Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ చమురు పాలిటిక్స్‌ను యండమూరి 1978లోనే చెప్పాడు…

March 27, 2026 by M S R

.

ప్రఖ్యాత నవలా రచయిత Veerendranath Yandamoori ఫేస్‌బుక్ పోస్టు ఒకటి ఆసక్తికరంగా ఉంది … ఎప్పుడో తను రాసిన యుగాంతం నవలలో తను రాసినట్టే… ప్రస్తుత ప్రపంచ పరిణామాలు కనిపిస్తున్నాయి… ఆ పోస్టు ఓసారి చదవండి…

‘‘ట్రీపోలి లో అరబ్ దేశాలు సమావేశమై ఇజ్రాయిల్ ని అతి రహస్యంగా హఠాత్తుగా చుట్టుముట్టటానికి తీసుకున్న నిర్ణయం ఇజ్రాయిల్ కి తెలిసింది. అరబ్ దేశాల చేతిలో నూనె ఆయుధాన్ని చూసి ఇంతకాలం ఓపిక పట్టిన అమెరికా ఇరాన్ మీద దండెత్తడానికి సిద్ధమైంది.

Ads

అమెరికా ఆకస్మాత్తుగా దండెత్తితే నూనె గనులు పేల్చేయడానికి ఇరాన్, లెబనాన్ .. కొన్ని సంవత్సరాలు క్రితమే గనుల పక్కన బాంబులు అమర్చి ఉంచాయి. ఇంటర్ కాంటినెంటల్ మెస్సేల్స్ అరబ్ దేశాల వైపు రాసాగాయి.

నూనె గనుల్ని పేల్చేయమని ఇరాన్ దేశపు అధినేత ఆర్డర్ వేశాడు. పెద్ద పెద్ద విస్ఫోటనాలు. ప్రపంచంలో నూనె అంతా సముద్రం పాలైపోయింది. ఎప్పుడూ మోటారు సైకిళ్ళ, కార్ల, లారీల శబ్దాలతో నిండి ఉండే రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. ఈ నగరంలోనే కాదు. ప్రపంచమంతా. పెట్రోల్ లేక…. శ్మశాన నిశ్శబ్దం.

ఇంకొక మూడు రోజుల్లో ప్రపంచం అంతమవుతుంది కాబట్టి ఎవరికి వారు ఇళ్లల్లో ఉండటం వల్ల – ఫైవ్ స్టార్ హోటల్ అయినా సెక్యూరిటీ లేదు. రిసెప్షన్ అంతా ఖాళీగా ఉంది. అతడు ఒక రూమ్ ముందు ప్రవేశించి తలుపు తీశాడు.

ఎయిర్ కండిషన్ గాలి చల్లగా తగిలింది. లోపల దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. రూమ్ అంతా బిచ్చగాళ్ళే. కార్పెట్ నిండా ఆహారం పడి ఉంది. “ఎంజాయ్ ఫ్రెండ్స్” అని బయటికి వచ్చేసాడు.

.
( యుగాంతం నవల [జ్యోతి మంత్లీ సీరియల్ 1988] జ్యోతి మాసపత్రిక పూర్వ సంపాదకుడు వేమూరి సత్యం గారు ఈ సీరియల్ 1978లో ప్రచురితమైంది అని తెలిపారు. కృతజ్ఞతలు. అవును. నిజమే. గుర్తొచ్చింది. తులసి దళానికి ముందు రాసిన నవల ఇది. అప్పుడే 50 సంవత్సరాలు అయిపోతుంది. చాలా చక్రం వేగంగా తిరుగుతోంది నుంచి)

.



ప్రపంచం అంతం అయిపోవడం అనేది స్థూలంగా ఆ సీరియల్ కథాంశం… అందులోనే అరబ్ దేశాల చమురు, అరబేతర దేశాల రాజకీయాలపై కూడా భవిష్యత్ పరిణామాల జోస్యం, ఊహ ఉంటాయి… అదే అమెరికా, అదే ఇజ్రాయిల్, అదే ఇరాన్… అప్పుడెప్పుడో 1978లోనే రాసిన యండమూరి ‘భావి అంచనా’లు విశేషమే కదా….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ చమురు పాలిటిక్స్‌ను యండమూరి 1978లోనే చెప్పాడు…
  • IPL … అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు… ఇండియన్ పైసా లీగ్…
  • దురంధర్-3 కాదు…! ఆదిత్య ధర్ దృష్టి మరో పే-ద్ద ప్రాజెక్టు మీద..!!
  • సిద్దిపేట మాత్రమే కాదు..! సిరిసిల్ల, గజ్వెల్ కూడా *అన్ బ్రేకబుల్* కావు..!!
  • ఒక హైజాకర్… ఒక గ్యాంగ్‌స్టర్… వేర్వేరు కథలు… ఒకటే అంతిమతీర్పు…
  • క్షమాపణకు ‘దురంధర్ స్టార్’ రెడీ… ఇక్కడితో ముగించాలని వేడికోలు…
  • … ఇప్పుడైతే ఆ పాట మీద పెద్ద గొడవ అయ్యేదేమో… అసలే మోహన్‌బాబు…
  • మల్టీ నేషనల్ కంపెనీలకన్నా మనవాళ్లు తక్కువేమీ కాదు… చదవండి…
  • ఓహ్… స్టార్‌టీవీ Vs జీటీవీ… ఇంత కథ ఉందా..? స్టార్ ఫుల్‌ఫామ్ తెలుసా..?!
  • ఏడుపుగొట్టు కేరక్టర్లను వదిలేయండి… దురంధర్ సక్సెస్ ఏంటో తెలుసా..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions