.
Mohammed Rafee …. Ntv Vs Tv5 … నాయుడు × చౌదరి … – రంగంలోకి బొల్లినేని శీనయ్య
జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్నాయి. గతంలో Ntv నరేంద్ర చౌదరి వర్గాన్ని ఓడించి Tv5 బి. ఆర్. నాయుడు కుమారుడు రవీంద్రనాథ్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.
Ads
2021లో జరిగిన ఎన్నికల్లో నరేంద్ర చౌదరి అనేక ఆర్ధిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు చేస్తూ రవీంద్రనాధ్ బంపర్ మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు రావడంతో ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. Tv5కి Ntv కి మధ్య సంబంధాలు వార్ లా మారిపోయాయి.
రవీంద్రనాథ్ వర్గం ఆదివారం జూబ్లీహిల్స్ ఎన్ – కన్వెన్షన్ లో సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నరేంద్ర వర్గాన్ని డిబేట్ కు ఆహ్వానించింది. తమపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని, చర్చకు రావాలని, అయితే Ntv కి మాత్రం అనుమతి లేదని ప్రకటించారు. ఇటు నరేంద్ర చౌదరి వర్గం ప్రెస్ క్లబ్ ను వేదికగా చేసుకుని చర్చకు రావాలని, చిట్టా బయట పెడతామని, Tv5 కి మాత్రం అనుమతి లేదని ప్రకటించింది.
ఈసారి సభ్యుల్లో ఎక్కువ మంది బొల్లినేని శీనయ్యను రంగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర చౌదరి వర్గం నుంచి బొల్లినేని శీనయ్య అధ్యక్షులుగా ఉంటారనేది ఖాయమని అంటున్నారు. బొల్లినేని శీనయ్య బిల్డర్ గా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులుగా వున్నారు.
ఇటు నాయుడు వర్గం నుంచి తిరిగి రవీంద్రనాథ్ పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూబ్లీ హిల్స్ సొసైటీ ఎన్నికలు TV5, Ntv మధ్య పోటీ అని సభ్యులు చర్చించుకుంటున్నారు! – డా. మహ్మద్ రఫీ
Share this Article