Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శిఖరాగ్రం నుండి శూన్యం వరకు… రేమండ్స్ విజయపథ్ ‘డెస్టినీ’…

March 29, 2026 by M S R

.

రేమండ్స్ గ్రూప్ మాజీ చైర్మన్ విజయపత్ సింఘానియా (87) మరణవార్త పొద్దున్నే కలిచివేసింది… కొరగాని కొడుకు అనే పదం వినిపిస్తే చాలు ఈ సింఘానియా పేరే వినిపించేది… అంతేకాదు, ఒకప్పుడు ‘కంప్లీట్ మ్యాన్’ … ఓ ‘ఇన్‌కంప్లీట్ మ్యాన్’లా ఈ లోకం నుంచి నిష్క్రమించాడు… ఓ సినిమా కథను మించిన కథ తనది… ప్చ్, ఒక పద్మభూషణుడి కథ ‘‘శిఖరాగ్రం నుంచి శూన్యం వరకు’’… డెస్టినీ… ఆయన జీవితం చెప్పే నీతి ఏమిటంటే..? ‘‘కన్న పిల్లలైనా సరే, నమ్మకండి’’…

డెస్టినీ ఆఫ్ ‘పద్మ విభూషణ్’: శిఖరాగ్రం నుండి శూన్యం వరకు.. విజయపథ్ ఆఖరి ప్రయాణం

Ads

ప్రపంచానికి ‘కంప్లీట్ మ్యాన్’ (The Complete Man) అంటే ఎవరో పరిచయం చేసిన వ్యక్తి, తన జీవితాన్ని మాత్రం ఒక అసంపూర్ణ కావ్యంలా ముగించి వెళ్లాడు… విజయపథ్ సింఘానియా ఆయన పేరు… విజయాన్ని తన ఇంటిపేరుగా మార్చుకున్న సక్సెస్ స్టోరీ ఒకప్పుడు… కానీ చాన్నాళ్లు నిలవలేదు… చెప్పుకుందాం…

ఈయన మరణం కేవలం ఒక పారిశ్రామికవేత్త నిష్క్రమణ మాత్రమే కాదు, అది అనుబంధాల మధ్య నలిగిపోయిన ఒక తండ్రి విషాద గాథ… (రేమండ్స్ యాడ్స్‌లో ఎ కంప్లీట్ మ్యాన్ యాడ్స్ చాలా పాపులర్ అప్పట్లో…)

1. గగనమే గమ్యంగా..

విజయపథ్ కేవలం ఏసీ గదుల్లో కూర్చుని వ్యాపారాలు చేసిన వ్యక్తి కాదు… 67 ఏళ్ల వయసులో మృత్యువుతో పోరాడుతూ హాట్ ఎయిర్ బెలూన్‌లో 69,000 అడుగుల ఎత్తుకు వెళ్లి ప్రపంచ రికార్డు సృష్టించిన సాహసి… ఆయన విజయాలను చూసి దేశం గర్వించి ‘పద్మ విభూషణ్’ పురస్కారంతో గౌరవించింది… కానీ, ఆకాశాన్ని తాకిన ఆ వ్యక్తిని, సొంత రక్తమే నేల మీదకు ఈడ్చేస్తుందని ఆయన ఊహించలేదు…

2. విధి ఆడిన ‘షేర్’ నాటకం

2015లో ఆయన తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం – తన వద్ద ఉన్న 12,000 కోట్ల రూపాయల విలువైన సామ్రాజ్యాన్ని కొడుకు గౌతమ్ సింఘానియాకు కానుకగా ఇవ్వడం… “నా కొడుకు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు” అన్న ఆశతో చేసిన ఆ సంతకం, ఆయన జీవితంలో అంధకారానికి నాంది పలికింది… ఆస్తి చేతులు మారగానే తండ్రీకొడుకుల మధ్య విభేదాలు మొదలయ్యాయి…

3. సామ్రాజ్యాధినేతకు అద్దె ఇల్లే దిక్కా?

ముంబైలోని ఆకాశహర్మ్యం ‘జేకే హౌస్’ (JK House) ఆయన నిర్మించిందే… కానీ, ఆ ఇంట్లో ఆయనకు ఒక గది కూడా దక్కలేదు… కారును, డ్రైవరును కూడా వెనక్కి తీసుకోవడంతో, ఒకప్పుడు ప్రైవేట్ జెట్లలో తిరిగిన ఈ దిగ్గజం, తన ఆఖరి రోజుల్లో దక్షిణ ముంబైలోని ఒక అద్దె ఫ్లాట్‌లో సామాన్య జీవితం గడపాల్సి వచ్చింది…

"నేను చేసిన అతిపెద్ద తప్పు నా ఆస్తిని బతికుండగానే కొడుకుకు ఇవ్వడం" అని ఆయన చేసిన వ్యాఖ్యలు కోట్లాదిమంది తల్లిదండ్రుల గుండెల్ని పిండేశాయి...

4. డెస్టినీ (విధి వైచిత్రి)

సింఘానియా జీవితం ఒక పూర్తి సర్కిల్ (Full Circle)… గతంలో ఆయన తన తండ్రి నుండి ఆస్తిని దక్కించుకోవడానికి న్యాయపోరాటం చేశారని అంటారు… కాలక్రమంలో అదే విధి ఆయన కొడుకు రూపంలో తిరిగి వచ్చి, ఆయనను రిక్తహస్తాలతో నిలబెట్టింది… అధికారం, హోదా, పద్మ విభూషణ్ వంటి పురస్కారాలు ఏవీ ఆయనకు ఆఖరి దశలో ప్రశాంతతను ఇవ్వలేకపోయాయి…

5. విషాదాంతం

మార్చి 28, 2026న ఆయన కన్నుమూసినప్పుడు, ఆ వార్తను కూడా అదే కొడుకు సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు… ఒకప్పుడు వైభవానికి నిలువుటద్దంగా నిలిచిన విజయపథ్, చివరి శ్వాస వరకు తన ఆత్మగౌరవం కోసం, ఒక చిన్న గది కోసం పోరాడుతూనే సెలవు తీసుకున్నారు…

విజయపథ్ సింఘానియా కథ నేటి సమాజానికి ఒక హెచ్చరిక… రక్తం కంటే స్వార్థం బలపడినప్పుడు, ఒక ‘సంపూర్ణ పురుషుడు’ కూడా ఎంతటి అసంపూర్ణ జీవితాన్ని గడపాల్సి వస్తుందో ఆయన ప్రస్థానం మనకు గుర్తు చేస్తుంది… పద్మ విభూషణ్ గ్రహీతకు విధి రాసిన ఆఖరి వీడ్కోలు ఇది…

(నిన్న తెలంగాణ ప్రభుత్వం ఓ బిల్లు తీసుకొచ్చింది... తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లల జీతాల్లో నుంచి 10 వేల వరకూ కట్ చేసి, ఆ పేరెంట్స్ ఖాతాల్లో వేయాలని... ఎందుకో తెలుసా.,.? సమాజంలో విజయపథ్ సింఘానియా వంటి తండ్రులు కోకొల్లలు కాబట్టి... ఆ బిల్లు అందుకే...)

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నో కేసీయార్… నో జగన్… టాప్-25 జాబితాలో రేవంత్ రెడ్డి…
  • స్వామి పర్వర్షన్‌‌కు తోడుగా కిష్వర్ పైత్యం… మోడీని గోకుతున్నారు…
  • శిఖరాగ్రం నుండి శూన్యం వరకు… రేమండ్స్ విజయపథ్ ‘డెస్టినీ’…
  • శెట్టి గ్యాంగ్ కకావికలు… డబుల్ హేపీతో రష్మిక పకపకలు…
  • బ్రహ్మర్షి విశ్వామిత్ర … ఆకట్టుకోని ఎన్టీయార్ సొంత సినిమా…
  • మీడియా వార్ కాదు… ఇగో వార్… టీవీ5 Vs ఎన్టీవీ… నాయుడు Vs చౌదరి…
  • ఆట ఆడితే, ఆడిస్తే కోట్లు జలజలా రాలాలె… మేం అస్సలు ఆడం పో…
  • యుగాంతం..! విశ్వ వినాశనం దిశలో అమెరికా- రష్యా ప్రాక్సీ వార్..!!
  • మీరు క్రికెట్ ప్రేమికులా..? ఐతే తప్పకుండా ఓసారి చదవాల్సిందే…
  • ‘కోడి మెడ’..! ఒవైసీ చేతికి చిక్కుతుందా..? బెంగాల్ ముఖచిత్రమేంటి..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions