తమ పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న విజయాల్ని సైతం తల్లులు ఆనందంగా ఓన్ చేసుకుంటారు… అందరితో వెంటనే షేర్ చేసుకుంటారు… సంబరపడతారు… ఇండియన్ అమ్మలయితే వీలయితే వెంటనే దిష్టి కూడా తీస్తారు… ఆనందం వెంట అరిష్టం రావొద్దని..! అమ్మలు అంతే…! కానీ నాన్నలు..? అంత త్వరగా బయటపడరు… కడుపులో ఆనందం ఉండదని కాదు… తల్లులకన్నా ఎక్కువే ఉంటుంది, కానీ బహిరంగంగా ఉద్వేగపడరు, వ్యక్తీకరించరు… ఇండియన్ ఫాదర్స్, లేదా ఆసియన్ ఫాదర్స్ అందరూ అంతే… వాళ్లు అమెరికాలో కాదు, అంటార్కిటికాలో ఉన్నా అలాగే ఉంటారు… నేచర్ ఆఫ్ ఫాదర్స్… ఈ విషయం మీద భలే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది ట్విట్టర్లో… అమెరికాలో స్థిరపడిన ఓ కుటుంబం రాజగోపాలన్ది… బిడ్డ పేరు మేఘ…
గల్ఫ్ దేశాలు గాకుండా మన వాళ్లు అమెరికా వంటి ఇతర దేశాలకు వెళ్లగానే ఎక్కువగా మెడికల్, ఫార్మా, ఐటీ, ఆటో, స్పేస్ తదితర రంగాల్లో చేరిపోతారు… కానీ అక్కడే పుట్టి పెరిగే జనరేషన్ మాత్రం ప్రతి రంగంలోకీ ఎంటరైపోతుంది… అందరితోనూ సమానంగా… కానీ ఇళ్లల్లో మాత్రం ఆ ఇండియన్ రూట్స్ ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది… మేఘ జర్నలిస్టు… టెంపర్మెంట్ ఉన్న రిపోర్టర్… వేలాది వుయ్‌గర్ ముస్లింలను నిర్బంధించడానికి చైనా నిర్మించిన జైళ్లపై పరిశోధనాత్మక కథనాలు ఇచ్చింది… ఆమె వీసాను లాక్కొని, చైనా తమ దేశం నుంచి వెళ్లగొడితే కజకిస్థాన్ వెళ్లింది… అక్కడ కొందరు చైనా నిర్బంధ బాధితులను కలిసి స్టోరీలు చేసింది… ఇద్దరు కంట్రిబ్యూటర్లతో కలిసి వేల శాటిలైట్ ఫోటోల్ని విశ్లేషించి, జల్లెడపట్టి, అనేక ఆధారాల్ని కూడా పబ్లిష్ చేసింది… జర్నలిజంలో నోబెల్ ప్రైజ్‌గా భావించే పులిట్జర్ అవార్డు కొట్టేసింది… (21 రకాల అవార్డుల్లో ఈమె అవార్డు ఇంటర్నేషనల్ కేటగిరీ)… అక్షరాలా ఆమె అర్హురాలే…
Ads
ఇక్కడ మరోవిషయం చెప్పుకోవాలి… పత్రిక, టీవీ లేదా మ్యాగజైన్లలో పనిచేసే వాళ్లకు, ఆ సీరియస్ వర్క్‌కే పులిట్జర్ అవార్డులు అనే పాత భావనల నుంచి బయటికి రండి… ఈమె పనిచేసేది ఓ వెబ్ న్యూస్ ప్లాట్‌ఫాం… బజ్ఫీడ్న్యూస్… నిజానికి అమెరికాలోనే చాలామంది వీళ్లిచ్చే వార్తల్ని నమ్మరు… నాట్ రిలయబుల్ అని కొట్టిపడేస్తారు… అలాంటి న్యూస్ డివిజన్ నుంచి చైనా అక్రమాలపై సీరియస్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ చేసి పులిట్జర్ గెలవడం మామూలు విషయమేమీ కాదు… సరే, అమ్మలు, నాన్నల స్పందనల గురించి కదా మనం చెప్పుకుంటున్నది… ఒక్కసారి ఆమె ఫాదర్ ఆమెను అభినందిస్తూ పెట్టిన మెసేజ్ చూడండి, అలాగే ఆమె పబ్లిక్ రియాక్షన్ చూడండి…
‘‘కంగ్రాట్స్ మేఘా, అమ్మ ఇప్పుడే మెసేజ్ పంపింది, పులిట్జర్ ప్రైజ్, వెల్ డన్…’’ ఇంతే ఆ మెసేజ్… మేఘా ‘‘గారాబంగా’’… చూశారా, ఓ ఇండియన్ ఫాదర్ ఉద్వేగరహిత రియాక్షన్ అంటూ ట్విట్టర్లో షేర్ చేసుకుంది… దీని మీద భలే చర్చ సాగుతోంది… కంగ్రాచ్యులేషన్స్ తరువాత గానీ, వెల్ డన్ తరువాత గానీ ఎక్సక్లమేషన్ మార్క్స్ పెట్టకపోవడం మీద చర్చ… ఆసియన్ పేరెంట్స్ వ్యక్తీకరణ అలాగే ఉంటుందని కొందరు, బిడ్డకు తండ్రి అభినందన అలా సటిల్డ్‌గా ఉంటేనే కరెక్టు అని మరికొందరు, అక్షరాల్లో ఓవరాక్షన్ లేనంతమాత్రాన కడుపులో సంబరం లేదని కాదు కదా అని ఇంకొందరు… నానావిధ అభిప్రాయాలు… కానీ అందరినీ బాగా కనెక్టయ్యే డిబేట్… సరే, ఇక్కడ మరో సంగతి కూడా చెప్పుకోవాలి… ఆమెకు ఇంటర్నేషనల్ జర్నలిజంలో అవార్డు వస్తే ఇన్వెస్టిగేటివ్ కేటగిరీలో మరో భారతీయ మూలాలున్న జర్నలిస్టుకు కూడా పులిట్జర్ అవార్డు వచ్చింది… తన పేరు నీల్ బేడీ…
ఈ ఫోటోలో ఎడమ వైపు ఉన్నవాడే నీల్… మధ్యలో ఉన్నది కేథలిన్… ఇద్దరూ కలిసి టాంపాబే టైమ్స్‌కు పనిచేసేవాళ్లు… 137 ఏళ్ల చరిత్ర ఉన్న పత్రిక అది… ఇద్దరూ కలిసి గతంలో ఓ చిల్డ్రన్స్ హాస్పిటల్లో పిల్లల అనుమానాస్పద మరణాలను రిపోర్ట్ చేశారు, దానికి బోలెడు అవార్డులు వచ్చాయి ఇద్దరికీ… తరువాత ఓ ఏరియా అడ్మినిస్ట్రేటర్ సరికొత్త కంప్యూటర్ టెక్నాలజీని ఉపయోగించి పేరెంట్స్‌ను, స్టూడెంట్స్‌ను ‘‘ఫ్యూచర్ క్రైం సస్పెక్ట్స్’’గా (భవిష్యత్తులో నేరాలు చేసే అవకాశాలున్నవాళ్లు) బదనాం చేస్తున్న తీరును రిపోర్ట్ చేశారు… ఇప్పుడు తను ఆ పత్రికలో లేడు… ProPublica కు మారిపోయాడు… కానీ ఒకేసారి ఇద్దరు భారతీయ మూలాలున్న జర్నలిస్టులకు పులిట్జర్ అవార్డులు రావడం ఆనందదాయకం… మన దగ్గర జర్నలిజం రోజురోజుకూ భ్రష్టుపట్టిపోతున్న నేపథ్యంలో… మనవాళ్లు ఇంకెక్కడో జర్నలిజం పతాకాన్ని సగర్వంగా ఎగరేస్తుండటం చప్పట్లు కొట్టాల్సిన సందర్భమే…
Share this Article