ఏమాటకామాట చెప్పుకోవాలి… మన తెలుగు టీవీల్లో కామెడీ మరీ నేలబారు… వికృతం… కానీ అప్పుడప్పుడూ కొన్ని ప్రేక్షకుడిని కనెక్టవుతున్నయ్… భిన్నంగా, ఉద్వేగంగా..! టీవీల్లో కామెడీ షోలను చూసే ప్రేక్షకులే ఎక్కువ… నాన్-ఫిక్షన్ రియాలిటీ కేటగిరీలో ఈ కామెడీ షోలకు వచ్చే రేటింగులే టీవీలకు కాస్త ఊపిరి… ఒక్కసారి తాజా స్థితి పరిశీలిస్తే… నాసిరకం కామెడీ అయినా ఈటీవీ ప్రధానంగా ఈ జానర్‌ను నమ్ముకుంది… ఢీ, క్యాష్, వావ్ వంటి షోలైనా సరే… డాన్సులు అనబడే పిచ్చి గెంతులకు, ఆటపాటలకు తోడు కాస్త కామెడీని కూడా జోడిస్తున్నారు… జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్, జబర్దస్త్ ఎక్సట్రా డోస్ గట్రా జనం చూస్తూనే ఉన్నారు… దీనికి అదనంగా శ్రీదేవి డ్రామా కంపెనీని అదనంగా తీసుకొచ్చారు… ఇక ఈటీవీ ప్లస్ కోసం రెచ్చిపోదాం బ్రదర్ అని సుమ భర్త రాజీవ్ కనకాల జడ్జిగా స్టార్ట్ చేశారు…
జెమిని టీవీని వదిలేద్దాం… ఏవైనా కొత్త సినిమాలు ప్రసారం చేస్తే తప్ప దాన్ని చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య చాలా స్వల్పం, వాళ్లే వదిలేశారు… ఈటీవీ కామెడీ జానర్‌కు దీటుగా మాటీవీ వాడు కామెడీ స్టార్స్ ప్రసారం చేస్తున్నాడు గానీ మరీ అది మూడున్నర, నాలుగు రేటింగుల దగ్గర కొట్టుకుంటోంది… తాజా బార్క్ రేటింగుల్లో కూడా పూర్… పెద్ద చూడబుల్ అనిపించడం లేదు కూడా… నిజానికి మాటీవీ వాడి ‘రేటింగ్స్ నైపుణ్యాల’కు అది మంచి రేటింగ్స్ సాధించాలి, ఐనా ఫ్లాప్ అయ్యిందంటే అదెంత బోరింగ్ ప్రోగ్రాం ఐపోతోందో అర్థం చేసుకోవచ్చు… ఈటీవీలోని పలు కామెడీ షోలలో చేసే కమెడియన్లనే దింపినా సరే రెచ్చిపోదాం బ్రదర్ కూడా ఫ్లాప్… వాటి రేటింగుల గురించి చెప్పుకోవడం కూడా దండుగే… ఈటీవీ వాడికే దిమ్మతిరిగిపోయి ఉంటుంది అవి చూసి…
Ads
చెప్పుకోవాల్సింది శ్రీదేవి డ్రామా కంపెనీ… మొదట్లో మరీ నాసిరకంగా ఉండేది… ఈమధ్య సుడిగాలి సుధీర్‌ను యాంకర్ని చేసి, కాస్త స్కిట్ల తీరును మార్చారు… కేవలం కామెడీయే గాకుండా పలు సామాజిక అంశాలతో ఎమోషనల్ బిట్లు కూడా చేయిస్తున్నారు… కొన్ని సాహసకృత్యాలు, డాన్సులు గట్రా యాడ్ చేస్తున్నారు… మొన్నటి బతుకమ్మ, గౌరమ్మ వంటి అనాలోచిత బిట్లతో అక్కడక్కడా శృతి తప్పుతున్నా సరే… కొంతమేరకు మెరుగుపడినట్టే… టీవీ షోలలోకి కమెడియన్లు, ఆర్టిస్టుల కుటుంబసభ్యుల్ని తీసుకొచ్చి పరిచయం చేయడం, తమ కుటుంబాల స్థితిగతులను చెప్పుకోవడం ఎప్పుడూ ఉంది… ఈసారి కొత్తగా ‘నాన్నకు ప్రేమతో’ అని ట్యాగ్ పెట్టేసి… కొందరు కమెడియన్ల తండ్రులను తీసుకొచ్చారు… వీళ్లు రెగ్యులర్‌గా పోషించే పాత్రల్నే వాళ్లను పోషించమన్నారు… ఇమాన్, నూకరాజు, కొమురక్క అలియాస్ కొమురం, బుల్లెట్ భాస్కర్, కార్తీక్ తదితరుల ఫాదర్స్ వచ్చారు…
ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే..? అందరూ కొడుకులకు దీటుగా భలే పంచులు వేశారు… రెగ్యులర్ ఆర్టిస్టుల్లాగే తమకు ఇచ్చిన పాత్రల్ని పోషించారు… అఫ్ కోర్స్, ముందుగా స్వల్ప రిహార్సల్స్ చేయించి ఉంటారు, కానీ అప్పటికప్పుడు స్టేజీకి అలా వీజీగా అడాప్ట్ అయిపోయి రక్తికట్టించడం విశేషమే… పనిలోపనిగా వాళ్ల తండ్రుల గురించి, కుటుంబాల గురించి కమెడియన్లు పంచుకున్న విషయాలు కూడా ఎమోషనల్‌గా ఉండి ప్రేక్షకుల్ని కనెక్ట్ అయ్యేలా ఉన్నయ్… ఆ కామెడీయే కాదు, ఎమోషనల్ కంటెంట్ ఉన్న కొన్ని బిట్లలో కూడా ఈ కమెడియన్లే బాగా పర్ఫామ్ చేస్తున్నారు… అంటే రెగ్యులర్ యాక్టింగ్… గుడ్… మంచి టైమింగుతో కామెడీ చేయగలవాడికి మిగతా సబ్జెక్టులు ఓ లెక్కా..!! సుధీర్‌కు తోడుగా మరో ఫిమేల్, యాక్టివ్ యాంకర్‌ను గనుక పెడితే ఇంకాస్త రంజింపజేసే చాన్స్ ఉందేమో…!!
Share this Article