Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మాస్ జాతర..! జబర్దస్త్ ఫార్మాట్‌కు జెమిని మరో కామెడీ వెర్షన్..?

March 16, 2026 by M S R

.

అసలు రీల్స్, షార్ట్స్ వచ్చాక… టీవీల్లో కామెడీ షోలు చూసేవాళ్లే కరువయ్యారు… ఇది నిజం… జబర్దస్త్‌కు పోటీగా గతంలో జీతెలుగు, స్టార్‌మా ఏవో ప్రోగ్రామ్స్ చేసినా ఫ్లాప్… ఇక వాటిని వదిలేశాయి ఆ చానెళ్లు… రేటింగ్స్ కోసం వారానికి రెండురోజులు ఈటీవీ మాత్రం కంటిన్యూ చేస్తోంది…

కాకపోతే, అదే వెగటు కంటెంటు… ఈటీవీ ఇక మారదు, మల్లెమాల అనే రోత టేస్టూ మారదు… ఎంతోమంది సీనియర్లు వదిలేసి వెళ్లిపోయారు, ఈటీవీ ఆంక్షల నుంచి విముక్తి కోసం… బహుశా రాకెట్ రాఘవ, ఆటో రాంప్రసాద్, యాంకర్ రష్మి మాత్రమే ‘ఆస్థాన కళాకారుల్లాగా’ అక్కడే స్థిరపడిపోయారు… రీల్స్ చేసుకునే కమల్ సింగ్ వంటి కొందరిని పట్టుకొచ్చారు, కానీ సేమ్ ఫార్మాట్‌తో మొనాటనీ వచ్చేసింది… బోర్ కొడుతోంది షో…

Ads

శ్రీదేవి డ్రామా కంపెనీ వంటివేమో హైపర్ ఆది మొనాటనస్ వన్ మ్యాన్ షోతో బోర్ కొడుతున్నాయి… పాపం, ఈటీవీకి అంతకన్నా దిక్కేమీ లేనట్టుంది పాపం… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… అసలు తెలుగు వినోద చానెళ్ల పోటీ నుంచి తప్పుకుని, ఎక్కడో నాలుగో ప్లేసులో ఉండీ లేనట్టు కొట్టుకుంటున్న జెమిని ఓ కొత్త కామెడీ షో స్టార్ట్ చేయడం.,. దాని పేరు మాస్ జాతర…

శనివారం నుంచే ప్రారంభించినట్టున్నారు… కాసేపు చూడబడ్డాను… ఇద్దరు ముగ్గురు మినహా అన్నీ కొత్త మొహాలు… ఫ్రెష్‌గా అనిపించింది… కాకపోతే అదే జబర్దస్త్ ఫార్మాట్ కావడంతో అంత ఇంప్రెసివ్ అనిపించలేదు… కాస్త ఖర్చు కూడా బాగానే పెడుతూ, ఇంట్రస్ట్ చూపిస్తున్నట్టున్నారు…

ఎందుకంటే..? జడ్జిలుగా నవదీప్, బిగ్‌‌బాస్ ఫేమ్ బిందు మాధవి, జానీ మాస్టర్… బాగున్నారు… వ్యూహాత్మక ఎంపిక… ఒక సినిమా నటుడు, ఒక బిగ్‌బాస్ లేడీ ఫేమ్, ఓ స్టార్ కొరియోగ్రాఫర్… అన్ని సెక్షన్లనూ కనెక్ట్ కావాలనే ఎత్తుగడ…

(బిందుమాధవికి అందం ఉంది, నటన తెలుసు, కానీ సినిమాల్లో ఏ చాన్సులూ ఎందుకు దొరకడం లేదో)… యాంకర్‌గా దీపిక పిల్లి కనిపించింది, పర్లేదు, బాగానే చేసింది… ఆమధ్య యాంకర్ ప్రదీప్‌తో ఏదో సినిమాలో హీరోయిన్‌గా చేసినట్టుంది… (ఐనా సరే, టీవీ షోలు పాడి బర్రెల్లాంటివి, రెగ్యులర్ ఇన్‌కమ్, సినిమాలు లాటరీల్లాంటివి, చెప్పలేం…)

నటి సురేఖ బిడ్డ సుప్రీత కనిపిస్తోంది… వాగుడుకాయ దీపిక సరేసరి… టీమ్స్‌లో యాదమరాజు పర్లేదు, తను బాగానే చేస్తాడు… ఇంకొందరున్నారు, గుడ్… ఎవరినిపడితే వారిని తీసుకోకుండా, ఆడిషన్స్ నిర్వహించి మరీ, కాస్త టాలెంట్ ఉన్నవాళ్లనే తీసుకున్నారు… గుడ్ ఎఫర్ట్…

మాస్ జాతర

ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే..? టీమ్ బాగా కుదిరింది… కాకపోతే జెమిని టీవీ రీచ్ బాగా తక్కువ… ఏమో, ఇలాంటి రియాలిటీ షోలతో మళ్లీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్నదేమో… అసలే తెలుగు వినోద చానెళ్లలోకి సోనీ కూడా రాబోతోంది… పోటీ పెరుగుతోంది…

ఈటీవీ టీఆర్పీల వేట మానేసి, యూట్యూబ్ ఆదాయం మీద ఆధారపడుతోంది… స్టార్ మా, జీతెలుగు పోటీ సరేసరి… ఈ నేపథ్యంలో నిజంగా జెమిని కాస్త ఖర్చు పెట్టి, కాన్సంట్రేట్ చేస్తే… సగటు తెలుగు టీవీ సీరియలేతర ప్రేక్షకుడికి కావల్సిందేముంది..? పైగా కొందరు ఆర్టిస్టులు కూడా బతుకుతారు కదా..!!

  • 30 సెకన్ల రీల్స్, షార్ట్స్ అలవాటు పడిన ప్రేక్షకుడు 10–15 నిమిషాల స్కిట్ చూడటానికి ఓపిక చూపడం లేదు, అందుకే పాత ఫార్మాట్ కామెడీ షోలు బోర్ అనిపిస్తున్నాయి... మరి మాస్ జాతర ప్రేక్షకుడి పల్స్ పట్టుకోగలదా..?

  • Mallemala Entertainment రూపొందించిన జబర్దస్త్ ఫార్మాట్ ఒకప్పుడు భారీ హిట్. కానీ ఇప్పుడు అదే సమస్యగా మారింది. ఒక టీమ్ లీడర్, పంచ్ డైలాగ్స్, రెండు మూడు స్కిట్లు, చివరలో జడ్జిలు మొహమాటపు ప్రశంసల జడ్జిమెంట్లు… ఈ ఫార్మాట్ నుంచి బయటకు రావడానికి ఎవరూ సాహసం చేయడం లేదు… ప్చ్, ఈ ఫార్మాట్ బ్రేక్ అయ్యేదెలా… జస్ట్, లైక్… కపిల్ షో, స్టాండప్ కామెడీ…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒకప్పుడు హెడింగ్స్ మీద కేర్… వర్తమానంలో పక్కా కేర్‌లెస్…
  • డ్రగ్స్ కేసు… రేవంత్ రెడ్డికి భలే కలిసొచ్చింది… ఎలాగంటే..?
  • మాస్ జాతర..! జబర్దస్త్ ఫార్మాట్‌కు జెమిని మరో కామెడీ వెర్షన్..?
  • వావ్… నటి రాధిక చెప్పిన ఓ సిగ్గు కథ… ఎంత మురిపెంగా ఉందో…
  • 90 ఏళ్ల దాకా మోదీ ఆ కుర్చీ వదలడా..? మరో రెండు టరమ్స్ తనేనా..?
  • ఓ ట్రెండ్ సెట్టర్ కవి వైరముత్తు… అందుకే వరించిన జ్ఞానపీఠ్…
  • పింక్, యెల్లో క్యాంపులు కిక్కుమంటే ఒట్టు… డ్రగ్స్ తేళ్లు కుట్టిన దొంగలు…
  • అక్కినేని – వాణిశ్రీ… వయసు మీద పడినా సరే ఎవర్‌గ్రీన్ జోడీ…
  • “ఆకలిపై యుద్ధం… 500 కోట్ల భోజనాలు… అక్షయపాత్ర అమోఘ ప్రయాణం”
  • మన్ పిశాచ్… ఐఫోన్, 33 వేల ఖర్చు, ఒకేరోజు షూట్… సినిమా కంప్లీట్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions