Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లుకవుట్ జారీ..! కానీ సరిపోదు… ముందు వాడి బలుపుకి కత్తెరపడాలి..!!

February 26, 2026 by M S R

.

నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్‌కు హైదరాబాద్ పోలీసులు మరో ఝలక్ ఇవ్వబోతున్నారని నిన్న వార్త.., ఏమనీ అంటే…? తనకు లుకవుట్  నోటీసులు జారీచేయబోతున్నారని..! నిజానికి దాంతో ఏం జరుగుతుంది..? ఏమీ జరగదు…!

నిజంగా పోలీసులు వాడి పనిపట్టాలంటే ఇది సరిపోదు… వివరంగా చెప్పుకుందాం… పోలీసులు ఫిర్యాదు చేశాక ఒకసారి వాడి ఇన్‌స్టా ఖాతాను మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాల కంపెనీ) సస్పెండ్ చేసింది… తరువాత వాడు మళ్లీ ఓ వీడియో పెట్టి, ఒక ఖాతా రద్దు చేస్తే నన్నేం పీకగలరు..? ఇంకో ఖాతా ఉంది, రెండు యూట్యూబ్ ఖాతాలున్నాయి… నెలకు 8 లక్షలు వస్తున్నాయి…

Ads

ఈ సంవత్సరమంతా ఒక్కొక్కడి తాటతీస్తా అని మళ్లీ అవే వెధవ కూతలు, ఇరిటేటింగ్ డిక్షన్, అదే బాడీ లాంగ్వేజీ… సో, వాడి బలుపు ఎక్కడ ఉంది..? యూట్యూబ్ నుంచి వచ్చే ఆదాయం నుంచి… ఆల్రెడీ బ్యాంకులో దాచుకున్న కోట్ల డబ్బు నుంచి, ఆ వడ్డీ నుంచి… అది కత్తిరిస్తే కదా, వాడు నేల మీదకు దిగేది…

అది కదా చేయాల్సింది… వాడెక్కడో విదేశాల్లో దాక్కున్నాడు, గతంలో ఐబొమ్మ రవి సవాల్ విసిరినట్టే తెలంగాణ పోలీసులకూ వాడు ఒకరకంగా సవాల్ విసురుతున్నాడు, నన్నేం పీకగలరు అని..! సరే, ఇప్పుడు లుకవుట్ సంగతికి వద్దాం…

దానివల్ల ఏమవుతుంది..? తను ఒకవేళ ఇండియాకు వస్తే, ఇమిగ్రేషన్ దగ్గర పట్టుబడతాడు… ఎయిర్‌పోర్టులు గానీ, పోర్టులు గానీ, సరిహద్దుల్లో గానీ తను కనిపిస్తే భద్రతా సిబ్బంది ఆపేస్తారు… ఆ లుకవుట్ నోటీసు జారీ చేసిన పోలీసులకు సమాచారం ఇస్తారు… తరువాత..?

పోలీసులు ముందుగా నోటీసులు ఇవ్వాలి, అరెస్టు చేయదగిన సెక్షన్లు గనుక ఆల్రెడీ పెట్టి ఉన్నట్టయితే అరెస్టు చేస్తారు… అసలు వాడు ఇండియాకు వస్తే కదా… వస్తే చిక్కులేనని తనకూ తెలుసు కదా… పోనీ, వాడు దాక్కున్న దేశం నుంచి రప్పించాలంటే..?

ఇంటర్‌పోల్ సాయం కావాలి… రెడ్ కార్నర్ నోటీసో, మరొకటో జారీ కావాలి… కానీ దానికి ఈ కేసు తీవ్రత సరిపోదు… ఈ పోలీసులే అక్కడికి వెళ్లి అరెస్టు చేసి పట్టుకురావడమూ కష్టమే… ఆ దేశం నుంచి ఎక్స్‌ట్రడిషన్ కూడా కష్టమే… ఈ కేసుల ఆధారంగా అక్కడి పోలీసులూ అరెస్టు చేయరు… మరేం చేయాలి..?

ముందు వాడి బలాన్ని కత్తిరించాలి, అంటే యూట్యూబ్ ఆదాయం ఆగిపోవాలి… అది సీరియస్‌గా ప్రయత్నించి, తన పాస్‌పోర్టును రద్దు చేయించాలి… పోలీసులు తలుచుకుంటే అది పెద్ద కథేమీ కాదు… ఐతే పోలీసులపై అంత ఒత్తిడి నిజంగా ఉందా..? లేదు..!

వాడి యూట్యూబ్ ఖాతాలకు అన్‌ఫాలోలు కొట్టి, రిపోర్టులు కొట్టి నాలుగు రోజులకే అలిసిపోయారు అందరూ… నాలుగు రోజులు పోతే ఇక అన్వేష్ గురించి పెద్దగా చర్చ ఉండదు, అన్‌లెస్ వాడు మళ్లీ మళ్లీ గోకిితే తప్ప..! సో, పోలీసులు కేవలం లుకవుట్ నోటీసు ఇవ్వడంతో, వీడి విషయంలో పెద్దగా ఫాయిదా ఏమీ ఉండదనేది సారాంశం..!! అఫ్‌కోర్స్, ఏపీ కోవాబన్ను ప్రభుత్వంకన్నా తెలంగాణ ప్రభుత్వం ఎంతోకొంత నయమే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • లుకవుట్ జారీ..! కానీ సరిపోదు… ముందు వాడి బలుపుకి కత్తెరపడాలి..!!
  • ఈరోజు మ్యాచులో ఈ అంపైర్ గనుక ఉంటే… ఇండియా ఇక ఇంటికేనా..?
  • అసలే బాలయ్య, ఆపై విజయశాంతి… మాంచి కమర్షియల్ మాస్ మసాలా…
  • KCR ఎడాపెడా అప్పులు, అక్రమాలు … గట్టెక్కించే తిప్పలు Revanth Reddy…
  • ఈ కీలక లొంగుబాట్ల వేదికపై ఎవరామె..? ఓసారి చెప్పుకోవాలి..!!
  • అప్పట్లో రిజెక్టయ్యాడు గానీ… వర్తమాన చానెళ్లలో చెలామణీ అయ్యేవాడేమో…
  • సాయి పల్లవి…! వాట్ ఏ కెరీర్… 15 సినిమాలు- ఏడు ఫిలిమ్ ఫేర్లు…!!
  • ఫోన్‌బుక్..! ప్రతి నంబరూ ఆత్మీయం కాదు, అవసరమైతే పలకరించదు..!!
  • పరకాల ప్రభాకర్… కేంద్ర ఆర్థికమంత్రి భర్తకు ఎక్కడో ఏదో దెబ్బ తిన్నది…
  • కేరళం..! ఎందుకు ఈ పేరు మార్పిడి..? ఈ పేరులో అర్థమేమిటి..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions