మొన్న మేఘసందేశం సినిమాలోని ‘ముందు తెలిసినా ప్రభూ’ అనే పాట గురించి ముచ్చటించుకున్నాం కదా… గొప్ప భావరచన కానీ అంతకుముందే వచ్చిన ఓ సినిమాలోని ‘రాకోయి అనుకోని అతిథి’ పాటలాగే ఉంటుంది అని ఓ మిత్రుడు గుర్తుచేశాడు… జానర్ ఒకటే కావచ్చు, అంటే ఒకేతరహా… కాస్త ముందు చెప్పి రావయ్యా ప్రేమికా, కాస్త ఒళ్లూ ఇల్లూ చక్కదిద్దుకోవాలి అని ప్రేమికురాలు చెప్పుకోవడమే… కాకపోతే ఒక్కో గీత రచయిత ఒక్కో తరహాలో రాస్తాడు… కథలోని సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటాడు… మేఘసందేశంలోని పాట రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి… అసలే జగమెరిగిన భావకవి… ఏదో పాత పాటను స్పూర్తిగా తీసుకోవడం గానీ, కాపీ కొట్టడం గానీ ఊహించలేం కదా… రాకోయి అనుకోని అతిథీ అనే పాట శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ అనే సినిమాలోనిది… ఇది 1976లో వస్తే, మేఘసందేశం 1982లో వచ్చింది… అంటే ఆరేళ్ల క్రితం వచ్చిన ఒక పాటను దేవులపల్లి అనుకరించాడని అనుకోవాలా..? అనుకోలేం కదా…
నిజానికి ఈ అనుకోని అతిథీ అనే పాటను రాసింది పాలగుమ్మి పద్మరాజు… సంగీతమేమో పెండ్యాల నాగేశ్వరరావు… ముందు తెలిసినా ప్రభూ పాట రాసింది దేవులపల్లి కాగా, సంగీతం రమేష్ నాయుడు… రెండు పాటలు పాడింది సుశీలే… రెండు పాటల్లోనూ నాయిక జయప్రదే… ఐతే చిత్రీకరణలో హస్తిమశకాంతరం ఉంటుంది… రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ తీసింది విజయ ప్రొడక్షన్స్, అంటే చక్రపాణి, నాగిరెడ్డి… పైగా బాపు దర్శకత్వం… ఇంకేముంది..? సూపర్ అనుకుంటాం కదా… కానీ, కాదు… ఎక్కడో తేడా కొట్టింది, ఫ్లాప్ అయిపోయింది… నిజానికి ఆ సంవత్సరం జయప్రదకు బంగారు సంవత్సరం… అంతులేని కథ, సీతాకల్యాణం, మరుసటి ఏడాదే అడవిరాముడు… ఆ తరువాత ఆమె ఎక్కడికో వెళ్లిపోయింది… కానీ మేఘసందేశంలో గొప్పగా అభినయించిన జయప్రదేనా… అంతులేని కథలో అదరగొట్టిన జయప్రదేనా ఈ ‘అనుకోని అతిథి’ పాటలో దేభ్యం మొహం వేసుకుని, ఇంత ఘోరంగా నటించింది అనే నిస్పృహ ఆవరిస్తుంది మనల్ని… అసలు బాపేనా దర్శకుడు అని కూడా అనిపిస్తుంది… విస్మయం కలుగుతుంది… బాపుకన్నా మన దిక్కుమాలిన కార్తీకదీపం, త్రినయని సీరియళ్ల దర్శకులు చాలా బెటరేమో అనిపించినా తప్పులేదు… ఒకసారి ఆ పాట చదవండి… చాలా బాగా రాశాడు పాలగుమ్మి… ఎటొచ్చీ నాయిక అభినయం, చిత్రీకరణ దారుణం… ఏ ఫీలూ లేదు, ఎంతమాత్రమూ కనెక్ట్ కాదు… దీనికన్నా మేఘసందేశంలోని ‘ముందు తెలిసినా ప్రభూ’ పాట చిత్రీకరణ వంద రెట్లు బెటర్…
Ads
రాకోయీ.. అనుకోని అతిధి
రాకోయీ…
Share this Article