Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తొండల భాషకు స్వస్తి… సెటైర్లతో ఎద్దేవా… రేవంత్ స్టయిల్ మారింది…

March 19, 2026 by M S R

.

రేవంత్ రెడ్డి మాటల్లో కొంత తేడా కనిపిస్తోంది… లాగూల్లో తొండల భాష గాకుండా అసెంబ్లీలో భిన్నంగా కేటీయార్‌ను ట్రోల్ చేసిన తీరు నిన్న కాస్త ఇంట్రస్టింగ్… ‘‘ఈ కుర్చీ మీద (సీఎం కుర్చీ) అంత ఆశ ఉంటే, అందరూ వెళ్లిపోయాక, కాసేపు కూర్చుని పోవచ్చు… సభ నడుస్తున్నప్పుడు మాత్రం కుదరదు… లేకపోతే ఓ కాగితం తీసుకుని వచ్చి నాపక్కనే కూర్చో, కాసేపు మాట్లాడుకోవచ్చు, నీ కోరిక కూడా తీరుతది…’’

ఎస్, ఆ పండబెట్టి తొక్కుతం భాష నుంచి, ఇదుగో ఇలా వ్యంగ్యాన్ని అలవరుచుకుంటే కొంత బెటర్… నిన్నటి తన ప్రసంగంలో ఆసక్తికరం అనిపించినవి మరికొన్ని ఉన్నయ్… ‘ బావను బామ్మర్ది నమ్మితే పులి వచ్చి తింటది ’ అట… (హరీష్ రావు, కేటీయార్‌లను ఉద్దేశించి)… ‘సొంత చెల్లెను నీ పక్కన కూర్చున్నవాళ్లే లిక్కర్ రాణి అని వెక్కిరిస్తే కనీసం నియంత్రించకపోతివి, నీకు చీమకుట్టినట్టు కూడా లేదు’ (కేటీయార్- కవితను ఉద్దేశించి)…

Ads

‘‘‘కేసీయార్ సభకు రాకుండా కోటి రూపాయల జీతం తీసుకున్నాడు… కొత్త గవర్నర్ వస్తే శుభాకాంక్షలు చెప్పడానికీ రాడు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకూ రాడు, ఇలా సభకు గైర్హాజరు మీద ఏం చేయొచ్చో సభ చర్చించాలి’’… అవునూ, ఏం చేస్తారు..? కేసీయార్ తెలివిగా ఆరు నెలల వరుస గైర్హాజరుతో అనర్హత వేటుపడకుండా అప్పుడప్పుడూ వచ్చి అయిదు నిమిషాలు కూర్చుని వెళ్తాడు… తను జనంలోకే రావడం లేదు, జనాన్ని వదిలేసిన జననేత… ఇక అసెంబ్లీకి ఏం వస్తాడు..? జీతం కట్ చేస్తారా..?

కేసీయార్ ఈ కోటి రూపాయలు పల్లీబఠానీతో సమానం… యాక్షన్ తీసుకోవడం అనేది పదే పదే కేసీయార్‌ను జనంలో లేని నేత అని వెక్కిరించడానికి పనికొస్తుంది గానీ… సభకు హాజరయ్యే దినాలు, వేసే ప్రశ్నలు, పాల్గొన్న డిబేట్ల ఆధారంగా జీతభత్యాలు కుదరవు… సీఎం ఇంకా ఏమంటాడంటే..?

‘‘ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకున్నారు… గత ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దుపై ఆదేశాలు ఇచ్చి, అవసరం అయితే లోపల వేస్తా … ఖచ్చితంగా గత ప్రభుత్వ తప్పిదాలన్నింటిపై విచారణకు ఆదేశాలు ఇస్తా…’’ నో, నో, హరీష్ రావు, కేసీయార్, కేటీయార్ ఉలిక్కిపడాల్సిన అవసరమే లేదు… సీఎం మహా కరుణాహృదయుడు, దయామయుడు… క్షమించేస్తాడు…

కాళేశ్వరాన్ని సీబీఐకి ఇచ్చి క్షమించేశాడు… విద్యుత్తు అక్రమాల కమిషన్ రిపోర్టులను అటక మీదకు విసిరేశాడు… చివరకు గొర్లు, బర్ల అక్రమార్కులను, మిల్లర్లనూ క్షమించేస్తాడు… ఫార్ములా వన్ అరెస్టులూ ఉండవు… అంతెందుకు, ఆ ఫోన్ ట్యాపింగు కేసుకే అతీగతీ లేదు… ఓఆర్ఆర్ మీద తనే ఆరోపణలు చేశాడు, సీఎం గాకమునుపు… రెండున్నరేళ్లలో ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, నిజంగానే అది ఓ పెద్ద స్కాం అట కదా…

సో, బీఆర్ఎస్ పెద్ద తలలేవీ చింతించవలదు… పదే పదే బదనాం చేయడం తప్ప రేవంత్ రెడ్డి కొరడా పట్టేది లేదు, ఏదీ కొలిక్కి తెచ్చేదీ లేదు… పెద్దాయన ఎలాగూ ఫామ్ హౌజు జైలులో స్వచ్ఛంద బందీ, కవితను ఎలాగూ వెళ్లగొట్టారు, సంతోష్ ఏవో పిట్టల ఫోటోలను ట్విట్టర్‌లో పెడుతూ, పెద్దాయనకు మందు గోళీలిస్తూ గడిపేస్తున్నాడు… మిగిలింది ఇద్దరే కదా… ఈ క్షమా హృదయుడు వాళ్లనూ క్షమించేస్తాడు, పర్లేదు..!! అవునూ, సీఎం గారూ… నాగార్జునకు, సంతోష్‌కు వందల ఎకరాల అడవుల్ని దత్తత ఇచ్చారు కదా, ఎందుకో ఎనీ అవుడియా..?!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏది ఉషోదయం..? ఏది పరాభవం..? ఎవడి నవ్వు, ఎవడి ఏడుపు..?
  • సారీ గబ్బర్ సింగ్..! ఈ సనాతన సీక్వెల్‌లో ఏదో మిస్సయింది..!!
  • తొండల భాషకు స్వస్తి… సెటైర్లతో ఎద్దేవా… రేవంత్ స్టయిల్ మారింది…
  • ప్రస్తుతం తమిళనాడు పొలిటికల్ ముఖచిత్రం ఎలా ఉందంటే..? ఫుల్ పిక్చర్..!!
  • ఆ బూతు రోత పాటపై అందరూ లెంపలేసుకుంటున్నారు..! కానీ..?
  • ఎవరు ఈ లారీజానీ..? ఇరాన్ ‘మాస్టర్ మైండ్’నే లేపిన ఇజ్రాయిల్..!!
  • వైఎస్ విజయమ్మ ‘ఫరమ్’ అటాక్… ఆస్తుల పంచాయితీలో జగన్‌కు షాక్…
  • ఈ ఒక్క దాడితో… ఇక ప్రపంచవ్యాప్తంగా ఇంధన విధ్వంసం..!!
  • దురందర్-2 … 4 గంటలపాటు కుర్చీకి కట్టేశాడు… బాక్సాఫీస్ బద్దలు…
  • ఉస్తాద్… తెలంగాణలో మాట చెల్లుబాటు కాలేదేం నాయకా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions