Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ బజ్వాకు ఏమైంది..? తల ఎందుకు పగిలింది..?!

March 31, 2026 by M S R

.

సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది… పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ ఖమర్ బజ్వా (65) తన కోడలు మహనూర్ సయీద్ బజ్వాతో కలిసి బాత్‌రూంలో స్నానం చేస్తూ జారిపడ్డాడనీ, నెల రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడని ఆ వార్త సారాంశం…

కోడలితో కలిసి స్నానం అనేది బహుశా పాకిస్థాన్‌లోని ఓ సెక్షన్ సోషల్ మీడియా, ప్రత్యేకించి ఇమ్రాన్‌ఖాన్ ను గద్దె దించడంలో బజ్వా పాత్రే కీలకమనే కోపంతో ఉన్న ప్రత్యర్థి వర్గాలు సాగిస్తున్న ఇన్‌ఫర్మేషన్ వార్‌ఫేర్, వ్యక్తిత్వ హననం కావచ్చు… సోషల్ మీడియా యుగంలో ఇవన్నీ సాధారణమైపోయాయి కదా… అంతేకాదు, తన మరణవార్తకు కూడా ధ్రువీకరణ లేదు ఇప్పటికీ..!

Ads

అయితే పాకిస్థాన్ ఆర్మీ ఓ చిత్రమైన వ్యవస్థ… ఆర్మీ, ఐఎస్ఐ కలిసి దేశాన్ని తమ గుప్పిట్లో ఉంచుకుంటాయి… అక్కడ రాజకీయాధికారానికి పెద్ద సీన్ ఉండదు… అవసరమైతే ఆర్మీ చీఫ్ ప్రభుత్వాన్ని కూల్చేసి, తనే ఓ నియంత అయిపోవడం కూడా పెద్ద ఆశ్చర్యం కలిగించదు… గతానుభవాలు బోలెడు… డెమొక్రటిక్ సిస్టం‌కూ ఆర్మీ డిక్టేటర్‌షిప్‌కూ నడుమ ఎప్పుడూ ఘర్షణే…

రాజకీయాధికారంలో ఉన్నాసరే, ఎప్పుడు ఎవడి కూసాలు కదలిపోతాయో, ఎవడు హతమారిపోతాడో, ఎవడు జైలుపాలవుతాడో తెలియదు… ఇదే కాదు, ఆర్మీలోనూ అంతే… ఎవరేమిటో ఓ పట్టాన అంతుపట్టదు… ప్రస్తుత ఆర్మీ చీఫ్ మునీర్‌కూ ఆ అమెరికా ట్రంపుడి కరెన్సీ దందాలో భాగస్వామ్యం… మరి ఓ ఉగ్రవాద ధూర్త దేశానికి అమెరికా మద్దతు ఏమిటీ అంటారా..? అదంతే… అమెరికా, చైనా బద్ధ శత్రువులు కదా, రెండూ పాకిస్థాన్‌తో ఆడుకుంటాయి, చెప్పుచేతుల్లో పెట్టుకుని ఆడిస్తుంటాయి కూడా..!

దురంధర్ సినిమాలో చాలావరకు క్రియేటివ్ ఫ్రీడం తీసుకుని, కొన్ని కల్పనల్ని చిత్రీకరించవచ్చుగాక… కానీ కొన్ని చేదు నిజాలు ఉన్నాయి… ప్రత్యేకించి బెలూచిస్తాన్ విముక్తిపోరాటవాదుల్ని ఎత్తుకుపోయి కాల్చేయడం, ఎక్కడో అనామకంగా సమాధి చేసేయడం మీద అంతర్జాతీయ విమర్శలు కూడా ఉన్నవే.., దురంధర్‌లో ఉగ్రవాద ముఖ్యులను అన్‌నోన్ పర్సన్స్ కాల్చేయడం వెనుక బెలూచిస్లాన్ లిబరేషన్ ఆర్మీ సహకారం కూడా ప్రధానంగా చర్చిస్తాడు దర్శకుడు…

అక్కడ ఆర్మీ, ఉగ్రవాద గ్రూపులు, ఐఎస్ఐ నడుమ సంబంధాలు అందరికీ తెలిసిందే… ఐతే కొందరు ముఖ్యుల మరణాలు కూడా ఎప్పుడూ బయటికి కారణాలు తెలియని మిస్టరీలే… ఈ సినిమాలో ఓ మాజీ బ్రిగేడియర్ తండ్రిని ఓ కొడుకు బాత్ టబ్బులో ముంచి చంపేస్తాడు… సాక్షాత్తూ ఐఎస్ఐ చీఫ్ ఇజ్రాయిల్‌కు అణురహస్యాలు అమ్ముతూ రా నిఘాకు చిక్కుతాడు… ప్రభుత్వ ముఖ్యులతో కీలక సంబంధాలు కలిగిన ఓ వ్యక్తి ఇండియన్ ఏజెంట్ 45 ఏళ్లుగా పనిచేస్తుంటాడు… కొందరు ఉగ్రవాద ముఖ్యులను అన్‌నోన్ పర్సన్స్ ఎక్కడపడితే అక్కడ కాల్చిపడేస్తుంటారు…

సినిమాలో చూపించే ‘డబుల్ ఏజెంట్లు’, ‘హనీ ట్రాప్‌లు’ నిజ జీవితంలో పాక్ అధికార వర్గాల్లో నిత్యకృత్యం… కల్పనలో, నిజాలో, నిజాలకు కాస్త జతచేసిన క్రియేటివ్ ఫ్రీడమో గానీ… సినిమాలో చాలా సంఘటనలు వార్తల్లో కూడా రికార్డయినవే… దావూద్ ఇబ్రహీంకు పాకిస్థాన్‌ ప్రభుత్వ వ్యవస్థలో అంత సీన్ ఉందానేది డౌట్… ఇలాంటివి కాస్త అతిశయోక్తులుగా అనిపించినా సరే… పాక్ ఆర్మీ నెట్‌వర్క్‌ ప్లస్ ఉగ్రవాద గ్రూపుల నడుమ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు.., బాత్రూంలో మాజీ చీఫ్ బజ్వా తలపగలడం కూడా..!! జియా ఉల్ హక్ విమాన ప్రమాదం నుండి బెనజీర్ భుట్టో హత్య వరకు దేనికీ ఇప్పటికీ పూర్తి స్థాయి కారణాలు బయటికిి రాలేదు… రావు కూడా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Rahen na rahen hum… remembering great singer suman kalyanpur…
  • ఆక్రమణ దురుద్దేశాలు లేకపోతే… చెరువులో ఈ కంచె ఏమిటయ్యా…!?
  • దుష్ట శిక్షకుడు పబ్లిక్ రౌడీ… చెడ్డ పనుల దుష్ట రౌడీ… బోత్ ఆర్ నాట్ సేమ్…
  • అప్పట్లో జోసెఫ్ విజయ్ మహా సిగ్గరి… చిన్న కళ్లు, బక్కగా, నల్లగా… కానీ..?
  • బాల్క సుమన్‌పై తెలంగాణ సర్కారు సీరియస్… దేశద్రోహం కేసు..!!
  • తుమ్మిడిహెట్టి… రేవంత్ సీరియస్ టోన్… ఫడ్నవీస్ వింటున్నావా..?
  • తెలంగాణపైకి వలసవాదం ముంచుకొస్తోంది అనడమే పెద్ద వంచకభాష..!
  • The Scape Goat… అదే ఆ పాత కథే… అనేక భాషలు… వందల సినిమాలు…
  • షర్మిలకు రాజ్యసభ సీటు..! ఏపీ కాంగ్రెస్ పార్టీకి ఫాయిదా ఏమిటట..!?
  • blood money … క్లౌడ్ ఫండింగ్‌తో ఒక ప్రాణం నిలబడింది …

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions