Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణ జాతిపిత ఎవరో క్లారిటీ వచ్చేసింది… ఇక రచ్చ ఆపేయండి…

April 4, 2026 by M S R

.

డిస్‌క్లెయిమర్ :::: నవ్వకండి, నవ్వు ఆపుకోకపోతే మర్యాద దక్కదు… ఈ మానవజాతి పుట్టుకకు నేనే కారణం, చక్రం- పవర్- ఐటీ డిజిట్స్ దగ్గర నుంచి… అంటే పాత రాతి యుగం నుంచి ఈ డిజిటల్ యుగం దాకా మనిషి ప్రస్థానానికి నేనే కారకుడిని అని….. భగవద్గీతలో కృష్ణుడిని మించి తత్వబోధ చేసే ఓ పెద్ద మనిషి ఉన్నాడు తెలుసు కదా… ఎస్, మీ ఊహ కరెక్టే…

ఇప్పుడు ఏమంటున్నాడు..? అంత సృష్టి మూలపురుషుడికి తెలంగాణ అనేది ఏముంది..? జస్ట్, పల్లీ బఠానీ కూడా కాదు కదా… అందుకే అన్నాడు.,. ‘‘తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్’’ అని… అనగా మానస పుత్రిక అని… మరీ బ్రెయిన్ లేని కామెంట్స్ అని తీసిపారేయకండి, మర్యాద కాదు…

Ads

అనేకానేక చారిత్రిక కారణాలతో, తన యెల్లో శిష్యపరమాణువు కేసీయార్ కోసం… తన అభ్యున్నతి కోసం తెలంగాణ పదాన్నే నిషేధించిన దగ్గర నుంచి తెలంగాణను అడుగడుగునా అడ్డుపడటం దాకా… కేసీయార్ ఎదుగుదల కోసమే ఆ గురువు తాపత్రయపడ్డాడు పాపం… తెలంగాణ అన్నాడి జనానికే అర్థం కాలేదు పాపం…

ఆ కృతజ్ఞతకొద్దీ శిష్యుడు గురువును ఏపీకి ‘అత్యంత మర్యాద’గా పంపించేశాడు… కథ సుఖాంతం… ఇక మొదలైంది… కేసీయార్ జాతిపిత అనీ, బాపు అనీ… సృష్టికర్త అనీ… సెల్ఫ్ ప్రమోషన్… తన పాదాల మీద పాకే మీడియాలో ఇవే వ్యాసాలు… నిన్నామొన్నటిదాకా అంతే… ఎవడికి జాతిపిత, ఏ జాతికి పిత అని సీఎం రేవంత్ రెడ్డి ఉరిమేదాకా అంతే… సరే, సందర్భం కదా, మొన్నటి ఓ వార్త చూద్దాం….

జాతిపిత

బాపుగా ముద్రపడటానికి, జాతిపితగా కీర్తించబడటానికి కేసీయార్ ప్రయాస, అవస్థలు పక్కన పెడదాం… కానీ మొన్న ఎక్కడో ఓ మీటింగు జరిగిందని వార్త చదివా… గద్దర్ గళం అనే సంస్థ గద్దర్‌నే జాతిపితగా ప్రకటించాలి అని డిమాండ్… ఎందుకయ్యా అంటే బుల్లెట్లు దేహంలో ఉంచుకుని తెలంగాణ కోసం పోరాడాడట… సరే, వాళ్ల డిమాండ్ వాళ్లది, అక్కడ పాశం యాదగిరి, కంచె ఐలయ్య తదితరులు కూడా పాల్గొన్నారు కాబట్టి ఆ వార్త కాస్త ప్రముఖంగా కనిపించింది మీడియాలో…

అసలే కంచె ఐలయ్య ఓ పర్వర్టెడ్ కేరక్టర్… తోడుగా పాశం… సరే, వాళ్ల భాష వాళ్లది, వాళ్ల బాధ వాళ్లది… కానీ తన జీవితాంతం వేలాది మంది యువకులు అడవుల్లోకి వెళ్లి, అన్యాయంగా ఆ ప్రాణాలు ఆరిపోవడానికి బాధ్యుడైన గద్దర్‌ను జాతిపిత అనడానికి తెలంగాణ సమాజంలో బోలెడంత వ్యతిరేకత వస్తుంది… సినిమా అవార్డులకు గద్దర్ పేరు పెట్టడమే ఎక్కువ… దాని మీద కూడా బోలెడు విమర్శలు వచ్చాయి… (ఆ దేహంలో బుల్లెట్లకు కారణం కూడా నక్సలిజమే తప్ప, తెలంగాణ పోరాటం కాదు…) అదీ వదిలేద్దాం…

గద్దర్

కాస్తో కూస్తో జాతిపిత అనిపించుకునే అర్హత ఉన్నది జయశంకర్‌కు మాత్రమే… తీవ్రమైన నిర్బంధాల నడుమ సైతం తెలంగాణ జెండాను ఒంటరిగా మోసిన చరిత్ర తనది… కేసీయార్‌ను మొదట్లో భరించిన అసాధారణ సహనం తనది… ప్యూర్ తెలంగాణవాది… గద్దర్ గళం ఓ మంచి పని చేసింది… కేసీయార్ వంటి కేరక్టర్లకు జాతిపిత అనిపించుకునే అర్హత ఏమాత్రం లేదనే క్లారిటీ, తెలంగాణ సమాజం హర్షించదు అనే క్లారిటీ ఇచ్చింది ఆ మీటింగ్…

సరే, అసలు విషయానికి వద్దాం…

జాతిపిత అనే పదమే లేదు మన సమాజంలో… గాంధీకి కూడా ఆ హోదా అనధికారికంగా ఇచ్చి, బహుళ ప్రచారంలోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ… రాజకీయ లబ్ధి కోసం, గాంధీ పేరును వాడుకోవడం కోసం… రాష్ట్రాలకు జాతిపితలు ఉండరు… రాష్ట్రాలు విడిపోతుంటాయి, కలుస్తుంటాయి చరిత్రలో… ఏ జాతికీ పిత ఉండదు…

ఏ జాతయినా తరాల చరిత్రలో మెల్లిగా ఓ విశిష్ట లక్షణాల్ని, కల్చర్‌ను, భాషను సంతరించుకుంటాయి... జాతికి పితలు, తాతలు, మాతలు, జామాతలు ఉండరు... జాతిపిత, బాపు అనే పదాలే చరిత్రలో అత్యంత అబ్సర్డ్ పదాలు... అచ్చం చంద్రబాబు వ్యాఖ్యల్లాగే..!!

.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణ జాతిపిత ఎవరో క్లారిటీ వచ్చేసింది… ఇక రచ్చ ఆపేయండి…
  • రోహిణి సింధూరి..! చీట్… నో క్లీన్ చిట్…! శుద్ధపూస ఏమీ కాదట..!!
  • యువ సన్యాసి విషాదకర మరణం… విషాదంలో జైన సమాజం…
  • అందరూ ఆడుకునేవాళ్లే..! అమరావతి రాజధాని ఓ విషాదగాథ…
  • శని అంటే శని… అంతే… ఎవరూ అతీతులు కాదు… ఐదూళ్ల కథ కూడా…
  • మోటోక్రాస్ రేసింగ్..! టెక్నికల్లీ హైస్టాండర్డ్స్… ఎమోషనల్లీ వీక్…!!
  • పాండవులు అడిగారు ఐదూళ్లు… ఇప్పుడు తెలంగాణ అడుగుతోంది…
  • రకాస ముచ్చట… దెయ్యాల కోటలో పెళ్లి ఆపిన పెళ్లికాని ప్రసాదు..!
  • హిందీ రాముడికన్నా మన తెలుగు రాముడే బాగున్నాడు..!!
  • హీరో రాజేంద్రప్రసాద్ మరో పెళ్లాం… కానీ పెద్దగా అచ్చిరాలేదు పాపం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions