీ చెప్పుకోలేం… అలాగే కొసరాజు ఎప్పట్నుంచో ఓ పాపులర్ రైటర్… మ్యూజిక్ కంపోజర్ సాలూరి రాజేశ్వరరావుకు తిరుగులేదు… సింగీతం శ్రీనివాసరావు సినిమాలకూ విశేషస్థానం ఉన్నదే… ఐతే వీళ్లందరికీ ఓ మరక అనుకోవచ్చునేమో ఈ పాట… ఎవరి ప్రతిభ వాళ్లదే… కానీ ఈ నలుగురూ కలిసి ఓ నగుబాటు పాటకు పూనుకున్నారు… ఆ సినిమా పేరు ‘ఒక దీపం వెలిగింది’… నెట్‌లో ఎంత సెర్చినా మీకు ఏకవీరలోని ఏదో ఎన్టీయార్ పాట కనిపిస్తుంది తప్ప ఈ సినిమా కనిపించదు… పాటలతోరణాలు అనే ఓ బ్లాగులో కనిపించింది, ఈ పాట కూడా వినిపించింది… అఫ్ కోర్స్, ఇంకెక్కడైనా కనిపిస్తుందా అని చూస్తే… ఊహూఁ… ఆ సినిమా కూడా అంత అనామకంగా వచ్చి వెళ్లిపోయింది…

spbalu

నిజానికి మంచి టీమే… కొసరాజు, ఆత్రేయ గీతాలు… సింగీతం దర్శకత్వం… సాలూరి స్వరసారథ్యం… బాలు, సుశీల, ఆనంద్, రమేష్ గాత్రాలు… తారాగణం కూడా పర్లేదు, రామకృష్ణ, చంద్రకళ, జగ్గయ్య, జయమాలిని… సర్లెండి, ఎక్కడో ఫుల్లు తేడా కొట్టేసి, ఫట్‌మని పగిలిపోయినట్టుంది… అందులో ఒక పాట… ఎక్కడి వాడమ్మా… సుశీల, ఆనంద్, రమేష్ పాడారు… మరో పాట… గళ్ల చీర కట్టిందిరా… సుశీల పాడింది… ఇంకేదో అమ్మాయిల ఫైట్ సాంగ్, కొన్ని డైలాగులతో… ఇవి గాకుండా ఓ మంచి పాట ఉంది… అది… చెప్పలేనిది చెప్పుతున్నా… బాలు, సుశీల పాడిన ఆత్రేయ గీతం… మనం చెప్పుకునేది మరో పాట… ‘‘తెలిసిందా మన దెబ్బ.. తగిలిందా యమ దెబ్బ..’’ నవ్వు, జాలి, చిరాకు ఒకేసారి కలుగుతయ్ ఆ పాట వింటే… ఈ సినిమా 1976 నాటిది… 1975లో షోలే వచ్చింది… అందులో మెహబూబా పాట సూపర్ డూపర్ బంపర్ హిట్ కదా… అందరూ ఆ పాటను కాపీ కొట్టేసి తమ సినిమాల్లో పెట్టేసుకుంటున్న రోజులు… ఇక్కడే సాలూరి, సింగీతం కక్కుర్తిపడ్డారు… ఆ ట్యూన్ యథాతథంగా కాపీ కొట్టేసి ఓ పాట రాయించుకున్నారు కొసరాజుతో… అప్పుడప్పుడే ఎదుగుతున్న రోజులు కదా, బాలుతో పాడించారు… ట్యూన్ రంది లేదు, ప్యూర్ కాపీ… ఆ కాపీలోనూ ఓ నవ్వొచ్చే సంగతి ఒకటుంది…

Ads

spbalu

ముందుగా ఆ పాట చదవండి… బహుశా మీకు ఎక్కడా దొరక్కపోవచ్చు ఈ సాహిత్యం…

“తెలిసిందా మన దెబ్బ.. తగిలిందా యమ దెబ్బ..
వదిలిందా నీ తలతిక్క.. ఆడిస్తా ఇక తైతక్క…
కేటులాగా వచ్చావా… ఒక కిక్కిస్తా, చూచుకో…
నెత్తురు కక్కిస్తా కాచుకో…
స్వీటు స్వీటుగా హాటుహాటుగా
దెబ్బల హల్వా తినిపిస్తా
వీపుకు మాలిష్ చేస్తా
నీ బుర్రకు పాలిష్ చేస్తా
నీ పార్టీకే ఇది టీ పార్టీ
ఈ ఫైటులో ఒక వెరయిటీ
జేమ్స్ బాండూ నావెల్టీ
పాప అలిసిపోతే కప్పు టీ
నజ్జునజ్జుగా పచ్చిపచ్చిగా నిను గిరగిర తిప్పి తిప్పి

పల్టీ కొట్టిస్తా, పచ్చగడ్డి తినిపిస్తా



ఈ పాట వినాలనుకుంటే ఈ ఫేస్‌బుక్ లింకులో వినొచ్చు… https://www.facebook.com/vlagishetti/videos/3978608848887003/



షోలేలో మెహబూబా పాట సందర్భం లేరు, సాహిత్యం వేరు… ఆ కేరక్టర్‌కు తగినట్టు ఆర్డీ బర్మన్ గాయకుడితో ఏవేవో పిచ్చికూతలు కూయించాడు… సేమ్, అవే కూతలు అలాగే కూయించారు బాలుతో సాలూరి… ఈ సినిమాలో సందర్భం ఏమిటంటే హీరో ఎవడికో ధమ్కీలు ఇస్తుంటాడు… ఇక్కడ నవ్వొచ్చేది ఏమిటంటే… పాటలో ఓచోట జేమ్స్ బాండ్ అనే పదం ఉంటుంది… ఇంకేముంది..? సాలూరి అక్కడ ఏకంగా జేమ్స్ బాండ్ సిగ్నేచర్ ట్యూన్ మధ్యలో ఇరికించేశాడు… మొత్తం పాట విన్నాక, గట్టిగా అనిపించేది ఏమిటంటే… ఎంత ప్రతిభావంతులైతేనేం… కొన్ని తెల్ల చొక్కాల మీద  కూడా కొన్ని బురద మరకలు ఉంటాయీ అని…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions