ఒకప్పుడు ఎంత వైభోగం… ఈ నేల మీదే స్వర్గాన్ని నిర్మించుకున్నాడు డేరా బాబా… సచ్చా సౌదా పరంపరకు ఆద్యుడు, అధిపతి… లక్షల మంది భక్తగణం… వందల కోట్ల ఆస్తులు… వాట్ నాట్..? తన ప్రపంచానికి తను ఇంద్రుడు… తనది ఓ కల్ట్… ఆయనంటే ఓ గుడ్డి ఆరాధన… సాక్షాత్తూ దేవుడే… కానీ ఏం జరిగింది..? ఉవ్వెత్తున ఎగిసిపడిన కెరటం హఠాత్తుగా విరిగిపడింది… ఉజ్వలంగా తిరిగే జాతకచక్రం ముక్కలైంది… పోయి జైలులో పడ్డాడు… మన సిస్టంలో ఎన్ని కోట్ల బొక్కలున్నా సరే, కొన్నిసార్లు మెచ్చుకోదగిన స్థిరత్వాన్ని, దృఢత్వాన్ని ప్రదర్శిస్తుంది… ఈ బాబా విషయంలోనూ అంతే… ఇద్దరు శిష్యురాళ్లను అత్యాచారం చేశాడనే ఆరోపణలు, ఆపై కేసులు, వాటిపై విచారణలు, చివరకు పంచకూళ్ల కోర్టు ఏకంగా 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది… గుర్తుంది కదా… ఆ శిక్ష విధించిన రోజు జరిగిన హింస… ఆయన శిష్యగణం విరుచుకుపడింది… దాదాపు 40 మంది మరణించారు… రెండుమూడొందల మంది గాయపడ్డారు… అయితేనేం, ప్రభుత్వం ఉక్కుపాదంతో తొక్కేసింది… తీసుకెళ్లి ఓ ఇరుకు గదిలో విసిరేసింది బాబాను… దీన్నే మనం ‘ప్రాప్తం’ అంటాం… ఈరోజు మాకు తిరుగులేదు అని విర్రవీగే ప్రతి ఒక్కడూ చదవాల్సిన కథ డేరాబాబా…
ఆరోజు హింస వెనుక ఉన్నది హనీప్రీత్ అని ఆరోపించిన పోలీసులు ఆమెను కూడా తీసుకెళ్లి జైలులో పారేశారు… ఆమె ఎవరు..? అసలు పేరు ప్రియాంక తనేజా… తన మాయలో పడేసుకున్నాడు… ఆల్రెడీ ఆమె వివాహిత… అయితేనేం… 2009లో తన కూతురుగా దత్తత తీసుకున్నాడు… నిజానికి అనధికారికంగా పెళ్లామే… ఆయన గారి డేరాల మేనేజ్మెంట్ అంతా ఆమే… ఆయనకు శిక్ష పడిన రోజు అందరినీ ఉసిగొల్పి హింసను ప్రేరేపించింది కూడా ఆమే… పోలీసులు బోలెడు కేసులు పెట్టారు, చివరకు దేశద్రోహం కూడా… తరువాత కొన్నాళ్లకు బెయిల్ వచ్చింది… అదంతా వేరే కథ… ఇప్పుడేం జరిగిందీ అంటే… ఒకే నెలలో బాబాను ఆ రోహతక్ జైలు నుంచి బయటికి తీసుకొచ్చారు… ఓసారి అస్వస్థతతో ఉన్న అమ్మను చూడటం కోసం… తరువాత ఒకరోజు బీపీ సమస్యలు అన్నాడు… మరోసారి మరొకటి… ఇప్పుడు కడుపులో నొప్పి అన్నాడు… దాంతో గురుగ్రాంలోని మేదాంత హాస్పిటల్కు పట్టుకొచ్చారు… క్లోమ సంబంధ సమస్యలేవో ఉన్నయ్…
Ads
టెస్టులు చేస్తుంటే… కోవిడ్ కూడా సోకినట్టు తేలింది… పాజిటివ్… తరువాత కాసేపటికే, కాదు, కాదు, ఇంకేదో ప్రాబ్లం, కరోనా కాదు అని సదరు హాస్పిటల్ అధికారుల ఖండనలు, వివరణలు… ప్రస్తుతానికి అక్కడే ఉంచి చికిత్స చేయిస్తున్నారు… మరి హనీప్రీత్ ఏం చేసింది..? బాబా అంటే ప్రాణం కదా… వెంటనే అటెండెంటుగా హాస్పిటల్లో చేరిపోయింది… అక్కడే ఉంటూ సేవలు చేస్తోంది… ఐనా ఈయనకు సోకిందో లేదో తెలియదు గానీ… ఆ కరోనాకు దేవుళ్లు, వాళ్ల ప్రతినిధులు, పూజారులు గట్రా తేడాలేమీ ఉండవ్… ఈ స్వయంప్రకటిత దేవుళ్లనగా ఎంత..? కానీ మనం ఇక్కడ చెప్పుకునేది వేరు… ఈ రోజున ఎవరెవరైతే వాళ్ల అధికారం, వాళ్ల ఆస్తులు, వాళ్ల పొగరు, వాళ్ల పార్టీలు, వాళ్ల హోదాలు, వాళ్ల పోస్టులు చూసి విర్రవీగుతున్నారో… అలాంటోళ్లలో చాలామందికి పాఠం చెప్పింది కరోనా… చాలామందిని నేల మీదకు దించింది… ఆఫ్టరాల్ ఈ డేరా బాబా ఎంత..? తన డెస్టినీని మరోసారి చెప్పుకోవడానికే ఈ కథనం… అంతే…!!
Share this Article