Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎహె… ఈ రేవంతుడికి ఏమీ తెల్వదు, మొత్తుకోదు… ఏదీ సమజ్ కాదు…

March 27, 2026 by M S R

.

నిజమే… ఈ సీఎం రేవంత్ రెడ్డికి ఏమీ తెల్వదు, మొత్తుకోదు… తనకు ఎరుక లేదు, ఎవరు చెప్పినా వినడు… భద్రాచలం రాములోరి పెళ్లికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు మోసుకుపోతున్న ఫోటువ చూసినంక గిట్లే అనిపించింది గట్టిగా…

అరె, తెలంగాణ బాపు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి నెలకొల్పిన ఉన్నత సంప్రదాయాల్ని తరువాత ప్రభుత్వ పాలకుడిగా కొనసాగించాలా వద్దా… ఆ సోయే కనిపిస్తలేదు మనిషిలో… నువ్వు తీసుకుపోవద్దయ్యా తలంబ్రాలను… నీ మనమడితో పంపించాలె…

Ads

ఏం..? ఫుట్‌బాల్ తోపు మెస్సీని పిలిపించావు సరే, స్టేడియంలోకి మనమడిని కూడా తీసుకుపోయి, మెస్సీతో ఆడించినవ్ కదా… మరి తలంబ్రాలు పంపించలేవా..? కేసీయార్ ఆనవాయితీని, సంప్రదాయాన్ని కొనసాగించలేవా..?

అక్కడే భట్టి, తుమ్మల, పొంగులేటి, సురేఖ అందరూ భక్తిశ్రద్ధలతో కనిపిస్తున్నారు… అసలు భద్రాచలం పట్ల తీవ్ర నిర్లక్ష్యం కదా గత ప్రభుత్వం సంప్రదాయం, విధానం, పద్ధతి… దాన్ని తుంగలో తొక్కడానికా నీకు జనం అధికారం ఇచ్చింది..? గిదే మరి, నీకు సమజ్ కాదు, అదేమంటే, అప్పటి నిజాంలే తలంబ్రాలు పంపించి, రాముడిని కొలిచారు, ఆ రీతి మరిచిపోతే ఎట్లా అని ఉల్టా వాదిస్తవ్… ఎట్లనయ్యా నీతోని… భక్త రాందాస్ అయిపోవాలని అనుకుంటున్నవా ఏంది..?

రేవంత్

  • ఏదో ఇష్టారీతిన యాదగిరిగుట్టను యాదాద్రిని చేసి, వందల కోట్లు పెట్టి, వీవీఐపీ దేవుడిని చేసినట్టు కూడా… నీకు ఇష్టమైతే భద్రాద్రి పేరు పెట్టి, డెవలప్ చేసి, వీలయితే అక్కడ స్థంభాల మీద నీ బొమ్మలో, నీ పథకాల బొమ్మలో, నీ పార్టీ బొమ్మలో చెక్కించాలె… గీమాత్రం నీకు తెల్వదాయె… చిన్న జియ్యరుడికి పెద్దరికం ఇయ్యాలె… (సీతారాములను కూడా విడదీసి, విడివిడి విగ్రహాలు ఉండాలె అంటాడేమో, వద్దులే…)

సరే, ఏదో భద్రాద్రి అంటవ్… మరి ఆ వేములవాడకు 300 కోట్లు దేనికి..? కొండగట్టుకు పైసలు దేనికి..? సమ్మక్క- సారలమ్మకు 300 కోట్లు దేనికి..? పాత చరిత్ర చెక్కించినవ్, అక్కడనే కేబినెట్ మీటింగ్ పెట్టినవ్, అసలు అన్ని గుళ్లనూ సమానంగా చూడకపోవడమే కదా కేసీయార్ పాలసీ… ఆ పదేళ్ల ధోరణిని భంగపరచాలనే కుళ్లు దేనికి నీకు చెప్పు..? ప్చ్… ఇంకా అవి చాలవన్నట్టు ఇప్పుడు మూసీ ఒడ్డున, మంచిరేవుల కాడ ఓంకారేశ్వరుడి గుడి కట్టి, వంద అడుగుల భారీ శివుడి విగ్రహం పెడతానంటున్నవ్ నది మధ్యలో… రేపు శంకుస్థాపన అంటున్నవ్…

  • పోతేపోనీ, మరో 1000 కోట్లు అంటవ్, అంతేనా…  మల్ల గంగా-జమున తెహజీబ్ అంటవ్, పురానాపూల్ దగ్గర మసీదు, నాగోల్ దగ్గర చర్చి, గౌలిగూడ దగ్గర గురుద్వారా అంటున్నవ్… అదేమంటే భక్తిపర్యాటకం అంటున్నవట…

అన్నట్టు భద్రాచలం అంటే యాదికొచ్చింది… రాముడు అనగానే ఈ తలంబ్రాలు మోసుకుపోవుడు కాదు… అయోధ్యను తిట్టాలే, రామజన్మభూమి ఏంది, రావణుడి జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి అని కొక్కిరించాలె… హిందూగాళ్లు, బొందుగాళ్లు అని తిట్టాలె… ఛ, నీకు కేసీయార్ బాపతు అద్భుతమైన అదోరకం వింత సెక్యులర్ పాతివ్రత్యం అస్సలు అలవడతలేదు… ఆ నాస్తిక కేటీయార్ వద్దులే గానీ, కలిసినప్పుడు హరీష్‌రావును అడిగి చూడు, అదొకరకం తాదాత్మ్యతతో కేసీయార్ ధార్మిక పక్షవాతాన్ని సరిగ్గా చెప్పగలడు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎహె… ఈ రేవంతుడికి ఏమీ తెల్వదు, మొత్తుకోదు… ఏదీ సమజ్ కాదు…
  • పోటాపోటీగా తాయిలాలు… రాజకీయాల్లో మాత్రం వెకిలి కూతలు…
  • కాషాయం వదిలేసిన పులిబిడ్డ … తమిళ జాతీయవాదానికి సై…
  • సో కాల్డ్ కాంగ్రెస్ సీనియర్లు..! ఏదేదో మాట్లాడేస్తున్నారు..!!
  • అనేకానేక ‘మొగుడు’ సినిమాల్లో… ఇతడు ఈవీవీ మార్క్ ‘దొంగ మొగుడు…
  • ప్రతి పదమూ ఓ మంగళ వాయిద్యంగా వినిపించే పెళ్లి మురిపెం..!!
  • ఇండియా తొలి ప్రైవేటు శాటిలైట్ టీవీకి ఎన్నెన్నో పురిటినొప్పులు..!!
  • పెట్రో పానిక్ – చమురు పరుగులు…! మూసీపై మాత్రం ఏడుపులు..!!
  • హుందాగా సౌత్ ఇండస్ట్రీ ప్రశంసలు… కుళ్లుతో నిశ్శబ్దంగా బాలీవుడ్…
  • FDC కి సారథే లేడు..! ఢిల్లీలో స్టాల్ దేనికి..? ఏముందని..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions