వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా… అలియాస్ ధనుష్… రజనీకాంత్ బిడ్డ ఐశ్వర్య ప్రేమించి పెళ్లిచేసుకుందని తెలిసి అబ్బురపడ్డారు అందరూ… ఏం చూసి ఈ బక్కోడిని ప్రేమించింది అని నవ్వుకున్నారు… వీడు హీరో ఏమిటీ అని మొహం మీదే వెక్కిరించారు కొందరు… నవ్విన నాపచేనే అన్నట్టుగా ధనుష్ ఎదుగుతూనే ఉన్నాడు… సింగర్, యాక్టర్, రైటర్, నిర్మాత… 2002 నుంచి ఒకెత్తు… ఇక ఈమధ్య తీసిన అసుర, కర్ణన్ సినిమాలతో కోట్ల మందికి కనెక్ట్ అయిపోయాడు… యూట్యూబ్ టాప్ 2 ఫిలిమ్ సాంగ్స్ తనవే… 1) వై దిస్ కొలవెరి 2) రౌడీ బేబీ… 2011లోనే జాతీయ ఉత్తమ నటుడు… మరి ఇప్పుడు ఏమిటంటే..? ఒకసారి 17 భాషల్లోకి తర్జుమా అయిపోతున్నాడు… అంటే తన సినిమా ఒకేసారి అన్ని భాషల్లో 18న రిలీజ్ కాబోతోంది… 190 దేశాల్లో… అదీ నెట్‌ఫ్లిక్స్ ద్వారా… French, German, Italian, Polish, Portuguese, Spanish (Castilian and Neutral), Thai, Indonesian, Vietnamese, Tamil, Telugu, Malayalam, Kannada, Hindi, English…. చెప్పుకోదగిన విశేషమే… సినిమా పేరు ‘జగమే తందిరం’… అంటే తెలుగులో జగమే తంత్రం… (జగమే మాయ, జగమే మర్మం అనే కోణాల్లో అర్థం చేసుకోవాలి)…
నిజంగా ధనుష్‌కు అంత పాపులారిటీ ఉందా..? అంత మార్కెట్ ఉందా..? ఇది ప్రశ్న… ఉందా లేదా అనేది కాదు, ఒక సినిమాను ఎలా మార్కెటింగ్ చేయబోతున్నారనేదే ముఖ్యం… ఏకంగా ఎనిమిది పాటలు, మూడు థీమ్ సాంగ్స్ చేశారు… నెట్‌ఫ్లిక్స్ వాడు లెంత్ ఎక్కువైంది అనేసరికి రెండు పాటలు కట్ చేసేశారు… విదేశీ భాషల్లో అసలు పాటలే ఉండకపోవచ్చు… మరి ఇంత హడావుడి చేస్తున్నారు కదా… నెట్‌ఫ్లిక్స్ వాడు ఎంత ఇస్తున్నాడంటే..? 55 కోట్లు..! ఒక తమిళ సినిమాకు సంబంధించి డిజిటల్ రైట్స్‌కు ఈ రేటు రావడం గ్రేటే… దీనికితోడు స్టార్ టీవీ వాడు టీవీ రైట్స్ కొన్నాడు… ఓవర్సీస్ రైట్స్, ఆడియో రైట్స్ గట్రా అన్నీ కలిస్తే 100 కోట్ల దాకా వెళ్లినట్టే… నెట్ కలెక్షన్స్… ఇంకేం కావాలి..? ఇక థియేటర్లలో రిలీజ్ గాకపోతే నష్టమేంటి..? థియేటర్లలో రిలీజ్ చేస్తే వంద కోట్లు వసూలు చేసినా అందులో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బయర్, ఎగ్జిబిటర్లు వాటాలు వేసుకుంటే చివరకు నిర్మాతకు దక్కేదెంద..? సో, ఖచ్చితంగా ఈ సినిమా రాబోయే రోజుల సినిమా మార్కెటింగుకు కొత్త దోవ చూపబోతున్నట్టే…
Ads
నిజానికి అప్పుడెప్పుడో 2016లో ఈ సినిమా ప్లానింగ్ జరిగింది… దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్… హీరోయిన్ మళయాళంలో తరచూ కనిపించే ఐశ్వర్య లక్ష్మి… (Aishwarya lekshmi)… నిర్మాత ధనుషే… వండర్‌బార్ ఫిలిమ్స్ బ్యానర్ కిందే తీద్దాం అనుకున్నారు… ఏమైందో ఏమో బయటివాళ్లకు అమ్మేశారు స్క్రిప్టు… కానీ టీం మాత్రం ముందు అనుకున్నదే… తరువాత కొన్నాళ్లకు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి అటక మీద పారేశారు… ఇంకేదో పార్టీ ముందుకొచ్చేసరికి అమ్మేసి చేతులు దులుపుకున్నారు… లండన్, రాజస్థాన్, చెన్నై ఎట్సెట్రా ప్లేసుల్లో ఎలాగోలా షూటింగ్ పూర్తయిందీ అనిపించి రెడీ చేశారు… గతేడాది మేలో రిలీజ్ చేయాల్సి ఉంది… కరోనా పాండెమిక్ వచ్చేసింది… అదుగో ఇదుగో అని థియేటర్ రిలీజ్ కోసం వాయిదాలు వేస్తూ వస్తున్నారు… ఇక తప్పదని తెలిసి నెట్‌ఫ్లిక్స్ రిలీజ్‌కు వోకే అన్నారు… మరీ 17 భాషల్లో అవసరమారా బుజ్జా అనకండి… చూసేవాడు చూస్తాడు,.. ఆఫ్టరాల్ వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకు ఇచ్చే డబ్బులేగా ఖర్చు… ఆమాత్రం రావా ఏం..?! పైగా అండర్ వరల్డ్ డాన్ కథ… ఏముందీ, యూనివర్శల్ సబ్జెక్టే కదా…!!
Share this Article